top of page
murthydeviv

నేను నా నోములు 8

ఈ రోజు నా నవరాత్రి పూజలు గురించి చెప్తా న న్న కదా ఆ పూజలు కన్నా ముందు అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు రాస్తాను మావారు మద్రాస్ లో కారు కొని మద్రాస్ నుండి హైదరబాద్ కార్ లో వచ్చారు అపుడు మా అత్తయ్య కొడుకు అయన స్నేహితుడు అయన పేరు స్వామి విశ్వనంద అనే అయన కూడా వచ్చారు అయన రమణ మహర్షి శిష్యుడు సహజంగా స్నేహశీలి అయిన మావారికి ఆయనకు చాలా స్నేహం అయింది ఆ కలుసుకున్న టైం మహిమ ఏమిటో గానీ ఆయన మాకు తండ్రి లాగా వుండే వారు మాకు అన్నీ విధాల సలహాలు ఇస్తూ చాలా అప్యాయంగా వుండే వారు అయన అరుణాచలం రమణ ఆశ్రమం లో చాలా రోజులు వున్నారు శృంగేరి శారదా పీఠం లో స్వాముల వారికి కూడా ఆయన కు పరిచయం వుండేది తిరువన అంతపురం రాజా గారితో కూడా ఆయన కు పరిచయం వుండేది ఆయనను మేము స్వామీజీ అని పిలిచే వాళ్ళం స్వామీజీ బెంగుళూరు లో మా అనందమయి ఆశీస్సులతో భాగవత భవన్ అని ఆలయం కట్టించారు ఆ ఆలయం లో.లక్ష్మి నారాయణ విగ్రహ ప్రతిష్ఠ మా దంపతులు చేత చేయించారు ఆ ప్రతిష్ట కూడా శృంగేరి శంకరాచార్యుల వారి చేతుల మీదుగా వారి సన్నిధి లో మా చేత చేయించారు ఎంతో పూర్వ జన్మ సుకృతం వుంటే గానీ జీవితంలో అత్యంత అరుదైన అవకాశం లభించదు ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు వచ్చినపుడు ఎంతో ఆనందం గా వుంటుంది ఆరోజు మేము శంకరాచార్యుల వారి కి పా ద పూజ చేశాము ఆరోజు శ్రీ శృంగేరి స్వామి వారు మా వారికి ఒక శ్రీచక్రము ఉన్న శారద అమ్మ వారి రూపు నాకు శారద అమ్మ వారి రూపు ఇచ్చారు శంకరాచార్యుల వారు మా చేత లక్ష్మి నారాయణ హోమం చేయించారు ఆ ప్రతిష్ట జరిగినపుడు మా అమ్మ గారు మా అత్తగారు మా పెద్దమ్మ ను కూడా మాతో బెంగుళూరు తీసికొని వెళ్ళాము అక్కడే ఉన్న నన్ను పూజలు చేసి కోమని ప్రోత్సహించే మా పిన్ని అమ్మవారి పాటలు రాసిన మా పెద్దమ్మ కూడా మాతో a ప్రతిష్ఠ కు వచ్చారు మా చెల్లలు మరిదిగారు కూడా మాతో కలిసి ఉత్సవం లో పాల్గొన్నారు మన ఇంటి పెద్దల ఆశీర్వాదం వుండటం కూడ ఒక అదృష్టం అనుకున్నాను కాని ఆ ప్రతిష్ఠ తలచుకుంటే ఎన్నో జన్మ ల పుణ్య ఫ లం వుంటే కానీ అలాంటి అవకాశం రాదు అనిపిస్తూంది నేను హైద్రాబాద్ వచ్చాక మావారికిచ్చిన శ్రీచక్రం కు రోజూ బ్రాహ్మడు వచ్చి రోజూ అభిషేకం చేస్తారు మావారికి అంతక్రితం హరిద్వార్ లో ఒక స్వామి లింగము ఇచ్చారు ఆ శంకరుడు కి తోడుగా అమ్మవారు వచ్చారు నాకు అన్నింటికీ సలహా ఇచ్చే మా అక్కయ్య ఆ రూపు కు రోజు పాలతో అభషేకించి ఖడ్గ మాల చదువు అని చెప్పింది ఇప్పటి వరకూ అలాగే చేస్తున్నాను మనకు తెలియకుండ నే భగవంతుడు మనం ఎటు వైపు నడవా లో నిర్దేశిస్తాడేమో అనిపిస్తుంది నేను నవరాత్రుల సందర్భంగా మామూలుగా మా అత్తగారు తో పాటు లలిత సహస్ర నామాలు చది వి అమ్మ వారికి అభిషేకం చేసి ఖడ్గ మాల చదివి నైవేద్యం పెట్టె దాన్ని సాయంకాలం దీపారాధన చేసి హారతి పాటలు పాడే వాళ్ళము అమ్మ వారు చండీ బాల మంత్రం ల తో నన్ను ఎలా అనుగ్రహించింది అనే విశేషాలు తో రేపు కలుద్దాము

15 views0 comments

Recent Posts

See All

నేను నా నోములు 9

నేను చేసిన నవరాత్రి పూజలు గురించి చెప్తన్నానన్న కదా అమ్మ వారి ఆలోచన కూడా ఎలావుందో చూడండి నా నోములు నెంబర్ కూడా 9 వచ్చింది మా అక్కయ్య...

నేను నా నోములు

నేను ఎన్నో చిన్న చిన్న నోములు చేశాను కానీ ముందు మా జీవితంలో లో మాకు తెలియకుండానే మేము సంకల్పించ కుండానే కొన్ని అపురూపైన సంఘటనలు గురించి...

నేను నా నోములు 7

నేను మా వదినలు కలిసి చిన్న చిన్న నోములు చాలా పట్టా ము మా అత్త గారికి మా అమ్మ కు ఇద్దరికీ నోములు పట్టించటం మాకు అన్నీ పనుల్లో చాలా సహాయం...

Comments


bottom of page