ఈ రోజుల్లో చాలా మటుకు ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి అనుకోండి వుద్యోగం లో కొలీగ్స్ నో, క్లాస్ మే ట్స్ నో, ఇష్టపడి పెళ్ళి చేసుకుంటున్నారు. చాలా సంతోషించదగ్గ పరిణామం. వాళ్ళ మధ్య ఏవయినా అభిప్రాయ బేధాలు వచ్చినా మనల్ని బాధ్యుల్ని చేయరు. ఈ మధ్య ఎవరో బంధువులు అడిగితే మాకు తెలిసిన వాళ్ళ కు ఫోన్ చేశాను ఆమ్మాయి తల్లి సంబంధము గుఱించి చెప్పగానే అబ్బాయి ప్యాకేజీ ఎంత అని అడిగింది. నిజంగా అయితే నాకు ఆ అబ్బాయికి ఎంత జీతం వస్తుందో అని. నేను అడగలేదు, ఆ విషయము అడగటం మర్యాద కాదు కాబట్టి. నాకు అన్నింట్లో ఆడవాళ్లు సమానం లేదా ఒక మెట్టు ఎక్కువ అనుకునేవాళ్లు ఆ వచ్చే భర్త కు మిగతా అన్నీ బాగుంటే జీతం తక్కువ అయితే మాత్రము నష్టము ఏమిటి అనిపిస్తుంది. యింకా ముందు హోటల్స్ లోనూ బయట ఎక్కడో కలుసుకుంటాం అంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలియదు. ఇలా రెండు మూడు సార్లు హోటల్ కి వెళ్లిన నా ఫ్రెండ్ కొడుకు నాకు అసలు పెళ్లి వద్దు అన్నాడట. పూర్వపు రోజుల్లో పెళ్ళికి ముందు ఆ కుటుంబాల గురించి మధ్యవర్తులు ద్వారా అన్నీ కనుక్కునేవారు. చాలా మంది అమ్మాయిలు తమ తల్లితండ్రులు గుఱించి పట్టించుకున్నట్లు అత్త మామ గార్ల గురించి పట్టించుకోరు. వాళ్ళకు అత్త మామలు ఏది చేసినా తప్పు గా అనిపిస్తుంది. కనీసం ఒక పాతికేళ్ళ క్రితం పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా లేవు. పిల్లలకు పెళ్ళి చేసీ వాళ్ళు సుఖముగా వుంటే పెద్దవాళ్లం ఏదయినా ఓల్డ్ ఏజ్ హోమ్ లో వుండచ్చు అనే ఆలోచన చాలా మంది తల్లిండ్రులు కు వస్తున్నది ఒకప్పుడు అంటే మా చిన్నతనంలో నేను కూడా ఆడపిల్లలు బాగా చదువుకోవాలని ఉద్యోగం చేయాలనీ వాదించే దాన్ని. ఒకసారి మా పెద్ద అన్నయ్య పెళ్ళి చూపులకు మా అమ్మ నాన్నగారు బలవంతంగా తీసుకుని వెళ్లారు ఆ వూరు చాలా పల్లెటూరు ఆ ఆమ్మాయి తండ్రి ఆ వూరిలో డాక్టర్. పాపము ఆ అమ్మాయిని క్రింద చాప వేసి కూర్చోబెట్టారు. వెంటనే నేను కూడా వెళ్ళి ఆ అమ్మాయి తో క్రింద కూర్చున్నాను. ఇంటికి వచ్చిన తరువాత మా నాన్న గారితో అలా క్రింద కూర్చోపెట్టటం తప్పని వాదించాను. నాన్న గారు తర్వాత మా ఇద్దరు అన్నయ్య ల పెళ్ళిళ్ళ కు అదొక పాయింట్ లాగా గుర్తు పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్లినా అమ్మాయికి కూడా కుర్చీ వేయించేవారు. ఇప్పటి తరానికి అదంతా ట్రాష్ లాగా వుంటుంది. కానీ ఆ రోజుల్లో పెళ్లికి ముందు కుటుంబ విషయాలు, వాళ్ళ సాంప్రదాయం గురించీ చాలా వివరాలు కనుక్కునేవారు. నాన్న గారు కొన్ని ఇంటి పేర్లు చెప్పగానే వాళ్ళ కొన్ని గుణ గణాలు గురించి చెప్పేవారు. ఇప్పటికీ కొన్ని ఇంటి పేర్ల వాళ్ళ పద్ధతులు చూస్తే నాన్న గారు చెప్పింది ఎంత కరెక్ట్ అనిపించింది. ఇవ్వన్నీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆరోజుల్లో అన్నీ సరిగా వున్నాయి అనలేము. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి అంటే ఓర్పు సహనం లేకపోవడమే , చిన్న విషయాలను పెద్దగా చేసుకొని డైవోర్స్ తీసుకోవటం మధ్యలో పిల్లల జీవితం పాడు అవటం జరుగుతుంది. వుద్యోగం చేస్తున్న కోడళ్ళతో చిన్న చిన్న విషయాలకు అత్తగార్లు కూడా సర్దుకుంటే బాగుంటుంది. భార్య భర్తల మధ్య కీచలాటలు ల్లో ఏ తల్లి తండ్రులు కలిపించు కోకుండా వుంటే కొంత రిలీఫ్ వస్తుందేమో అనిపిస్తుంది. ఎంతో డబ్బుఖర్చుపెట్టి ఆర్భాటంగా పెళ్ళి జరిగిన ఒక సంవత్సరం లోనే ఇదిగో డివోర్స్ కు అయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సొసైటీ ఏమవుతుంది అని ఆలోచన వస్తుంది . ఈ రోజే ఎవరో తెల్సిన వాళ్ళ మీద 498కేసు వచ్చింది అని తెలిసి బాధ తో ఇలా రాయటం.
పెళ్లి పుస్తకం 2
murthydeviv
Comments