నవలా పఠనం 2
- murthydeviv
- Aug 8
- 3 min read
Updated: Aug 9
ఆంధ్ర దేశం లో కి శరత్ బాబు గారు ఎలా వచ్చారో నాకు తెలియదు కానీ ఆ పుస్తకాలు అన్నయ్య తెస్తూ వుండేవాడు ఎక్కువగా నా పుస్తకాలు చదివే అలవాటు అన్నయ్య తోనే వచ్చింది. చందమామ కథలు తర్వాత ఈ నవలలు ప్రభలు పత్రికలు అలా అన్నీ చదవటం అలవాటు అయిపోయి,మా ఇంటికి మా అత్తయ్య గారి పిల్లలు వచ్చినప్పుడు పుస్తకం పట్టుకుని వాళ్ళ తో కబుర్లు చెప్పనని పుస్తకాలు దాచేవాళ్ళు. ఈ మధ్య ఈనాడు పేపర్ లో ఎడిటోరియల్ పేజీ లో పైన ఒక చిన్న ఆర్టికల్ రాస్తున్నారు ఎందుకు చదవాలి అని గారి పాల్సెన్ అనే అమెరికన్ వై డూ ఐ రీడ్ అనే కవిత వ్రాశారు అందులో ఆయన చాలా రాసారు. అందులో ఒక వాక్యం చదవటం అంటే అంటే ఒక స్నేహితుడు తో సమయం గడపటం అని వ్రాశారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మా ఊర్లోనే లేడీస్ కాలేజ్ స్టార్ట్ చేశారు ఆ రోజుల్లో కొంచెము పెద్ద ఫ్యామిలీ లో ఆడపిల్లలు ఉద్యోగం చేయడానికి ఒప్పు కునే వారు కాదు. నేను మాత్రం మా నాన్న గారి నీ ఎలాగో వప్పించి ఆ కాలేజ్ లో సైన్స్ సబ్జెక్ట్స్ కు డిమానస్ట్రీటర్ గా చేరాను. అక్కడ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెక్చరర్స్ తో కలిసి నాకు తెలియని కొత్త విషయాలు చాలా నేర్చుకున్నాను. అందులో ఇంగ్లీష్ నవల లు చదవటం, లలిత సంగీతము, ఎంకి పాటలు ఇలా ఎన్నో నేర్చుకున్నాను. మా నాన్నగారు సినిమా చూస్తే ఇంగ్లీష్ లో కథ రాయమని చెప్పే వారు . అపుడు అయితే విసుగ్గా ఉండేది కాని ఆ తర్వాతే దాని వల్ల ఉపయోగం తెలిసింది.ఆ కాలేజ్ లో ఉన్నప్పుడు క్లాసిక్ అని చెప్పుకునే అన్నీ ఇంగ్లీష్ నవల లు అన్ని చదివాను. కొత్త కాలేజ్ కాబట్టి లైబ్రరీ కోసం బుక్స్ తెప్పించే వారు. అలా అందరూ ఎవరిlకి ఇష్టమైన పుస్తకాలు వాళ్ళు సజెస్ట్ చేసి తెప్పించే వారు. ఇంగ్లీష్ లో వార్ అండ్ పీస్, అనే కరీనా , చార్లెస్ డికెన్స్, సోమర్సెట్ Mam పెరల్స్ బక్ , జేన్ ఆస్టిన్, అలా కాలేజీ లో ఎన్నో ఇంగ్లీష్ నవల లు చదివాను. తెలుగు లెక్చరర్ గారు విశ్వనాధ సత్యనారాయణ గారి నవలలు, పిలకా గణపతి శాస్త్రి గారి పుస్తకాలు , ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యం అప్పటికీ ఒకే బుక్ వచ్చింది. నేను తర్వాత మిగిలిన భాగాలు కొని చదివాను. వేయి పడగలు అప్పుడు చదవక పోయినా తర్వాత ఆ పుస్తకము కొని ఒక ఆరు ఏడు నెలల్లో పూర్తి చేయగలిగాను పిలకా గణపతి శాస్త్రి గారి విశాల నేత్రాలు పత్రిక లో సీరియల్ గా వచ్చింది కాశ్మీర్ అనగానే మనకు ముస్లిమ్ లు వుంటారు అనే ఐడియా వుంటుంది.కానీ శాస్త్రి గారి కాశ్మీరు పట్ట మహిషి కథలు చదివితే అక్కడ ఎంతటి కవులు, కవిత్వం, ఆ రాజులు వారిని పోషించి న విధానం అన్నీ తెలుస్తాయి. మేము గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు బెర్నాడ్ షా గారి పిగ్మాలిన్ నాన్డిటెయిల్ వుండేది. అదే మై ఫెయిర్ లేడీ సినిమా గా వచ్చింది. కొన్ని సినిమాలు అసలు నవల ను మరిచి పోయే టట్లు చేస్తాయి. అలాంటి సినిమాలో గైడ్ కూడా ఒకటి ఆర్ కె నారాయణ్ గారి నవల ను మరచి పోయేటట్లు చేసింది. నారాయణ్ గారి కథలు అన్నీ ఏదో మన ఇంట్లో జరగిన సంఘటన ల లాగా వుంటాయి. ఎపుడు చదివినా నిత్య నూతనంగా వుంటాయి. గాన్ విత్ ది విండ్ కూడా సినిమా చూశాను స్కార్లెట్ ఓ హ రా ను ఆ రోజుల్లో ఒక పవర్ ఫుల్ స్త్రీ పాత్ర లో చూడటం నాకు నచ్చింది . గుడ్ ఎర్త్ లో లాంటి పరిస్థితులు మనం ఇప్పుడు కూడా చూస్తూ నే ఉంటాము. ఈ మధ్య నే ఈనాడు పేపర్ లో ఆ నవల గురించి వ్రాసారు. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అబిడ్స్ లో ఏ ఏ హుస్సేన్ అనే బుక్ షాపు వుండేది. ఇపుడు ఉందో లేదో తెలియదు. అక్కడ ఎన్నో ఇంగ్లీష్ పుస్తకాలు కొన్నాను. చార్లెట్ బ్రాంటీ, ఎమిలీ బ్రాంటీ ఇద్దరూ అక్కాచెల్లెళ్ళు వాళ్ళు రాసిన బుక్స్ జేన్ ఎయిర్, వుథెరింగ్ హైట్స్ రెండూ ఫేమస్ నవలలు. జేన్ ఎయిర్ సినిమా కూడా యు ఎస్ లో చూసాను. ఉదరింగ్ హైట్స్ హిందీ సినిమా దిల్ దియా థర్డ్ లియా అనే సినిమా అన్నారు, సినిమా చూసి పైసా దియా థర్డ్ లియా అనుకున్నాము. నాకు మరలా మరల చదవాలి అనిపించే నవలలు daphin డ్యుమేరియర్, ఆవిడ రెబెకా ఎన్నో సార్లు చదివాను. చదువుతుంటే మనం కూడా ఆ వుడ్స్ లో వాకింగ్ చేస్తున్నట్లు,ఆ ప్యాలెస్ లో డిన్నర్ లు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆవిడ నవలలు అన్నీ చాలా మటుకు నా దగ్గర ఉన్నాయి.ఆ సినిమా కూడా బ్లాక్ అండ్ వైట్, కలర్ లో తీసిన సినిమాలు చూసాను కానీ నాకు ఎందుకో సినిమా కన్నా నవల బాగుంది అనుకుంటాను. హిందీ లో కూడా తీశారు కొహ్రా, Biswajit వహీదా యాక్టర్స్ పాటలు బాగుంటాయి. ఆవిడ ఇంకో nనవల ఫ్రెంచ్చె మాన్ క్రీక్అసలు నిజమైన కథ అన్నీ ఫ్రాంక్ డైరీ చదువుతుంటే చాలా దుఃఖం వస్తుంది. డాక్టరు జివాగో కూడా మంచి నవల. ఇవ్వన్నీ చదవలేని వారికి మాలతీ చందూర్ గారి పాత కెరటాలు అని రెండు భాగాల్లో చాలా నవల ను క్లుప్తం గా చెప్పారు. నాకు లాగానే మా అమ్మాయి నా మేన కోడలు బుక్స్ బాగా చదువుతారు ఈ మధ్య నా మనవరాళ్లు కూడా చదువుతున్నారు. వాళ్ళ కి రెబెకా నవల బాగా నచ్చింది. ఇపుడు నా ఇంగ్లీష్ బుక్ లైబ్రరీ మా మనవరాలు. మెయింటైన్ చేస్తుంది. నా నవల పఠనం 1 చదివిన మా అమెరికా చెల్లెలు చెపుతున్నది చికాగో లైబ్రరీ లో మనతెలుగు నవల లు ఉన్నాయి అని తను పనిచేసే లైబ్రరీ ద్వారా తెప్పించి చదువుతున్నదిట ఓహ్ చాలా గ్రేట్ అనుకున్నాను ఎన్ని చదివినా మన రమణ గారి బుక్స్, కన్యాశుల్కం, ఇవి మరచి పోలేము కదా . కొసమెరుపు లాగా ఆచంట జానకీ రామ్ గారి నా స్మృతి పథం లో అనే బుక్ ఎపుడో కాలేజ్ రోజుల్లో చదివాను మరలా ఈ మధ్య రీప్రింట్ అయిందని తెలిసి కొన్నాను. చదువుతుంటే ఆనందం తో పాటు దుఃఖం కూడా కలిగింది. ఆ కవులు ఆ కవిత్వం ఎటు పోయినాయి అని. నవలా సమీక్ష లాగా బోర్ కొట్టేసింది అనుకోకండి. పుస్తకం ఒక మంచి మిత్రుడు కదా మనం సీనియర్ సిటిజన్ అయ్యాక మన తో మాట్లాడుతూ వుండేవారు ఉండక పోవచ్చు అపుడే మనకు ఈ పుస్తకం ఒక మంచి మిత్రుడు సో మీకు నచ్చింది అనుకుంటూ గుడ్ నైట్
నేను కొన్న మొదటి ఇంగ్లిష్ నవల RK Narayan "The Bachelor of Arts " ఇంటర్మీడియేట్ పాస్ అయినతర్వాత బెజవాడ రైల్వే స్టేషన్ లో హిగ్గిన్బోథమ్స్ లో కొన్నాను . కొన్ని భలే గుర్తుంటాయి .