top of page
Search

నేను నా నోములు 19

  • murthydeviv
  • Dec 9, 2024
  • 3 min read

మా అత్తగారు ఏకాదశి గురువారం నోము చేశానని చెప్పేవారు ఎన్ని ఏకాదశి లు చేయాలో తెలియదు మా మామగారు వుండగా ఉద్యాపన కూడా చే శారు లక్ష్మి నారాయణ విగ్రహాలు పెట్టీ మండప ఆరాధన చేసి బ్రాహ్మణ సంతర్పణ చేశారు దానాలు కూడా ఇచ్చారు నేను ఏకాదశి ఉపవాసం ఉండటం విష్ణు సహస్రం నామం పారాయణ చేయటం తులసి దళాల తో పూజ చేయటం అత్తయ్య గారి వలనే అలవాటు అయింది ద్వాదశి నాడు ఆవిడ బ్రాహ్మడు ను పిలిచి భోజనం పెట్టే వారు ద్వా దసి నాడు పరమాన్నం చేసి తులసి చెట్టు దగ్గర నైవేద్యం పెట్టే వారు అందువలన నాకు ఇప్పటికీ ఏకాదశి గురువారం వస్తె చాలా మంచి రోజు అనిపిస్తుంది అందువలన నేను ఏకాదశి గురువారం నాడు నా 108 గుడులు చూడటం మొదలు పెట్టాను 2010 లో మార్చి 11వ తారీఖు అనుకుంటాను బహుశ మాఘ మాసం కానీ పా ల్గుణ మాసం కానీ అయివుండవచ్చు ఏకాదశి గురువారం చందా నగర్ వేంకటేశ్వర స్వామి గుడి తో మొదలు పెట్టాను అక్కడ నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ రోజు మంచి రోజు అని మొదలు పెట్టాను నేను చూసిన గుడులు అన్నీ లిస్ట్ రాసి పెట్టాను నా కజిన్స్ ఫ్రైండ్స్ ఆ లిస్ట్ తీసుకున్నారు నేను అన్నీ గుడులు గురించి రాయటంలేదు కొన్ని పాత గుడులు గురించి రాస్తాను అవి చిలుకూరు గుడి కన్నా పాత గుడులే ఆ పురాతన గుడులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది వాటికి జమీందారులు నవాబులు మంత్రులు కొంత భూములు ఇచ్చి నా అవి అన్యా క్రాంతం అవటం వలన గుడులకు ఆదాయం లేక అనామకంగా ఉన్నాయి ఈ మధ్య వూరు పెరిగి ఆ చుట్టుపక్కల ఇళ్ళు రావటం వలన కొంత ప్రజల కు తెలుస్తున్నాయి ఆ గుడులు చూస్తే టిటిడి దేవస్థానం వాళ్ళు ఈ గుడులను దత్తత తీసుకొని బాగు చేయ వచ్చు కదా అనిపిస్తుంది చిక్కడపల్లి గుడి కూడా చాలా పాత గుడి హైద్రాబాద్ మొత్తం లో ఇక్కడ మాత్రమే తల నీలాలు పిల్లల కు చెవులు కుట్టించటం చేస్తారు సరూర్ నగర్ వేంకటేశ్వర కాలనీ లో మాకు స్థలం వుండేది శంఖు స్థాపన కూడా చేశాము కానీ అక్కడ ఇల్లు కట్ట లేదు కానీ ఆ కాలనీ వాసులు వచ్చి గుడి కట్టిస్తాం అంటే కొంత చందా ఇచ్చాము అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశాము ముందు విగ్రహాన్ని ఒక వారం రోజుల జలధి వా సం అది చేస్తారు తర్వాత నవధాన్యాలు నవరత్నాలు ఇంకా చాలా సుగంధ ద్రవ్యాలు వేసి విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు నేను మావారు అక్కడ ప్రతిష్ఠ చేశాము ప్రతిష్ఠ కు ముందు ఒక ఐదు రోజులు ఏవో కొన్ని నియమాలు పాటించాలి అవి అన్నీ అపుడు బ్రాహ్మలు చెప్పినట్లు చేశాము కనీసం 40ఏళ్ళు అయిందనుకుంటా ను ఇపుడు అంతగా గుర్తు లేదు కానీ విగ్రహాన్ని నేను మావారు ప్రతిష్ఠ చేసి మొదట పూజ చేయటం బాగా గుర్తు అది అంతా ఒక పూర్వ జన్మ సుకృతం అనుకుంటాను గుడి చిన్నదైనా బాగుంటుంది గడ్డి అన్నారం అంటే మలక్ పేట దాటాక గంగా థియేట ర్ కు వెళ్ళే దారిలో అసమన్ ఘడ్ అంటారు 1974 లో రోడ్డు కూడా ఉండేది కాదు ఎవరో పాత గుడి వుంది అంటే స్కూటర్ మీద వెళ్ళ టానికి ప్రయత్నం చేశాము అపుడు రోడ్డు కూడా లేదు నడిచి వెళ్ళాలి అంటే వెనక్కి వచ్చాము ఇపుడు రోడ్ పడింది చుట్టూ తిరుమల హిల్స్ అని మంచి కాలనీ వెలిసింది గుడి కూడా బాగా డెవలప్ చేశారు ఒక కొండ లో తొలిచి కట్టినట్టు వుంటుంది స్వామి కూడా కొండ లో వున్నట్లు వుంటుంది అపుడు ప్రశాంతం గా ఉండేది స్కంద గిరి దాటాక లోపలికి ఒక వేంకటేశ్వర గుడి వున్నది ఇది కూడా పాత గుడి అనిపిస్తుంది ఉప్పాల గూడ ల్యాంకో హిల్స్ దాటా మ్మgక పెద్ద రావి చెట్టు పల్లెటూరు రచ్చ బండ లాగా వుంటుంది అక్కడ రైట్ కి లోపలికి వెళితే వేంకటేశ్వర స్వామి గుడి తో పాటు నరసింహ స్వామి శివ పార్వతుల గుడి కూడా వున్నది ఒకప్పుడు అది పల్లె టూరు ఇపుడు ఇంకా బాగా పెరిగి వుంటుంది గుడి పాత గా అనిపించింది యింకో గుడి నవాబుల కాలంలో కట్టిన గుడి జాంసింగ్ బాలాజీ దేవాలయం అంటారు పి వి నరసింహ రావ్ ఫ్లై ఓవర్ దగ్గర 61 పిల్లర్ దగ్గర ఎడమ వైపు తిరిగితే లోపలికి.వుంటుంది చాలా పాత గుడి పెద్ద గా వుంటుంది నేను వెళ్ళినపుడు ఎక్కువ డెవలప్ మెంట్ జరగలేదు ఈ గుడి గురించి ఈనాడు పేపరు లో కూడా వచ్చింది ఆ మధ్య టీ వీ లో కూడా చూపించారు రాజస్థాన్ నిజాం నవాబుల కు గుర్రాలు అమ్మటానికి వచ్చిన జాం సింగ్ అనే ఆయన కట్టించారు ట గుడి కిఎదురు గా పెద్ద పాత భవనం గుఱ్ఱపు శాల వున్నాయి. చాలా విశాలంగా చుట్టూ స్థలం వుండేది గుడి కి వెళ్ళే దారి కూడా అంతా బాగుండ దు ఇది చాలా పాత గుడి మెహది పట్నం నుండి గచ్చిబౌలి వెళ్తుంటే షేక్ పేట్ అని వస్తుంది ఇపుడు ఫ్లై ఓవర్ కట్టారు ఫిల్మ్ నగర్ నుండి కూడా వెళ్ళ దర్గా రోడ్డు అంటారు అక్కడ వేంకటేశ్వర స్వామి గుడి అని కుడి చేతి వైపు పెద్ద అర్చ్ వుంటుంది చిన్న గుడి ఇల్లు లాగా వుంటుంది బదరీ నారాయణ్ పీట్టి అనే ఆయన కట్టించారు ట లోపల పెద్ద స్థలం వున్నది రథ శాల కూడా వున్నది లోపల అంత స్థలం వున్నది అని కూడా మనం ఊహించ లేము లోపల ఇంకా పెద్ద అడవి లాంటి తోట వున్నది అని సినిమా షూటింగ్ లు. జరుగుతాయి అని మా డ్రైవర్ చెప్పాడు ఎందరో. మహానుభావులు అందరికీ వందనములు సంఘీ నగర్ సంఘీ వాళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీ లో కట్టించారు బిర్లా టెంపుల్ లాగా అంతా పాలరాయి తో కట్టారు పెద్ద గుడి బాగుంటుంది మెట్లు ఎక్కాలి రేపు ఇంకా కొన్ని గుడులు చూద్దాము ఇన్ని గుడులు తిరిగే శక్తి ఇచ్చిన స్వామి కి కోటి వందనాలు అనుకున్న ప్రతి పని పూర్తి చేయటానికి సహకరించిన మా వారికి.నమస్సులు పిల్లలు కు ఆ ఏడుకొండల స్వామి దీవెనలు వుండాలి అని కోరుకుంటున్నాను

 
 
 

Recent Posts

See All
అమృత హస్తం

ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు...

 
 
 
పెళ్ళి పెట్టె

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page