నేను నా నోములు 21
- murthydeviv
- Dec 12, 2024
- 1 min read
నేను అనుకున్న ట్లు భగవంతుడి దయ వలన 108 ఆలయాలు పూర్తి చేశాను కొన్ని గుడులు చాలా ప్రశాంతంగా పవిత్రం గా అనిపించేవి మరల వెళ్ళ్దామనుకున్నాను కానీ అన్నిటికి వెళ్ళ లేక పోయాను కొన్ని మాత్రం పాత గుడులు చూసాను 2005లో 11 ఏకాదశి లు చిలుకూరు గుడి కి వెళ్ళాను మరలా ఏకాదశి నాడు చిలుకూరు వెళ్ళాలి అనుకున్నాను కాని ఇప్పుడు చిలుకూరు తిరుపతి లాగా పుణ్య క్షేత్రము అయింది ఆ రష్ లో వెళ్ళలేము అనిపిస్తుంది 1988 89 ల్లో నేను 108 మంగళ వారం లు ఉపవాసం ఉండి ఆంజనేయ స్వామి గుడి లో కనీసం తొమ్మిది లేక పదకొండు ప్రదక్షిణలు చేసే దాన్ని అపుడు గుడి కి వెళ్ళాలంటే అంత కష్టము అనిపించేది కాదు ఇపుడు ఈ ట్రాఫిక్ లో ఎక్కడి కి వెళ్ళాలన్న భయం అనిపిస్తూంది నా స్నేహితురాలు ఒక ఏకాదశి కి పిలిచి చిన్న గిన్నె లో వెన్న పెట్టీ ఒక బాల కృష్ణుడు విగ్రహం ఇచ్చింది మరి ఎవరైనా కొత్తగా ఏ పూజ చేసినా వెంటనే నాకు కూడా ఆలా చేయాలని సంకల్పం చేసి కోవటం అలవాటై పోయింది కదా నేను కూడా అలాగే పదకొండు ఏకాదశి లు ఉపవాసం ఉండి ద్వాదశినాడు అలాగే వెన్న తో బాల కృష్ణుడు విగ్రహం ఇచ్చాను అన్నీ నోములు అయ్యాక 108ఆంజనేయ స్వామి గుడులు చూద్దాం అనిపించింది ఈ హైద్రాబాద్ లో చాలా పురాతనమైన ఆంజనేయ స్వామి గుడు లు వున్నాయి చార్మినార్ దగ్గర బార్కస్ దూలుపేట మంగళ్ హాట్ యింకా చాలా చోట్ల వున్నాయి పైకి చిన్న గుడి లాగా వుంటాయి లోపల చాలా పెద్ద స్థలం తో విశాలంగా వుంటాయి ఆ హనుమాన్ గుడులు కు ఒక కథ విన్నాను శ్రీ రామదాసు గారిని జైలు నుంచి విడుదల చేయడానికి రామ లక్ష్మణులు నవాబు గారికి వెండి నాణెం లు ఇచ్చారని మనం విన్నాము కదా ఆ నాణెము లు. ఇప్పటికీ భద్రాచలం లో వున్నాయి అంటారు. ఆ సమయంలో. ఆంజనేయ స్వామి రామ లక్ష్మణులు కు కాపలాగా వేయి చోట్ల నిలబడి ఉన్నారు అని చెప్తారు చాలా పాత పోలీసు స్టేషన్ ల దగ్గర తమాషా గా హనుమాన్ గుడులు వుంటాయి ఏదయినా మన నమ్మకం భక్తి మీద ఆ ధార పడి వుంటుంది అని నా అభిప్రాయం రేపు హైద్రాబాద్ లో వున్న కొన్ని పాత గుడులు గురించి రాస్తాను మనందరికీ స్వామి రక్షించి అనుగ్రహించాలని కోరుకుందాము
Comments