top of page
Search

పోస్ట్ బాక్స్

  • murthydeviv
  • 2 days ago
  • 3 min read

Updated: 19 hours ago

ఒక నాలుగు నెలల క్రితం యూ ఏస్ లో వున్న నా ఫ్రెండ్ కి లెటర్ రాసి మా డ్రైవర్ ను పోస్ట్ ఆఫీస్ కి పంపాను. స్టాంప్ లు వేసి పోస్ట్ లో వెయ్యమని, మా డ్రైవర్ టెన్నిస్ బాల్ లాగా వెనక్కి వచ్చి నాలుగు వందలో ఐదు వందల స్టాంపు లు అవుతాయి ట అంటూ అయినా ఈ రోజుల్లో ఉత్తరాలు ఏమిటి అన్నాడమ్మ అంటూ ఒక డైలాగు చెప్పాడు. పోస్ట్ ఆఫీస్ లో పని చేసే వాళ్ళు అలా మాట్లాడం నాకు నచ్చలేదు. నా ఫ్రెండ్ కి రాసిన లెటర్ మా ఆఫీస్ కి పంపి నార్మల్ పోస్ట్ లో పంపాను. ఒక పదిహేను రోజులు కు చేరింది. ఇదంతా ఈ రోజుఎందుకుగుర్తు వచ్చింది అంటే సెప్టెంబర్ నుండీ పోస్ట్ బాక్స్ లు ఉండవుట అనే వార్తలు చూసి అయ్యో అని చాలా బాధ కలిగింది. నాకు ఇప్పటికీ ఏదయినా రాయటం మే అలవాటు అలా చేస్తే భాష కూడా బాగుంటుంది అనే ఐడియా. అసలు హ్యాండ్ రైటింగ్ వలన వాళ్ళ వ్యక్తిత్వం తెలుస్తుంది అని కూడా అంటారు. ఇపుడు అంటే ఈ మెయిల్, చాటింగ్, what's app వచ్చాయి కానీ ఒక ముప్పై, నలభై ఏళ్ల క్రితం కమ్యూనికేషన్ కి ఉత్తరాలే, ఏదయినా అర్జెంట్ గా ఉంది అంటే ఒక టెలిగ్రామ్ ఇచ్చే వారు.ఆ రోజుల్లో గొప్ప నాయకులు వాళ్ళ పిల్లల కో స్నేహితులు కో రాసిన ఉత్తరాలు తరువాత కాలంలో గొప్ప పుస్తకాలు గా ప్రాచుర్యం పొందాయి. అన్నీ ఫ్రాంక్ అనే టీనేజర్ రాసిన డైరీ వలన రెండో ప్రపంచ యుద్ధం లో సామాన్య ప్రజల కష్టాలు బయటకి వచ్చాయి. శ్రీ రమణ మహర్షి గారి దగ్గర ఉన్న సూరి నాగమ్మ గారు వారి అన్నయ్య కు వ్రాసిన లేఖ లు ఒక బుక్ లాగా ప్రచురణ పొంది ఎన్నో విషయాలను అనుభవాలు మనందరికీ తెలిసేటట్లు చేశాయి. ఆ పుస్తకము ఎన్నో సార్లు ప్రచురణ చేశారు. ఇంగ్లీష్ లో కి కూడా ట్రాన్స్లేట్ చేశారు.ఆ పుస్తకం ఎన్ని సార్లు చదివినా ఇంకా ఎవో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ లు వుండేవి అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళు కలిసి మెలిసి వుండే వారు. చిన్న వాళ్ళ కయితే వాళ్ళ కన్నా పెద్ద వాళ్ళని చూస్తే ఏదో ఒక హీరో వర్షిప్ లాగా వుండేది. ఏ పిల్లలు కయినా ముందు నాన్న గారు హీరో లాగా అనిపిస్తుంది. నా చిన్నతనం లోనే మా అన్నయ్య లు ఇద్దరూ చదువు కోసం వేరే ఊర్లు వెళ్లి పోయారు. అప్పటినుండి ఇంట్లో జరిగే చిన్న విషయాలు తో సహా వుత్తరం రాయడం అలవాటు అయింది. మా అన్నయ్య లు కూడా ఎక్కువగా అక్కడ విశేషాలు తో వివరంగా జవాబులు రాస్తూ ఉండే వారు. అలా చిన్నతనం లో అలవాటు అయిన ఈ లెటర్ రైటింగ్ చాలా రోజులు కొనసాగింది. స్కూల్ స్నేహితులు, కాలేజ్ ఫ్రెండ్స్ ఇంకా ఏదో చిన్న పాటి ఉద్యోగం లో అయిన ఫ్రెండ్స్ ఇలా రోజుకి కనీసం పోస్ట్ లో ఒక ఐదు ఆరు ఉత్తరాలు వుండేవి. ఇంకా కజిన్స్ పెన్ ఫ్రెండ్స్. ఉత్తరం రాని రోజు ఏదో వెలితి గా వుండేది. పాత రోజుల్లో ఉత్తరాలు అన్నీ ఒక సూది లాగా ఉండి కొంచెము వంకర గా వుండేది అది ఏ గోడకో తగిలించి వుండేది.ఈ ఉత్తరం అయిన దానిలో గుచ్చి ఉంచేవారు. అలాంటి చువ్వ నేను చాలా మంది ఇళ్లల్లో చూసాను. ఈ మధ్య మా ఇంట్లో పాత సామాన్లు అన్నీ తీసి సర్దుతూ ఉంటే మా మామగారు వ్రాసిన డైరీలు ఉత్తరాలు కనిపించాయి. ఆయన 1923 లో వాళ్ళ బాబాయ్ గారికి రాసిన ఉత్తరాలు ఉన్నాయి అది కార్డ్ కాబట్టి ఏమి పాడు కాలేదు . ఆ ఉత్తరాలు రిసీవ్ చేసుకున్న డేట్ కూడా రాశారు. అలా ఎన్నో ఉత్తరాలు ఉన్నాయి.అవి చూస్తుంటే వాళ్లు శ్రద్ధ కు కళ్ళు చెమర్చాయి. మా బావ గారు, మద్రాస్ లో చదువు కుంటూ, మా వారు రాసినవి అన్నీ డేట్స్ వేసి జాగ్రత్తగా దాచి ఉంచారు.అవి చదువుతూ ఉంటే ఆరోజుల్లో విషయాలు తెలుస్తూ వుంటాయి. మా అమ్మ గారు అయితే ఒక కార్డు లో అన్ని విషయాలు చిన్న అక్షరాలు తో చక్కగా రాసే వారు . మా నాన్న గారి తో ఎక్కువగా మాట్లాడటం అంటే కొంచెము బెరుకుగా వుండేది. కానీ నాన్న గారు రాసే ఉత్తరాలు ఎంతో ప్రేమగా ఎన్నో జాగ్రత్తలు చెపుతూ వుండేవి. అవ్వన్నీ ఇప్పుడు చూసి చదువుతూ ఉంటే మనం ఈ రోజుల్లో ఏమి మిస్ అవుతున్నామో అర్థం అవుతుంది. మా ఊర్లో ఏ రోజు అయినా పోస్ట్ లో వుత్తరం లేక పోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ వచ్చేది. ఇంక పంజాబ్ లో ఉన్నప్పుడు మా వారు ఇంటికి రాగానే ఉత్తరాలు ఏమీ లేవా అని అడిగితే, ఇస్తాను ముందు కొంచెము కాఫీ ఇవ్వు అని సమాధానం వచ్చేది. ఈ మధ్య నేనూ పిల్లలు తో కలిసి కాశి వెళ్ళినప్పుడు గుడి చూసాక బెనారస్ హిందూ యూనివర్సిటీ కి వెళ్ళాలని అంటే మా గ్రాండ్ చిల్డ్రన్ కి షరా మామూలుగా మనం చదువు కున్నాము అంటే అంత నమ్మకం ఉండదు. ఆ యూనివర్సిటీలో తిరుగుతూ ఉంటే సుమారుగా అరవై ఏళ్ల క్రితం మా అన్నయ్య ఉత్తరాల్లో వ్రాసిన హాస్టల్స్, ఆ క్యాంపస్ లో గుడి ఆ లాబొరేటరీస్ అన్నీ చూస్తూ ఉంటే ఆ ఉత్తరాలు చదివి న విశేషాలు అన్నీ గుర్తుకు వచ్చాయి. ఇంక అమెరికాలో ఉండే వాళ్ళ కు ఉత్తరాలు రాయడం, వాళ్ళు పంపే కలర్ ఫోటో లు చూస్తూ మురిసి పోతూ వుండే వాళ్ళం. ఏస్ టీ డి ఫోన్ లు వచ్చిన దాకా ఉత్తరాలు బాగానే నడిచాయి. మరీ ఫోన్ బిల్లు ఎక్కువగా వస్తూ ఉంటే మరలా ఉత్తరం వెళ్ళేది. ఇంక ఇపుడు అరచేతిలో స్వర్గం లాంటి ఫోన్ వచ్చాక what's అప్ లకు ఫోటో లకు విలువ లేకుండా పోయింది. ఎంత వీడియో కాల్ లలో మాట్లాడినా ఉత్తరంలో లాగా మన భావాలు ఎక్స్ప్రెస్ చేయ లేము అనిపిస్తుంది నాకు. మా వదిన అయితే ఈ మేసేజ్ లు నాకు ఇష్టం లేదు, నీ గొంతు ఫోన్ లో వింటూ కబుర్లు చెప్పుకోవడం నాకు ఇష్టం. తను అయితే ఎక్కువ ల్యాండ్ లైన్ ఫోన్ లోనే మాట్లాడేది. మన భావాలు అన్నీ రాసిన ఉత్తరాలు నీ పోస్ట్ బాక్స్ లో వేస్తూ అవి అందుకున్న వాళ్ళ భావాలను ఊహిస్తూ ఆ వుత్తరం ఎపుడు చేరుతుందో అనే జవాబు ఎపుడు వస్తుందో అనే ఊహ తో ఆ పోస్ట్ బాక్స్ మన ప్రియ నేస్తం లాగా వుండేది. ఇప్పుడు లెటర్స్ రాయకపోయినా ఆ పోస్ట్ బాక్స్ ఇంక వుండదు అనుకుంటే ఎదో బాధ వచ్చేసింది. డెబ్భై లోకి అడుగు పెట్టిన మన తరం ఎన్నో మార్పులు చూసాము. మన చిన్నతనం లో సెల్ ఫోన్స్ లేవు అంటే మా గ్రాండ్ చిల్డ్రన్ మీరు ఎలా ఉన్నారు అంటారు. మనం వాళ్ళ కన్నా ఎక్కువగా హాయిగా ఉన్నాము అని చెప్తాను. ఉత్తరం రాయటం ఒక కళా అనాలి. ఆత్మీయత కు గుర్తు గా అవసరానికి చుట్టం లాగా, ప్రేమ కి కానుక గా అంటూ లేఖా సాహిత్యము గురించి చెప్పారు. అలాంటి వుత్తరం మోసే పోస్ట్ బాక్స్ కూడా మాయమై పోతున్నది.

 
 
 

Recent Posts

See All
శ్రావణ భాద్రపదాలు

ఈ రెండు నెలలు అందరికీ తెలిసినవే కదా రాయటానికి ఏముంటుంది అనుకుంటారేమో, కాదేది కవిత కి అనర్హం అన్నట్లుగా పెన్ చేతిలో ఉంటే, సారి ఇపుడు...

 
 
 
హిందుస్తానీ సంగీతం

అసలు సంగీతం లో ఇన్ని రకాలు వుంటాయి అని తెలుసుకోటానికి జీవితంలో ఒక పాతికేళ్ళు గడిచిపోయాయి. మా పెద్దనాన్న గారు బయటకు వెళ్లగానే సిలోన్,,...

 
 
 
నవలా పఠనం 2

ఆంధ్ర దేశం లో కి శరత్ బాబు గారు ఎలా వచ్చారో నాకు తెలియదు కానీ ఆ పుస్తకాలు అన్నయ్య తెస్తూ వుండేవాడు ఎక్కువగా నా పుస్తకాలు చదివే అలవాటు...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page