తాత గారు గురించి నేను ఎందుకు ఇంత ఆలోచిస్తాను అంటే నాకు ఒక సమాధానం వస్తుంది. మా వారు కూడా చిన్న వయసులోనే ఎంతో ధైర్యంగా చేస్తున్న వుద్యోగం వదిలి పెట్టీ కేవలం తన తెలివి తేటలు మీద నమ్మకం తో ఇండస్ట్రీ పెట్టారు. జీవితంలో లో ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినా, అదే దైర్యం తో ముందుకు సాగారు. బహుశ నాకు మా వారిని చూసాక మా తాతగారు కూడా ఇలా వుండే వారు అనిపిస్తుంది. ఆ రోజుల్లో ఆయన కున్న విజన్ గురించి ఇపుడు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ఎక్కడా తడబడలేదు. జినీయస్. ఎన్ని సార్లు వ్యాపారము లో నష్టము వచ్చినా , మరలా నిలదొక్కుకుని ఒక క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి గా జీవించారు. ఆయన తన సంసారము ను ఒక త్రాటి మీద నడిపి ఎప్పటికి గుర్తు వుండిపోయే చాలా పనులు చేసి ఒక sucessfull Man గా ఈ మాట కు తెలుగు లో ఎలా చెప్పాలో తెలియదు, జీవితాన్నీ చాలించాడు. తాత గారి వ్యక్తి గత జీవితం గురించి కొంత తెలుసుకుందాము. ఈ విశేషాలన్నీ అమ్మ, అత్తయ్య ల చెప్పుకుంటూ వుంటే విన్నవే. నాకు ఊహ తెలిసినప్పటి కే ఆయన వ్యాపారము మానుకొని ఇంట్లో నే వుండే వారు. ఇల్లు అంతా ఒక క్రమశిక్షణ తో ఉండేది. మా నాయనమ్మ గారు ఆయన కన్నా ముందే కాలం చేశారు. మా నాయనమ్మ గారి పుట్టిల్లు మా వూరు దగ్గర వున్న ఒక పల్లెటూరు. మా తాత గారు ఆజానుబాహుడు చాలా అందముగా, హుందా గా వుండేవారు. మా మామ్మ గారు అందంలో మా తాతగారి కన్నా తక్కువే. ఆవిడ పుట్టింటి వాళ్ళు మంచి ధనవంతులు అనుకోవాలి. తాత గారి కి భాద్యతలు వున్నా, తెలివి కలవాడు, జీవితము లో పైకి రాగ ల డ నే వుద్దేశం తో వివాహం జరిపించి వుండవచ్చు. అవిడ మా తాత గారి కి మంచి అదృష్టం తెచ్చి పెట్టారు. తాత గారి అన్నదమ్ముల లో అందరి కన్నా చిన్న వాడు స్కూల్ లో నే టీచర్ గా పనిచేసేవారుట కానీ ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయారుట. ఆయన భార్య తాత గారి బంధువులే. ఆ చిన్న మామ్మ గారు పిల్లలందరినీ ఎంత ప్రేమ గా చూసేవారంటే మేము ఇప్పటికీ ఆవిడ ప్రేమ ను ఇప్పటికీ తలచు కుంటాము. తాత గారి చిన్న తమ్ముడు మా పెద్ద నాన్న గారితో చెన్నపట్నం వెళ్ళేవారు కదా, అయన అక్కడే వ్యాపారము లో స్థిరపడ్డారు. తాత గారి చెల్లెలు కూడా మా యింట్లోనే వుండేవారు. తాత గారు మా రెండో అత్తయ్య ను మేనల్లుడు కి యిచ్చి వివాహము చేశారు. మా మామ్మ గారు కూడా తన పుట్టింటి వైపు బంధువులను చాలా ఆదరించే వారు. ఇవ్వన్నీ ఎందుకు వివరంగా రాస్తున్నానంటే ఆ రోజుల్లో ఆడవాళ్లు ఎంత కలసి మెలిసి వుండి అందర్నీ ఆప్యాయంగా చూసే వారు. ఆరోజుల్లో వున్న ప్రేమలు, సేవ భావము ఈ నాడు ఏమయిందో అనిపిస్తుంది. మా మామ్మ గారు చాలా సమర్ధురాలయి వుండాలని అనిపిస్తుంది. మా ఇల్లు ఎపుడూ బంధువులతో కళ కళ లాడుతూ వుండేది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా తాతగారు వాకిట్లో అరుగు మీద కూర్చుని చుట్టూ పురోహితులు తో పురాణాలు చదివించు కోవడం ఒక గుర్తు వున్నది. ఆ వూరు లో వున్న ప్రతి గుడి లో తాతగారు ఏదో ఒక ఉభయం ఏర్పాటు చేశారు. అక్కడ వున్న క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్ కు కూడా డొనేషన్ ఇచ్చారు. ఆ హాస్పిటల్ దగ్గర గా ఒక ధర్మ సత్రం కూడా కట్టించారు. ఆ వూరి కాలేజీ కట్టించి నపుడు కమిటీ మెంబర్ గా వుండి ధన సహాయము చేశారు. ఇప్పటికీ ఆ వూరిలో ఫలానా వారు అనే పేరు వుండేటట్లు చేశారు. ఆయన ఒక జినియస్. కానీ నాకు మాత్రం ఎపుడూ ఒక లీడర్ గా వున్న వ్యక్తి కి మనం చేశాము కదా, ఇలా అందరూ చేయగలరు అనే ఆలోచన వుంటుంది. కానీ నాకు మాత్రం అది సరి కాదు అనిపిస్తుంది. నా ఆలోచన కరెక్ట్ అవునా, కా దా అనేది కాలం నిర్ణయిస్తుంది. ప్రతి వ్యక్తి గెలుపు వెనక వున్న భార్య ను ఎవరూ గుర్తు వుంచుకోరు. ఆమె ఒక కొవ్వత్తి లాగా తను కరిగి పోయినా చుట్టూ వెలుగు నింపుతుంది. తాత గారు మీరు ఒక వ్యవస్థ. మీరు ఎక్కడ వున్నా మీ ఆశీస్సులు మీ కుటుంబము మీద వుండే టట్లు ఆశీర్వదించండి.
మా తాత గారి గురించి నాకు తెలిసినంత 3
murthydeviv
コメント