top of page
Search

పంచ దశా క్ష రి మంత్రం

  • murthydeviv
  • Dec 20, 2024
  • 1 min read

ఈ మంత్రం గురించి నాకు తెలిసింది చాలా తక్కువ అయితే ఎందుకు వ్రాయటం అనుకుంటారేమో . మననం చేయునదే మంత్రము. మనం మామూలుగా రామా అనో కృష్ణా అనో అనుకుంటాము. భయము కలిగితే ఆంజనేయుడి నీ తలచుకుంటాము. అది మనకు చిన్నప్పటినుండి వున్న అలవాటు. ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం వరకూ అందరూ ఈ మంత్ర జపము జోలికి వెళ్ళే వారు కాదు. కానీ ఇపుడు ఎంతమంది గురువులు. టీవీ లో. బయట పూజలు ఉపన్యాసాలు. భక్తి, కూడా ఒక వ్యాపారము లాగా అయిపోయింది.. ఈ మంత్రాలని ఇపుడు చాలా పుస్తకాలలో కూడా చూస్తున్నాము. శ్రీదేవీ మంత్రమైన ఈ పవిత్రమైన మంత్రము శివ శక్తి స్వరూపా ల ప్రతీక. పంచ దశీ మంత్రము నుండే. శ్రీచక్రము ఉద్భవించి నది అని శ్రీ భాస్కర రాయలు తెలిపారు. ఈ మంత్రము కేవలము గురుముఖంగా నే తీసుకోవాలి చాలా నియమ నిష్ఠలతో

జపము చేయాలి . మనకు ఈ మంత్ర జపము యొక్క ఫలితం కావాలనుకుంటే త్రిశతి నామాలు శ్రద్ద గా పఠిస్తే అమ్మ వారి కరుణ మనకు కలుగుతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒక గురువు గారు ఈ రోజుల్లో మంత్రం యొక్క మహిమ ను గ్రహించ కుండా ఎలా బహిరంగంగా చెప్తున్నారు అని ఆవేదన చెందారు. అందువలన ఇదంతా రాయాల్సి వచ్చింది .

సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా ఎన్నో ఉపన్యాసాలలో ఈ విషయం గురించి చెప్పారు లలిత త్రిపుర సుందరి కరుణ మనకు లభించాలని కోరుకుంటూ శ్రీ మాత్రే నమః

 
 
 

Recent Posts

See All
పెళ్లి సంగీతం

ఈ రోజు ఉదయాన్నే ఎమ్ ఎస్ అమ్మ పాడిన అన్నమాచార్య గీతాలు వెతుకు తుంటె పూరయ మమ కామమ్ కీర్తన కనిపించింది. ఆ కీర్తన కృష్ణ లీలా తరంగిణి లో వింటుంటే చాలా ఆనందం తో పాటు అనేక పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్

 
 
 
బ్లాక్ అండ్ వైట్ టీ వీ

రోజూ లాగే లంచ్ అవగానే శయనించి , పాత రోజుల్లో అయితే నిద్ర పట్టిందాక ఏ పత్రిక, ప్రభ తిరగేసి కునుకు తీసే వాళ్ళం ఇప్పుడు అలాకాదు, మన అరచేతి స్వర్గం లో ముఖ పుస్తకం చూస్తే కాని నిద్ర పట్టదు ఏమయినా

 
 
 
మహా నగరం ముచ్చట్లు

ఈ మధ్య అనుకోకుండా రెండు మహా నగరాలు కి వెళ్ళాను. చెన్నై గా మారిపోయిన చెన్న పట్నం తో చిన్నతనం నుండి అనుభందం వుండేది. మా చిన్నతనం లో , మా నాయనమ్మ మా ఇంట్లో ఏ కొత్త వస్తువు తెచ్చినా పట్నం నుంచి మా అబ్బ

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page