top of page
Search

మా అత్తయ్య గారి తోట మా మూడో అంతస్తు

  • murthydeviv
  • Dec 10, 2024
  • 2 min read

జ్ఞాపకం వ స్తే విరజాజి సౌరభం లాగా మనసును పరవశింప చేసే మధురమైన బాల్యాన్ని ఇచ్చిన ఆ పెద్దలందరికి నమస్సుమాంజలి ఆ పెద్ద వాళ్ళు e ఏ లోకంలో ఉన్నా వాళ్ళ ఆశీస్సులు మన కుటుంబా లందరి మీదా వుండాలని ఆశిస్తున్నాను ఇంక ముందు మా మూడో అంతస్తు గురించి చెప్తాను అందరి ఇళ్ళలో అంతస్తు లు వుంటాయి కదా అంత ప్రత్యెక త ఏమిటీ అంటారు. కదా కానీ మా మేడలో మూడో అంతస్తు కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇపుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వీకెండ్ రిసార్ట్స్ ఫార్మ్ హౌస్ లాంటిది మా మూడో అంతస్తు అంటే మీకు నవ్వు వస్తుంది కదా కానీ వీకెండ్ దాకా ఆగకుండా ఏ రోజైనా సాప్ట్ వేర్ ఉద్యోగులకు రిలాక్స అవటానికి ఫ్రీ గా వుండే కూల్ రిసార్ట్ అన్నమాట వేసవి కాలంలో పగలు వడియాలు మాగాయ ముక్కలు గట్రా ఎండ పెట్టవచ్చు ఎదో రిసార్ట్ అని చెప్పి వడియాలు అంటారు ఏమిటి ఆనుకుంటు న్నారా పగలు ఎండ వున్నా రాత్రి పూట మా మూడో అంతస్తు అందాలు చూడాలి దూరం నుంచి వీచే చల్లటి సముద్రపు గాలి ఆకాశము లో తార ట్లాడే నీలి మబ్బుల చాటున దో బూచు లాడే పున్నమి చంద్రుడు మల్లె పూలు పరిచినట్లు వుండే తెల్లని వెన్నెల అమవాస్య అయితే నల్లటి చీర మీద చక్కని తళుకులు కుట్టిన జలతారు చీర లాగా వున్న ఆకాశాన్ని చూస్తూ కబుర్లు. చెప్పుకుంటూ పాటలు. పాడుకుంటూ చల్లటి గాలిని ఎంజాయ్ చేయవచ్చు రిసార్ట్ అయితే వెన్నల ను. ఎంజాయ్ చేయలేము కదా ఎయిర్ కండిషన్ రూమ్ లో పడుకో వాలి కదా ఇంకా మా చిన్నతనం లో పెళ్ళిళ్ళ కు వుదయం పూట పెళ్ళి కూతురు ఫోటో షూట్ కు మా మూడో అంతస్తు కు తప్పక రావాలి పెళ్ళి అయ్యాక కొత్త దంపతుల ఫోటో షూట్ కు మా మూడో అంతస్తు పిట్టగోడ స్వాగతం పలుకుతుంది ఎందుకంటే పిట్ట గోడ పక్కనే వుండి ఆనందం గా తలలు ఉపుతూ వాటి అంగీకారం తెలుపుతూ వుండే కొబ్బరి ఆకులు కొత్త దంపతులను ఆశీర్వదిస్తూ వుంటాయి కావాలంటే మా యింట్లో జరిగిన పెళ్ళిళ్ళ ఫోటోలు చూడండి కొబ్బరి ఆకులు లేకుండా ఒక్క ఫోటో కూడా వుండదు మా మూడో అంతస్తు ఇంతే నా అనుకోకండి మరీ చిన్న తనం లో ఉప్పాట లు కుంటి ఆటలు అడటం సినిమాలు చూసి వచ్చి పిల్లల లందరం a సినిమాలను డ్రామా లాగా ఆడటం ఎంత బాగుంటుంది ఈ మధ్య లో బామ్మ లు చెప్తే పైకి ఎక్కగలిగిన వంటవాళ్ళు వచ్చి మడి బట్టలు ఆరేసి ముట్టుకోక అండి అంటే అలాగే అని బుర్రలు ఊ పి వాళ్ళు వెళ్ళగానే a బట్టల మధ్య దొంగాట లు. అడవచ్చు అని మీకు తెలుసా ఇంక టీనేజర్స్ అయితే పైకి వచ్చి కలలు కంటూ వుండ వచ్చు మా మూడో అంతస్తు కు ఇంకొక సౌకర్యము వున్నది దగ్గర లో ఏదో సినిమా హాలు వున్నది సన్నగా పాటలు వినిపిస్తూ వుంటాయి కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిలు వంటరి గా వుంటే విరహ గీతాలు పాడు కోవచ్చు కొత్త దంపతులు ప్రేమ గీతాలు పాడు కోవచ్చు ఇంక కాలేజీ లో చేరిన అబ్బాయిలు వాళ్ళ అమ్మ నాన్న లకు తెలియకుండ సిగరెట్ లు తాగవచ్చు సరే ఇక మూన్ లైట్ డిన్నర్ లు ఎన్నయినా చేసికోవ చ్చు ఆ రోజుల్లో భోగి మంటలు తప్పితే. క్యాంప్ ఫైర్ లు తెలియదు ఇవ్వన్నీ ఎందుకు రాశా న అంటే మా మూడో అంతస్తు మంచి రిసార్ట్ లాంటిది అని ప్రూవ్ చేయాలీ కదా.అందుకు ఇంకా కొన్ని కబుర్లు తో రేపు

 
 
 

Recent Posts

See All
అమృత హస్తం

ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు...

 
 
 
పెళ్ళి పెట్టె

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page