top of page
Search

బొబ్బట్లు

  • murthydeviv
  • Mar 23, 2025
  • 2 min read

ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు నిన్న నే అందరం కలిసి ఏదో గెట్ టుగెదర్ కు వెళ్ళి వచ్చి, కేక్ కొని ఇచ్చి ఇంటికి వచ్చాము. వుదయం ఫోన్ చేసి విషెస్ చెప్పి అలా కూర్చుంటే ఏవో పాత విషయాలు అలా గుర్తు వస్తూ వుంటాయి ఆలా ఆలోచించే మెదడు మన కంట్రోల్ లో వుండదు. మనం ఏం చేస్తున్నా దాని పని అది చేస్తూ వుంటుంది. ఆ సంవత్సరం ఆ రోజు శ్రీరామ నవమి నేను అలా కూర్చుని వుంటే మా అమ్మ గారు తలంటి పోసుకో అత్తయ్య కు ఫోన్ చేస్తాను అని చెప్పింది. మా అమ్మ గారికి పక్కనే అత్తయ్య ఎపుడూ వుండాలి. నేను అబ్బ ఇపుడు తల స్నానము చేయను అనగానే మీ అత్తయ్య వస్తె ఊరుకోరు అని మా వదిన అమ్మ జంట కవుల్లాగ ఒకే సారి చెప్పారు. సరే ఆ కార్యక్రమం అవగానే మా అత్తయ్య వచ్చింది, చేతిలొ ఒక పెద్ద డబ్బా తో . ఆరోజుల్లో ఏ పండగ అయినా బొబ్బట్లు పులిహార, సగ్గుబియ్యం పాయసం తప్పక చేసే వారు. పిల్లలు అవ్వన్నీ తినము అనటానికి వీలు లేదు పండగ నాడు తప్పక తినాల్సిందే. ఇప్పటి లాగా వద్దు అనటానికి వీలు లేదు. ఈ రోజే పెరుగు అన్నం ఎక్కువ తిన మంటే మా మనవరాలు అందులో ఏమున్నయో ప్రోటీన్ ఎంత శాతం అని గూగుల్ చూసీ చెపుతున్నది. ఇంక పెద్ద వాళ్ళ లాగా మనం గూగుల్ నోరు, మనవరాలి నోరు అదుపులో పెట్టాలంటే మనం నోరు చేసుకోవాలి. మరలా బొబ్బట్లు కథ కి వస్తె అత్తయ్య రాగానే నాకు వద్దు అంటున్నా రెండు బొబ్బట్లు తినిపించిది. అమ్మ చేసిన మామిడికాయ పులిహోర తిన్నాను అని చెప్తే ఇంక పులి హోరకు బలవంతం చేయలేదు. తలంటి పోసికున్నవా అని ఎంక్వయిరీ చేసింది. ఆ రోజుల్లో పురుడు అయ్యాక పది రోజులు స్నా నమ్ చేయటానికి వీలు లేదు. ఒక నెలరోజులు వరకూ దుంప కూరలు, పండ్లు, పప్పు పెట్టే వారు కాదు. మా అత్తయ్య సాధారణంగా పని అంతా అయ్యాక చక్కగా లక్ష్మీ దేవి లాగా తయారు అయ్యి రేడియో ముందు కూర్చుని ఏదో పేపర్ గానీ, పత్రిక గానీ చదువుతూ కూర్చునే ది. ఎక్కువగా అనవసరమైన మాటలు మాట్లాడేది కాదు. అప్పుడు కూడా అలాగే రేడియో ముందు కూర్చుంది. అమ్మ కు నాకు ఆస్పత్రి కి వెళ్దామని వున్నది సరే ఆ మాట నేనే అంటే నీకూ మీ అమ్మ కు వూరికే భయము అంటూ సరే పదండి ఆంటూ బయలు దేరాం. ఆ హాస్పిటల్ మా యింటికి దగ్గర మా ఖంధాన్ అంతా అక్కడికే వెళ్తాము. డాక్టర్లు, నర్సులు అందరూ బాగా పరిచయము లేడీ డాక్టర్ అయితే మాకు క్లాస్మేట్ ఇంటర్లో. ఇంక హాస్పిటల్ కి వెళ్ళినప్పిటి నుంచీ నాకు ఒకటే వాంతులు. ఆ నర్సులు ఇంక ఒకటే జోకులు పెద్దమ్మ గారు ఎన్ని బొబ్బట్లు తినిపించారు అని వాళ్ళకి తెలుసుగా మా అత్తయ్య సంగతి.ఏదో ఎలుకకు ప్రాణ సంకటం పిల్లి కి చెలగాటం లాగా వాళ్ళ నవ్వులు చూస్తే నాకు కోపం వచ్చినా ఏమిచేయలేము కదా . అలా బొబ్బట్లు ప్రహసనం తో సాయంకాలం కి మా పాప పుట్టింది. హాస్పిటల్ వాళ్ళు గానీ, అమ్మ గారు గానీ మొదట ఏ పిల్లల్ని అయినా అత్తయ్య చేతి కే ఇస్తారు చాలా మంది లాగా మరలా ఆడపిల్ల నా అనకుండా ఇంకో చిట్టి తల్లి పుట్టిందే అంటూ అమ్మకు ఇస్తూ నా తల నిమిరింది. మరి ఆవిడకు ఎనిమిది మంది చిట్టి తల్లులు వున్నారు. పెద్ద అమ్మాయి దగ్గరనుండీ ఆఖరి చిట్టితల్లి వరకూ అవిడ అనురాగం, ఆప్యాయత లకు లోటు లేదు. మా అత్తయ్య మనవరాళ్లు కు కూడా పురుళ్ళు పోసింది. హాస్పిటల్ లో ఒక కుర్చీ లో ఒక పత్రిక చదువుతూ కూర్చునే ఆవిడకు ఎంత ఓర్పు, నేర్పు సహనం వున్నాయి అనిపిస్తుంది మా పెద్ద పాప పుట్టినప్పుడు కూడా లక్ష్మీ దేవి పుట్టింది అని చెప్పి ఎపుడూ ఫస్ట్ పాప పుడితే మంచిది అన్నది.. ఎపుడూ మా అమ్మాయి పుట్టిన రోజు అయినా ఆ రోజులన్నీ గుర్తు వస్తాయి. మన పెద్దవాళ్ళ నీ తలచు కుంటే ఏదో ఆనందం వస్తుంది. వాళ్ళ ఆశీస్సులు మనందరికీ వుండాలని కోరుకుందాం.

 
 
 

Recent Posts

See All
పెళ్లి సంగీతం

ఈ రోజు ఉదయాన్నే ఎమ్ ఎస్ అమ్మ పాడిన అన్నమాచార్య గీతాలు వెతుకు తుంటె పూరయ మమ కామమ్ కీర్తన కనిపించింది. ఆ కీర్తన కృష్ణ లీలా తరంగిణి లో వింటుంటే చాలా ఆనందం తో పాటు అనేక పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్

 
 
 
బ్లాక్ అండ్ వైట్ టీ వీ

రోజూ లాగే లంచ్ అవగానే శయనించి , పాత రోజుల్లో అయితే నిద్ర పట్టిందాక ఏ పత్రిక, ప్రభ తిరగేసి కునుకు తీసే వాళ్ళం ఇప్పుడు అలాకాదు, మన అరచేతి స్వర్గం లో ముఖ పుస్తకం చూస్తే కాని నిద్ర పట్టదు ఏమయినా

 
 
 
మహా నగరం ముచ్చట్లు

ఈ మధ్య అనుకోకుండా రెండు మహా నగరాలు కి వెళ్ళాను. చెన్నై గా మారిపోయిన చెన్న పట్నం తో చిన్నతనం నుండి అనుభందం వుండేది. మా చిన్నతనం లో , మా నాయనమ్మ మా ఇంట్లో ఏ కొత్త వస్తువు తెచ్చినా పట్నం నుంచి మా అబ్బ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page