నవలా సామ్రాట్
- murthydeviv
- 2 hours ago
- 3 min read
ఈ రోజు ఈనాడు పేపర్ లో ఈ హెడ్డింగ్ తో శరత్ బాబు గారి గురించి రాసారు. మా చిన్నతనం లో పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళ లైబ్రరీలో శరత్ బాబు గారి పుస్తకాలు లేకుండా వుండేవి కావు. ఆయన నవలలు శివ రామ కృష్ణ గారు, చక్రపాణి గారు అనువాదం చేశారు. చక్రపాణి గారు ప్రత్యేకంగా బెంగాలీ నేర్చుకుని మరీ అనువాదం చేశారట..ఈ రోజు శరత్ చంద్ర గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ ఆర్టికల్ రాసారు. ఆంధ్ర దేశం లో ఒకప్పుడు పుస్తకం పఠనం అలవాటు వున్నవాళ్ళు, తప్పకుండా ఆయన నవలలు చదివే వాళ్ళు. ఆరోజుల్లో బెంగాల్ దేశము లోని పూర్వ ఆచారాలు, కట్టుబాట్లు, మూఢ నమ్మకాలు అన్నిటినీ కళ్ళ కు కట్టినట్లు వ్రాసిన ఆయన నవలలు తెలుగులో ఇంగ్లీషు లోకి అనువదించబడ్డాయి. మేమూ కాలేజ్ రోజుల్లో నే ఆ పుస్తకాలు అన్నీ చదివాము. ఇంక లైబ్రరీ లాగా ఇంట్లో నే ఏర్పాటు చేసుకోవటం మొదలు పెట్టగానే చాలా బుక్స్ కొన్నాను. ఆయన రచనలు ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. అన్నింటి లోకి దేవదాసు ఎక్కువ సార్లు వచ్చిందిట. ఆయన రచనలు ఆధారంగా దాదాపు తొంబై సినిమాలు వచ్చాయిట. ఆయన జీవిత చరిత్ర ను హిందీలో విష్ణు ప్రభాకర్ అనే ఆయన వ్రాశారు. దేవదాసు సినిమా హిందీలో కే. ఎల్ సైగల్ తో వచ్చిందిట. తర్వాత దిలీప్ కుమార్, తెలుగు లో నాగేశ్వరరావు గారి తో తీసిన సినిమా ఒక కళా ఖండం గా నిలిచిపోయింది. పాటలు, సావిత్రి నాగేశ్వరరావు నటన తో నిజంగా జరిగిన సంఘటన లాగా నిలిచిపోయింది. తర్వాత తెలుగు లో అదే సినిమా ఇంకోసారి వచ్చింది కానీ నేను చూడలేదు. దేవదాసు సినిమా అంటే నాగేశ్వరరావు, సావిత్రి సినిమా అనే ఫీలింగ్ తో. మొత్తం మీద ఈ సినిమా ను మూడు భాషల వాళ్ళు ఎనిమిది సార్లు తీశారు.కానీ నవల కన్నా ఎక్కువగా హృదయాన్ని కదిలించిన సినిమా అంటే నాగేశ్వరరావు గారి దేవదాసు మాత్రమే.ఆ మాట దిలీప్ కుమార్ గారు కూడా ఒప్పుకున్నారుట. ఇంక మా పిల్లల బలవంతం మీద కొత్త యాక్టర్స్ నీ పెట్టీ తీసిన గొప్ప కళాఖండం దేవదాసు హిందీలో తీసిన సినిమా చూస్తూ మద్యలో కోపముతో లేచి వచ్చేసాను. యాక్టర్స్ నీ హై లైట్ చేయాలి అనుకుంటే కొత్త కథలతో సినిమా తీయొచ్చు కదా, కథ లు మార్చి పాత పేరుతో తీయటం ఎందుకో అనే బాధ కలిగింది. పరిణీత కూడా రెండు సార్లు వచ్చింది. మొదట అశోక్ కుమార్, మీనా కుమారి సింపుల్ గా బాగుంది యూ ట్యూబ్ లో ఉన్నది. రెండో సారి కూడా కథ ఎక్కువ మార్చకుండా ఈ రోజులకు తగ్గట్టుగా కలకత్తా వాతావరణంలో వున్నట్లు గా బాగానే ఉంది. సినిమా కథ కు తగిన కథ కాక పోయినా బడ దీదీ నవల ను భానుమతి గారు బాటసారి గా సినిమా తీశారు.ఈ నవల శరత్ బాబు గారి ఫస్ట్ నవల ట.ఈ సినిమా ఆరోజుల్లో హిట్ అయిందో లేదో తెలియదు కాని, నేను సి డి కొని చూశాను.ఆ కథ ను భానుమతి గారు కాబట్టి తీశారు, నాగేశ్వరరావు గారు కూడా గ్లామర్ రోల్స్ వేస్తున్న రోజుల్లో ఈ సినిమా చేయడం అనేది గొప్ప సాహసం. వాళ్లిద్దరి యాక్షన్ గురించి మనం ఏమి చెపుతాము . సినిమా ఒక గొప్ప కళాఖండం. భానుమతి గారి సినిమాల్లో పాటలు గురించి చెప్పటానికి మనం ఎంతటి వాళ్ళం. యూ ట్యూబ్ లో ఉందో లేదో తెలియదు కాని ఇప్పుడు అలాంటి సినిమాలు చూసే దైర్యం లేదు. ఆ దుఃఖం భరించ లేము. పాటలు మాత్రమే వింటూ వుంటాను. శ్రీకాంత్ నవల దూరదర్శన్ లో సీరియల్ గా వచ్చింది హిందీలో. తెలుగు లో తోడి కోడళ్ళు, ముద్దుబిడ్డ, వాగ్దానం అవ్వన్నీ శరత్ చంద్ర గారి నవలలే. హిందీలో లో కూడా చాలా కథలు సినిమాలు గా వచ్చాయి. మేము చదువుకునే రోజుల్లో శరత్ బాబు నవల అంటే ఏముంది కడివెడు కన్నీళ్ళు, బండెడు పాద ధూళి అని జోక్ వేస్తూ వుండేవారు కానీ ఆ రోజుల్లో వున్న వాస్తవ పరిస్థితులు ను కళ్ళకు కట్టినట్టు చేస్తూ వ్రాసారు. ఇప్పటికీ నవలలు ఇంగ్లీష్ లోకి కూడా అనువదించబడి యువత నీ ఆకట్టుకుంటున్నాయి. అన్నిటికన్నా నాకు ఆ ఆర్టికల్ లో నచ్చిన విషయం హౌరా కి అరవై కిలోమీటర్ల దూరంగా ఉన్న సమత అనే గ్రామంలో ఆయన ఉన్న ఇంటిని శరత్ చంద్ర కుటీరం అనే పేరుతో పర్యాటక కేంద్రం గా మార్చింది ట అక్కడ ప్రభుత్వం. అలాంటి మంచి రోజులు మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఎప్పుడు వస్తాయో అనిపించింది. కొసమెరుపు ఏమిటంటే ఆరోజుల్లో చాలా మంది ఆయన నవలలు చదివిన వాళ్ళు పిల్లలు కు ఆ పేర్లూ పెట్టే వారు. ఇప్పటికీ ఆ నవలలు గూగుల్ లో మంచి ప్రైస్ తో నే అమ్ముతున్నారు. నేను కొన్ని పేర్లు మాత్రమే రాసాను చరిత్ర హీనులు, శేష ప్రశ్న, కూడా మంచి నవల లు శ్రీకాంత్ ఆయన కథ అంటారు. ఏదయినా మంచి ఆర్టికల్ చూడగానే అందరికీ షేర్ చేయాలని ప్రయత్నం బుక్స్ ఎక్కడ అయినా దొరికితే చదవండి . చోటి బహు షర్మిల్ టాగూర్ సినిమా మన ముద్దు బిడ్డ బాగుంటుంది చూడండి యూ ట్యూబ్ లో ఉంది. అలాగే కొన్ని నవల లు చదువుతా ఉంటే కొంత బాధ కలుగుతూ ఉంటుంది అప్పటి జీవన విధానం, ఆచారాలు కట్టుబాట్లు, చూసి కానీ జీవితం ఒక ప్రవాహం ఆ ప్రవహించే నీటిలో ఎన్నో మలుపులు మార్పులు సహజము కదా. మన చిన్నతనం లో. వున్న పరిస్థితులు ఇప్పుడు లేవుకదా, అనే వేదాంతం ఆ వరిస్తుంది కాలం మన చేతిలో లేదుకదా.
Comments