top of page
Search

నేను నా నోములు 21

  • murthydeviv
  • Dec 11, 2024
  • 2 min read

ఈ రోజు ఇంకా కొన్ని పాత గుడులు గురించి రాస్తాను పాత గుడులే ఎందుకూ అంటే ఎన్నో ఏళ్ళ క్రితం కట్టిన గుడులు కాలా నికి ఎదురీది ఇంకా ఆలా వున్నాయంటే ఆ గుడిలో ఏదో శక్తి వుందని నాకు అనిపిస్తుంది ఇలాంటి పాత గుడులను. టిటిడి దేవస్థానం వాళ్ళు బాగు చేయచ్చు కదా అనుకుంటాను నేరడ్ మెట్టు క్రాస్ రోడ్స్ నుంచి ఎడమ వైపు తిరిగి బాగా లోపలికి వెళ్తే బాలాజీ నగర్ అంటారు గుడి కొంచెం ఎత్తు గా కొండ మీద కట్టారు అంతా పాలరాయి తో కట్టారు ఇది కొత్త గుడి చాలా బాగుంది అందుకని వ్రాశాను యింకో పాతగుడి కర్మన్ ఘాట్ దాటాక జిల్లెళ్ళ్ గూడ అని వస్తుంది ఇక్కడ చాలా విశాలమైన ప్రాంగణంలో పెద్ద గుడి పూజారి గారు చెప్పారు వనపర్తి సంస్థానము వాళ్ళు కట్టించారు అని ఆంజనేయ స్వామి గుడి కూడా వున్నది పూజారి గారు చాలా శ్రద్ధ గా పూజ చేశారు ఏన్నో రకాల చెట్లతో నిండి చాలా ప్రశాంతంగా వున్నది జిల్లెల్ గూడ నుండి ఇంకొచెం ముందుకు వెళ్ళి మీర్ పేట దాటాక బడుంగ్ పేట్ అంటారు ఇపుడు a ఏరియా నీ శివ నారాయణ పురం అంటున్నారు చాలా పాత గుడులు వేంకటేశ్వర స్వామి విగ్రహం గోడ లోనే చెక్కారు మనం అద్దము లో చూడాలి చాలా వింతగా వుంటుంది పక్కనే శివా లయం కూడా వున్నది ఈ మధ్య చుట్టు పక్కల వూరు పెరిగి గుడి కూడా చాలా బాగు చేశారట మంగా పురం కాలనీ అని మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ అనుకుంటాను ఎక్కువ ఇ సి ఐ ల్ వాళ్ళు వుంటారు ఆ కాలనీ గుడి కి మేమూ ప్రతిష్ఠ కు వెళ్ళాము అపుడు నిర్మానుష్యంగా ఉంది ఇపుడుచాల హడావిడి గా వున్నది అల్వాల్ లో కూడా చాలా పురాతన ఆలయం దేవుడు అల్వాల్ అనేవారుట చాలా పెద్ద గుడి స్వామి విగ్రహం చాలా బాగుంది రావులపల్లి అని చేవెళ్ళ వెళ్ళే దోవలో బోర్డు వుంటుంది వూరు లో మా కజిన్ వాళ్ళ బంధువులు కట్టించారు వాళ్ళ మామిడి తోట లో పెద్ద ఆలయం చాలా బాగుంది శ్రవణ నక్షత్రం రోజు స్వామి కళ్యాణం చేస్తారు చాలా కన్నులు పండువగా వుంటుంది బిర్లా మందిరం గురించి చెప్పేది ఏముందీ హైదరబాద్ కే వన్నె తెచ్చిన ఈ గుడి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎయిర్ పోర్ట్ బేగం పేట లో వున్నపుడు విమానం లో వస్తుంటే హైద్రాబాద్ లో అన్నిటికన్నా ముందు దేదీప్యమానంగా వెలిగిపోతూ బిర్లా మందిరం కనిపించేది అక్కడకు వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఉప్పల్ మెయిన్ రోడ్డు లో బస్ స్టాండ్ దగ్గర పురాతన ఆలయం వుంది కొంచెం మెట్లు ఎక్కాలి చాలా బాగుంది షాద్ నగర్ మనం బెంగళూర్ వెళ్ళే దారిలో వస్తుంది హై వే మీదనే వస్తుంది ఇపుడు వూరి లో కి వెళ్ళాలంటే ఎక్సిట్ తీసికోవాలేమో. ఈ ఆలయం కూడా వనపర్తి సంస్థానము వాళ్ళు కట్టించారు చాలా ఆస్తులు కూడా ఇచ్చారుట చాలా వరకూ కబ్జా అయినవని అని పూజారిగారు చెప్పారు విశాలమైన ప్రాంగణంలో పెద్ద ఆలయం చాలా బాగుంది పూజారులకు ఇళ్ళు ఉన్నాయి పక్కనే శివాలయం కూడా వున్నది a గుడి మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది ప్రశాంతంగా వుంటుంది చాలా సార్లు వెళ్ళాము వారీస్ గూడ లో పెద్ద కొండ కు నామాలు చెక్కి వుండేవి ఆ ఏరియా నీ నామాలు గుండు అనే వాళ్లు తరతాయి కొండ కు అనుకుని ఆలయం కొత్తగా కట్టారు చైతన్య పురి లో బాగా లోపలికి వెళ్తే కొండ మీద నరసింహ స్వామి. గుడి వున్నది ఫణిగిరి అంటారు వంద మెట్ల దాక వుంటాయి కొండ పైన వెంకటేశ్వర స్వామి నరసింహ స్వామి ఆంజనేయ స్వామి ఆలయం లు వున్నాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకప్పుడు చాలా నిర్మానుష్యం గా వుండేది ఇపుడు చాలా రష్ గా వుంటుంది మహబూబ్ నగర్ నుండి మక్తల్ వెళ్ళే దారిలో మన్యంకొండ అని వూరిలో వేంకటేశ్వర స్వామి గుడి వున్నది ఆ రోడ్డు కూడా చాలా స్టీప్ గా తిరుపతి రోడ్డు లాగా నే వుంటుంది కొండ పైకి కారు లో వెళ్ళాక ఇంకా వంద రెండు వందల మెట్లు ఎక్కాలి కానీ అంత కష్ట పడ్డా గానీ ఆ గుడి చాలా పురాతన గుడి చాలా బాగుంది స్వామి వెలసినట్లు చెప్తారు కేవలము భగవంతుని దయ వలన రెండు ఏళ్ళ లో ఈ గుడులు అన్నీ పూర్తి చేశాను అనుకున్నవి 108 అయిన కొన్ని ఎక్కువే చూసాను ఇంకా కొన్ని ఆలయాలతో రేపు కలుద్దాము స్వామి కరుణ మీ అందరి మీద వుండాలి అని కోరుకుంటూ నమ స్సులు

 
 
 

Recent Posts

See All
అమృత హస్తం

ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు...

 
 
 
పెళ్ళి పెట్టె

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page