top of page
murthydeviv

బ్రిడ్జి మోహము

బ్రిడ్జి అంటే ఏదో బ్రిడ్జి అనుకునేరు. అది పేక ముక్కలతో అడే ఒక ఆట చాలా తెలివి గలవాళ్లు మాత్రమే అడ గలరుట.

ఇది మావారు చెప్పిన నిర్వచనము. ఈ పండుగ ప్రతి ఆదివారము కెమిస్ట్రీ రావుగారింట్లో గానీ మా ఇంట్లో గానీ చాలా సందడిగా జరుగుతూ వుండేది.అన్నట్లు చెప్పటం మర్చిపోయాను . అక్కడ మిలటరీ పనిచేసే తెలుగు బ్రహ్మ చారులు నలుగురు వుండే వాళ్ళు. కొత్త గా తెలుగు వాళ్ళు వస్తే పాపం వాళ్ళకి పండగ. ఆదివా రము వచ్చిందంటే వాళ్ళు కూడా మనల్ని సందర్శిస్తారు. వాళ్ళకు అందరూ అక్కలే వచ్చినపుడు మాత్రం అక్కలకు బావగార్లకు ఇతోధికంగా సేవ చేస్తారు.అంటే టీ లు, కాఫీలు అందించటం, సిగరెట్లు తెచ్చివటం, పిల్లలను, ఆడించటము. మొదలైనవి. ఇంతకీ వాళ్ళ కోరిక మంచి తెలుగు భోజనము మాత్రమే. మొదటి సారిగా వచ్చిన ఒక అబ్బాయి రాగానే అక్కా నాకు ముద్ద పప్పు చేసి పెట్టవా అని అడిగాడు. అదిచాల సింపుల్ కోరిక కానీ అప్పటికి ఇంకా మేము కుక్కర్ కొనలేదు. సరే ఎలాగో వండి పెట్టాను.. నీళ్లగా వున్న పప్పు చూసి అతనికి జీవితం అంటే విరక్తి పుడుతుందిట. నీళ్ళ పప్పు అంటే నాకు కొన్నేళ్ళ తర్వాత జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. మేము ఆంధ్రా కు వచ్చాక బీహార్ లో ఒక స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ గారింట్లో పెళ్లి కి వెళ్ళాము. వాళ్ళు బెంగాలీ వాళ్ళు. చక్కగా విస్తర్లు వేసి అన్నీ వడ్డించారు. మనవైపు లాగా కొంచెం పొట్టు తో వున్న పప్పు వడ్డించారు. మా వారు మా అన్నయ్య ఇద్దరూ చాలా ఇష్టం గా కలుపుకున్నారు. నేను కొంచెం టేస్ట్ చూసి కలపుకోండి అన్నాను. వాళ్ళ కు నా సలహా పాటించటం అలవాటు లేదు. నోట్లో పెట్టుకోగానే తెలిసింది తియ్య గా వున్నదని. పాపము ఇద్దరి ముఖ చిత్రమ్ చూడాలి. సరే ఇపుడు మనకథ కు వద్దాము. నాకు ఈ ఆట గోల విసుగు అనిపించినా చేసేదేమీ లేదు కాబట్టి, వాళ్ళ కు కావాల్సిన వి చేసి పెట్టీ నేను ఏదో నవల చదువుకునే దాన్ని.కానీ పాపం కెమిస్ట్రీ రావుగారు భార్య ను చూస్తే బాధ అనిపించేది.. వాళ్ళ ఏడాది పాప వీక్ గా వుండేది. తెగ ఏడుస్తూ వుండేది. వాళ్ళ అబ్బాయి తెగ అల్లరి చేసేవాడు. మిలటరీ అబ్బాయిలు నేను ఆవిడకు సహాయం చేసే వాళ్ళం. ఇంక ఆట మొదలు పెట్టారంటే ఆయనకు ఏమి పట్టేది కాదు . తర్వాత వాళ్ళు కొత్త గా ఫ్రిడ్జ్ కొన్నారు. ఇంక ఆట కు వచ్చిన వాళ్ళు అందరూ జోక్స్, భాభిజి అభి తక్ గరం పా నీ పి లా తీ థి , అభ్తో ఠండ పాని దే థీ హై క్యా అని . నాకు కొంచెం కోపం వచ్చినా నవ్వుతూ చెప్పాను, అభి ఠ ఢమ్ మే భీ ఠ న్డ్ పిలయ్గే అని . అలా జోక్స్ తో ఆటలతో సరదాగానే ఉంటుంది గానీ ఆదివారం వచ్చినా రెస్ట్ వుండేది కాదు. ఇంక కొన్ని కబుర్లతో రేపు.

19 views0 comments

Recent Posts

See All

సప్తశతి 3

సప్తశతి లోని కథ క్లుప్తంగా తెలుసుకుందాం. మన పురాణములలో కథలు చదివి ఈ కాలాన్ని బట్టి ఏవో అనుమానాలు వస్తూ వుంటాయి. మనకు ఇపుడు మన పురాణముల...

సంక్రాంతి సంబరాలు

స్కూల్లో ప్రోగ్రామ్ బాగా జరగటం తో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది.ఫిఫ్త్ , ఫోర్త్, క్లాసెస్ కు ఇంగ్లీష్, మ్యాథ్స్ టీచ్ చేసేదాన్ని....

దేవీ సప్త శతీీ. 2

లలితా సహస్ర నామాలలో కొన్ని నామములు దుర్గా సప్తశతి లోని దేవి అసుర సంహార కార్యక్రమమును తెలియచేయును. సప్తశతి లోని,700 శ్లోకములు ఏడు వందల...

Kommentare


bottom of page