top of page
murthydeviv

నేను నా నోములు 9

నేను చేసిన నవరాత్రి పూజలు గురించి చెప్తన్నానన్న కదా అమ్మ వారి ఆలోచన కూడా ఎలావుందో చూడండి నా నోములు నెంబర్ కూడా 9 వచ్చింది మా అక్కయ్య ప్రోద్బలంతో మా అత్తగారు చేస్తుంటే ఆవిడ వెంబడి లలితా సహస్రనామ పారయణం నవరాత్రుల్లో రెండు పూటలా పారాయణ చిన్న చిన్న నైవేద్యాలు చేసి పెట్టటం అలవాటు అయింది మధ్య ఒక రోజు తప్పక గురువు గారి పూజ చూడటానికి వెళ్ళే దాన్ని అక్కడ నవరాత్రి తొమ్మిది రోజులు కుంకుమ పూజ చేసేవారు ముఖ్యమైన శిష్యులు అందరూ జపం సప్తశతి పారాయణ చేసే వారు వాళ్ళ లో మా అక్కయ్య ముఖ్యమైన శిష్యురాలు రోజూ ఉదయం రాత్రి హోమం జరిగేది అక్కడ జరిగే ఆ పూజలు అభిషకాలు హోమాలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవి అన్నీ కళ్ల తో చూసి ఆ నందించాలి ఒక కార్తీక మాసం ఏదో గుడి కి వెళ్ళి అక్కయ్య ను చూద్దామని అటు వెళ్ళాను అక్కయ్య అపుడే గురువుగారి ఇంటికీ వెళితున్నది నేను కూడా అక్కయ్య తో వెళ్ళాను ఆరోజు శుక్రవారం సాయంత్రం మేము వెళ్ళ గానే గురువు గారు లలిత పారాయణ చేద్దాం అని మొదలు పెట్టారు నేను కూడా వాళ్ళ తో పారాయణ చేశాను తర్వాత గురువు గారు నాతో రేపు కార్తీక మాసం అష్టమి నీకు చండీ మంత్రం ఇస్తాను విజయా మూర్తి నీ 12గంటలు కు తీసుకునిరా అని మూర్తి మీ వారికీ ఈ జపాలు అవీ అంటే అంత శ్రద్ద లేదు కానీ నీవు చేస్తే మీకు చాలా మంచిది మీ వారి కి చెప్పి రా అన్నారు నా కయితే ఏమి సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు అక్కయ్య వెంటనే తప్పక వస్తాం అని చెప్పింది ఇంటికీ వస్తుంటే కంగారు పడకు గురువుగారు ఇస్తా నన్నారు కదా అంతా బాగా జరుగుతుంది అన్నది మర్నాడు ఉదయమే నేను తయారు అయి బయలు దేరుతూ మావారి కి చెప్తే నాకు తెలియదు నీ ఇష్టం అన్నారు అయన కు ఏదయినా ఇష్టం లేకపోతే అనే మాట అని ఊరుకున్నా రు ఆలా నా కిష్టమైన కార్తీక మాసంలో అమ్మ వారి అనుగ్రహం తో నేను ఎపుడూ ఊహించని దీక్ష నాకు వచ్చింది ఆతర్వాత అక్కయ్య నాకు ఆ మంత్రం ఎలా చేయాలో చెప్పింది రోజూ తప్పక ఒక మాల అయినా జపం చేస్తాను తర్వాత ఏడు నవరాత్రుల లో దీక్ష తీసుకున్న శిష్యులు అందరితో పాటు కనీసం ఒక్క రోజైనా గురువు గారి దగ్గర జపం చేసి పూజ లో పాల్గొనటం అలవాటు అయింది ఇంట్లో నవ రాత్రులు తొమ్మిది రోజులు రెండు పూటలా పూజ జపం సహస్రనామ పారయణం చేయటం అలవాటు అయింది గురువుగారి దగ్గర రోజు ఒక ప్రత్యేక మైన నైవేద్యం వుండేది అన్నం తో రక రకాలుగా చేస్తారు అవి యింట్లో కూడా చేస్తాను ఇదే కాకుండా రోజూ సౌందర్య లహరి కొన్ని శ్లోకాలు పారాయణ చేస్తారు అవి కూడా చేస్తాను తర్వాత ఇపుడు అందరూ సప్తశతి పారాయణ చేస్తున్నా రు కానీ గురువు గారి దగ్గర ఒక లక్ష చండీ మంత్రం చేస్తే గానీ సప్తశతి పారాయణ కి ఆర్హులు కారు అనే వారు ఈ లోపల సప్తశతి లో శో స్త్ర చ తు ష్టయం చదువు కోవాల్సిందే నేను చాలా పట్టుదల తో ఒక ఏడాది లో లక్ష జపం పూర్తి చేసి సప్తశతి పారాయణ కు అర్హత సంపాదించాను ఇపుడు ఆషాఢ మాసం లో చైత్ర మాసం లో నవరాత్రుల లో తప్పక సప్త సతి పారాయణ చేస్తాను నవరాత్రుల్లో ఇపుడు రాత్రి పూట లక్ష్మి మంత్రం లక్ష్మి నారాయణ హృదయం కూడా చేస్తాను a మంత్రం అమ్మ వారి అనుగ్రహం తో ఎలా వచ్చిందో రేపు నేను ఇవ్వన్నీ చేశాను అనే అహంకారం తో రాయటం లేదు నాకు ఇవ్వన్ని ఇలా చేస్తారని కూడా తెలియదు మన ప్రమేయం లేకుండానే భగవంతుడు మనకు ఒక దోవ నిర్ణయిస్తాడేమో అనుకుంటాను ఇవ్వన్ని నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు

6 views0 comments

Recent Posts

See All

నేను నా నోములు 8

ఈ రోజు నా నవరాత్రి పూజలు గురించి చెప్తా న న్న కదా ఆ పూజలు కన్నా ముందు అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు రాస్తాను మావారు మద్రాస్ లో కారు...

నేను నా నోములు

నేను ఎన్నో చిన్న చిన్న నోములు చేశాను కానీ ముందు మా జీవితంలో లో మాకు తెలియకుండానే మేము సంకల్పించ కుండానే కొన్ని అపురూపైన సంఘటనలు గురించి...

నేను నా నోములు 7

నేను మా వదినలు కలిసి చిన్న చిన్న నోములు చాలా పట్టా ము మా అత్త గారికి మా అమ్మ కు ఇద్దరికీ నోములు పట్టించటం మాకు అన్నీ పనుల్లో చాలా సహాయం...

Comments


bottom of page