top of page
Search

మా అత్తయ్య గారి తోట 2

  • murthydeviv
  • Dec 15, 2024
  • 2 min read

Updated: Nov 14, 2025

నిన్న కొన్ని మా ఆటలు గురించి చెప్పా ను కదా ఇంక అసలైన ఆనందం అట్లతదియ ఊయల ఊగటం పెద్ద వేపచెట్టు కు ఊయల వేస్తే కొంచెంగా బలంగా ఊపారంటే ఆకాశము లోకి వెళ్లినట్టు వుండేది అందరితో పోటీగా ఉగుదామని పంతం పట్టి ఉగేవల్లం ఒక్కొక్క సారి కళ్ళు కూడా తిరిగేవి అయినా అదొక పీచ్చి ఆనందం.మా అత్తయ్య నాలుగో కూతురు ఆటల్లో పరుగు పందెంలో గుజ్జనగుళ్లు వండటం లో బొమ్మ లు పెట్టంటం లో అన్నింట్లో ముందు వుండేది. ఉప్పాట లో తను కానీ మా అన్నయ్య కానీ చేతులు చాపి నుంచున్నా రంటే మాకు ఉప్పుతెచ్చే ఛాన్స్ లేదు పున్నాగ పూలతో దండలు కట్టి బొమ్మల పెళ్ళి చేసే వాళ్ళం వెన్నెల లో. నీడ తొక్కితే ఔట్ అయినట్లే . మా చెల్లెలు ఈ ఆట మా పిల్లల తో అడించేది . మా అమ్మాయిలు వెన్నెల రోజుల్లో వాళ్ళ పిన్ని నీ గుర్తు చేసికుంటారు . అతోట లో పడి ఆడుతుంటే మాకు అసలు విసుగు వుండేదికాదు మా అత్తయ్య గారి ఇంట్లో పెళ్ళిళ్ళ కు ఫోటో షూట్ తోట లో అని చెప్పక్కరలేదు కదా . అన్ని మధుర స్మృతులను తన లో దాచుకుకున్నాయి ఆ తోటలో చెట్లు . మా నాన్న గారు కార్తీక మాసంలో ప్రత్యేకంగా పున్నాగ పూలు ఇంకా శివుడి కి ఇష్టమైన పూలన్నీ తెప్పించే వారు ఎపుడూ ఆటలేనా మీకు ఇంకా ఏమయినా తెలుసా అనుకుంటారేమో .మేము ఆ బాల్యం నుండే ఎన్నో నేర్చుకున్నాము ఓర్పుతో అందరితో కలిసి మెలసి ఉండటం. ఏమున్నా అందరితో పంచుకోవాలని అనుకుంటాము ఇప్పటికీ మా కజిన్స్ కలిస్తే చిన్నప్పటి కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీ గా గడుపుతాము మా అత్తయ్య నాలుగో కూతురు పెద్దయ్యాక ఎంబ్రాయిడరీ పెయింటింగ్ డికోరేషన్ ఆర్టికల్ క్ చేసేది . ఈ రోజుల్లో అయితే బోటిక్ పెట్టే వారు మా పెద్ద అత్తయ్య చాలా ఓర్పు గా వుండేది . ఎపుడో ఒకసారి కోపము వచ్చేది . అపుడు వరసగా అందరికీ వీపు మీద దెబ్బ పడేది . అందులో మీ మా తేడా ఉండేది కాదు . ఒక్కళ్ళ మీద కోపం వచ్చినా అందరికీ సమానంగా వడ్డింపు పడేది ఇంతకీ ఆవిడ కోపం కారణం ఏమిటి అంటే పండగ రోజు అందరూ కళ కళ లాడుతూ తయారు అవ్వాలి అత్తయ్య పిలవగానే పూజ కు రావాలి అవిడ ఎపుడూ దర్జా గా వుండేది అందరూ అలాగే వుండాలి అవిడ ఎక్కువ చదువుకోలేదు తెలుగు చదవటం రాయటం వచ్చు కానీ అవిడ చాలా గొప్ప వ్యక్తి. మనం ఎన్ని మా నేజిమెంట్ కోర్సులు చేసినా ఆమె లాగా మానే జ్ చేయ లేము అమ్మ వారి మీద శివుడు మీద ఎన్నో పాటలు వ్రా సింది మా చిన్న తనంలో వానర మూక లాంటి మమ్మల్ని భరించటం మే కాకుండా పెద్ద అయ్యాక కూడా ఏ సహాయం చేయడానీ అయినా వచ్చేది అత్తయ్య ఒక వ్యక్తి కాదు. ఒక ఇనిస్టిట్యూట్ అనిపిస్తుంది తోట అంటే అత్తయ్య గుర్తు రాక తప్పదు కదా ఆమె ఆశిస్సులు మనందరికి ఉండాలని కోరుకుంటూ

 
 
 

Recent Posts

See All
పెళ్లి సంగీతం

ఈ రోజు ఉదయాన్నే ఎమ్ ఎస్ అమ్మ పాడిన అన్నమాచార్య గీతాలు వెతుకు తుంటె పూరయ మమ కామమ్ కీర్తన కనిపించింది. ఆ కీర్తన కృష్ణ లీలా తరంగిణి లో వింటుంటే చాలా ఆనందం తో పాటు అనేక పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్

 
 
 
బ్లాక్ అండ్ వైట్ టీ వీ

రోజూ లాగే లంచ్ అవగానే శయనించి , పాత రోజుల్లో అయితే నిద్ర పట్టిందాక ఏ పత్రిక, ప్రభ తిరగేసి కునుకు తీసే వాళ్ళం ఇప్పుడు అలాకాదు, మన అరచేతి స్వర్గం లో ముఖ పుస్తకం చూస్తే కాని నిద్ర పట్టదు ఏమయినా

 
 
 
మహా నగరం ముచ్చట్లు

ఈ మధ్య అనుకోకుండా రెండు మహా నగరాలు కి వెళ్ళాను. చెన్నై గా మారిపోయిన చెన్న పట్నం తో చిన్నతనం నుండి అనుభందం వుండేది. మా చిన్నతనం లో , మా నాయనమ్మ మా ఇంట్లో ఏ కొత్త వస్తువు తెచ్చినా పట్నం నుంచి మా అబ్బ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page