top of page

పంజాబీ వివాహము

murthydeviv

మా వారి ఫిజిక్స్ డిపార్టుమెంటు లో మొదట నలుగురు బ్రహ్మచారులు వుండేవారు. ఇద్దరు ఉత్తరప్రదేశ్ నుండి ఒకరు శర్మ, ఇంకొకరు తివారీ. ఇంకో ఇద్దరిలో ఒకరు పంజాబీ, ఇంకొకరు రాజస్థాన్. నలుగురిలో ఇద్దరో, ముగ్గురో, మా వారి తోపాటు యూనివర్సిటీ నుండి మాఇంటికి వచ్చి కాసేపు పాపతో ఆడుకొని భోజనం చేసి వెళ్ళే వారు. వీళ్ళందరికీ కొత్త గా మా లాగా చేరారు కాబట్టి ఇంకా క్వార్టర్స్ ఇవ్వలేదు. సరే ఆదివారం బ్రిడ్జి ఆడేవాళ్ళు ఆడుతుంటే, అడని వాళ్ళు భాభిజీ లకు ఏదో ఒక సహాయం చేస్తూ వుండేవారు. ఉత్తర్ ప్రదేశ్ ఫ్రెండ్స్ పెళ్లికి పిలిచారు కానీ మేము వెళ్ళలేదు. వాళ్ళే ఇక్కడి కి వచ్చాక హోటల్లో పార్టీ ఇచ్చారు. వాళ్లిద్దరి భార్యలు కూడా బాగానే ఫ్రైండ్లీ గా వుండేవారు. ఇంక పంజాబీ ఫ్రెండ్ పెళ్ళి జలంధర్ లో అయింది. అతను మీరు తప్పక రావాలి అని గొడవ. సరే మేమూ సరదా గా అందరమూ కలిసి బయలుదేరాము. నాకు నార్త్ ఇండియన్ పెళ్ళి చూడటం అదే మొదటిసారి. ఆ బారాత్ చూస్తుంటే విచిత్రం గా వుండేది. చిన్నా పెద్దా అందరూ డ్యాన్సులు, గుఱ్ఱం మీద కూర్చోలేక ఆ పెళ్ళికొడుకు అవస్థ. చూస్తే నవ్వు వచ్చింది. ఆడవాళ్లు అందరూ గాగ్రాలు , మేలి ముసుగు తో , నాకు తమాషా గా వుండేది. ఇపుడు ఇక్కడ కూడా గా గ్రాలు వేసుకుంటున్నారు కానీ ఆపుడు మన ఆంధ్రాలో అంత పాపులర్ కాలేదు. పెళ్ళి తంతు కూడా మన ఆంధ్రాలో వున్నంత తంతు వుండదు. వాళ్ళకు మెయిన్ గా అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయడం, పాపిట్లో సింధూరం దిద్దటం, నల్లపూసలు గోల్డ్ వే డైరక్ట్ గా వేస్తారు. పెళ్ళి తర్వాత విందు చాలా గొప్ప గా అరేంజ్ చేశారు. అక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా మనకు తెలియని ఒక ఆచారము, చాలా వింతగా అనిపించింది. పెళ్లి రాత్రి అయిపోయాక, మర్నాడు ఉదయం అడపెళ్లి వారు వచ్చి , బందువులను నాకు వాళ్ళు చెప్పిన ఆ మాట గుర్తు లేదు కానీ ఒక గదిలో పెళ్ళికూతురు కు యిచ్చే సామానులు అన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టీ చూడమంటారు. అందులో గోళ్ళ రంగులు, లిపిస్టిక్స్, డ్రెస్సులు, మంచాలు సోఫా సెట్, పరుపులు, రజాయులు, ఒకటీ అని చెప్పటానికి వీలు లేదు. నాకు అదేమిటో చాలా అనాగరికంగా అనిపించింది. నాతో వచ్చిన మిగతా ఫ్రెండ్స్ భార్యలు అక్కడ అది చాలా కామన్ అని చెప్పారు. అలా ఇచ్చి అందరికీ చూపెట్టకపోతే వాళ్ళు తప్పుగా ఫీల్ అవుతారు అని చెప్పారు. అది చూస్తే నార్త్ ఇండియా లో అమ్మాయిలు పుడితే ఎందుకు దిగులు పడతారో అర్థం అయింది. పెళ్ళి బాగా జరిగింది. ఆడ పెళ్లి వారు, మా ఫ్రెండ్ అమ్మ నాన్న గారు, మమ్మల్ని బాగా మర్యాద చేశారు. అక్కడ వాళ్ళ కి నా కంచి పట్టు చీరలు బాగా నచ్చినవి. అలా ఒక పంజాబీ పెళ్ళి చూడటం అయింది. మేము అక్కడ వుండగానే తివారీ ఫ్రాన్స్ వెళ్ళారు. పంజాబీ ఫ్రెండ్ అమెరికా వెళ్ళారు. వెళ్ళే టపుడు ఎంతో బాధ పడుతూ వెళ్ళారు. కొన్నాళ్ళు ఉత్తరాలు రాసేవారు. మావారు అమెరికా వెళ్ళినపుడు ఒక్క సారి కలిశారు. కాల ప్రవాహము లో ఎలాకలుస్తమో ఎలా విడిపోతామో తెలియదు. అక్కడ వున్నపుడు మాత్రము సొంత మరుదుల్లాగ భాభీజీ అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా వుండే వారు.

33 views1 comment

Recent Posts

See All

రథ సప్తమి జ్ఞాపకాలు

. కొంచెం పెద్ద వాళ్ళం అయ్యాక గడిచి పోయిన రోజులు గుర్తు వస్తూ ఉంటాయి చిన్నతనంలో చదువు తర్వాత పెళ్లి పిల్లలు, బాధ్యతలు జీవితము మనం ఆలోచించ...

అమ్మమ్మ అమెరికా యాత్ర 4

1995లో మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాక 2006లో మా అమ్మాయి పురిటికి మరలా అమెరికా యాత్ర కు బయలుదేరాను ఈ 11 సంవత్సరాలలో చాలా మార్పులు...

అమ్మమ్మ అమెరికా యాత్ర 3

అలా మొదలైన నా యాత్ర బహుశ రెండు నెలలు వున్నాను అనుకుంటా అమెరికాలో. మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ బాగా అయింది. నేను వెళ్ళిన ఒక పది...

1 Comment


Ramakrishnarao Lakkaraju
Ramakrishnarao Lakkaraju
Jan 04

పంజాబ్ పెళ్ళి సంగతులు బాగున్నాయి .

Like

Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page