నేను నా నోములు 22
- murthydeviv
- Dec 13, 2024
- 2 min read
ఆంజనేయ స్వామి గుడులు చూద్దాం అనిపించి మొదట్లో శనివారం మంగళ వారం చూడాలని నిర్నయించుకున్నాను అందు వలన త్వరగా పూర్తి కాలేదు మధ్య లో కొంత అశ్రద్ధ చేశాను మొత్తానికి పూర్తి చేశాను కానీ కొన్ని ముఖ్యమైన గుడులు చూద్దామని అనుకున్నవి చూడలేదు అందులో అబిడ్స్ బడేచావడి కాచిగూడ అన్నీ సిటీలో వే కానీ వెళ్ళ లేక పోయాను సరే చూసీన కొన్ని పాత గుడులు గురించి చెప్తాను బంజారా హిల్స్ లో రోడ్ నో 12 లో నరసింహ స్వామి గుడి అని పెద్ద ఆర్చ్ వుంటుంది మొదట్లో నేను వెళ్ళినపుడు ఆ ఆర్చ్ లోపలికి వెళ్తే పెద్ద కొండ పైకి మెట్లు కూడా లేవు కానీ కొండకు కొంచెం మెట్ల లాగా చెక్కి వుండేవి కొండపైన చాలా చిన్నగా గుహల్లగా వున్న గుడుల్లో ఆంజనేయ స్వామి నరసింహ స్వామి శివుడు గుడులు వున్నాయి అంతా కొండ లాగా వున్నా పెద్ద రావిచెట్టు బిల్వదళాల చెట్టు వుండేవి తర్వాత ఆ గుడి ఇస్కాన్ వాళ్ళు తీసుకున్నారు పెద్ద గుడి కట్టారు కొండ ఆనవాలు కూడా లేదు ఇపుడు ఆ గుడి నీ గోల్డెన్ టెంపుల్ అంటారు నాకు మాత్రం పాత గుడి బాగుంది అనిపిస్తుంది రెడ్ హిల్స్ లో యింకో పాత గుడి వుంది చాలా రష్ గా వుంటుంది చాలా మహిమ గల గుడి అంటారు రాత్రి 8గంటలకు హరతి బాగా జరుగుతుంది అక్కడొక పూజారి చాలా పెద్ద వారు ఆయన దగ్గర సమస్యలు చెప్పుకుంటే పరిష్కారాలు చెప్పే వారు అయన్ని చూస్తే పూజ్య భావం కలుగుతుంది నాంపల్లి స్టేషన్ నుండి లోపలికి వెళితే చాలా చిన్న చిన్న హనుమాన్ గుడులు వుంటాయి అన్నీ గుడులు నార్త్ ఇండియన్ వాళ్ళు లేదా మహారాష్ట్ర వాళ్ళు మెయింటెయిన్ చేస్తున్నారు కోఠి లో ఉమెన్స్ కాలేజీ పక్క నుండి ఇసమియా బజార్ వెళ్లే దోవలో చిన్న గుడి లాగ అనిపిస్తుంది కానీ లోపల చాలా పెద్ద గా వుంటుంది శివాలయం రాములవారు విఠల్ గుడి అన్నీ వున్నాయి చాలా ప్రశాంతంగా వుంటుంది కోటి లోనే పుస్తకాల షాపు ల మధ్య లో గోపురం వుంటుంది అక్కడ లోపలికి వెళ్తే చాలా పెద్ద స్థలం చెట్లు పూజరుల ఇళ్ళు చాలా ప్రశాంతంగా వుంటుంది నరసింహ స్వామి గుడి కానీ రాములవారు ఆంజనేయ స్వామి కూడా వున్నారు కారవన్ అని ఓల్డ్ సిటీ లో కూడా రెండు మూడు పెద్ద గుడులు చూసాను రాష్ట్రపతి రోడ్డు నుండి టాంక్ బండ్ వస్తుంటే నవ గ్రహ హనుమాన్ అని బోర్డు వుంటుంది షాపు లు మధ్య లో నుండి వెళ్ళాలి చాలా విశాలంగా చెట్లు పూజరుల ఇల్లు అన్నీ వున్నాయి నవగ్రహాలు హనుమాన్ గుడి ఉంది అంబరుపేట రమణ థి యే టెర్ పక్కన కూడా చాలా పాత గుడి ఉంది ఇక్కడ కూడా లోపల విశాలంగా వుంటుంది నేను చూసిన అన్నీ పాత గుడులు లో చూసాక చాలా బాధ కలిగిన గుడి కాలా ఆంజనేయ స్వామి గుడి ఈ గుడి పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ 162 పిల్లర్ దగ్గర ఎడమ చేతి వైపుకి కొంచెం లోపలికి వెళ్ళాలి విశాలమైన గుడి కానీ కాలం తెచ్చిన మార్పు ల్లో. చాలా వరకు శి ధి ల మైనది బయట పెద్ద ఆవరణ రథ్ష శాల గోశాల అన్నీ వున్నాయి పెద్ద గోపురం లోపలికి కి వెళ్లితే ఒక పక్క నల్ల రాతి పెద్ద ఆంజనేయ విగ్రహం వున్నది అక్కడ ఒక్కచోటే పూజలు జరుగుతున్నాయి ముందు లోపలికి. వెళితే పెద్ద హలు పెద్ద బావి లేదా కోనేరు వుంది పూజారులు ఇళ్లు వున్నాయి శివాలయం లక్ష్మీ దేవి గుడి కింద వున్నాయి కొంచెం మెట్లు ఎక్కి పైకి వెళితే గుహ లాంటి గర్భగుడి లో అనంత పద్మనాభ స్వామి వేంకటేశ్వర స్వామి వున్నారు మెట్లు కూడా శి ధి లా వస్ట లో వున్నాయి ఆ గుడి కి చాలా ఆస్తులు వున్నా అన్నీ కబ్జా అవటం వలన ఆదాయం లేక గుడి నిర్వహించ లేక పోతున్నామని.పూజారి చెప్పారు ఆ ఆలయం గురించి బయట పెద్ద బోర్డు లో రాసి ఉంది గుడి మొదట అత్తాపూర్ గ్రామం లో వుంది ఇపుడు ఆ గ్రామం నగరం లో కలవటం వలన ఆస్తులు అన్నీ కబ్జా అయినవి ఇపుడు గుడి దినా వస్త లో వున్నది ఎన్నో కొత్త గుడులు కడతారు ఇంత చరిత్ర కలిగిన గుడులు గురించి అటు ప్రభుత్వం కానీ ఇటు టీ టీ డీ దేవస్థానం కానీ పట్టించ్చు కోరు ఎందుకో అనిపిస్తుంది చిలుకూరు వెళ్ళే దారిలో రామచంద్ర మఠం అని వస్తుంది ఈ గుడి ఒక ఆంజనేయ భక్తుడు చాలా తపస్సు చేసి కట్టించారు అని చెప్తారు అక్కడ చాలామంది మెడిటేషన్ చేస్తారు భజనలు కీర్తనలు పాడతారు ఈ హైద్రాబాద్ లో చాలా హనుమాన్ గుడులు వున్నాయి నేను 108చూసాను నా మనసుకు నచ్చిన కొన్ని పాత గుడులు గురించి రాశాను భక్తి తో పిలిస్తే పలికే దైవం ఆంజనేయ స్వామి అయన మహాత్యం చెప్పటానికి మన శక్తి చాలదు జై హనుమాన్
Comentários