నేను నా నోములు 18
- murthydeviv
- Dec 6, 2024
- 2 min read
Updated: Dec 8, 2024
నేను చేసిన పూజలు నోములు గురించి చెప్పాను కదా ఈ రోజు నేను చూసిన కొన్ని గుడులు గురించి చెప్తాను నాకు చిన్నప్పటి నుంచీ వార పత్రికలు నవలలు చదవటం అలవాటు ఉంది అయితే మా అక్కయ్య నన్ను రామాయణం భాగవతం ఇంకా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవమని సలహా ఇచ్చేది నీకు టైం లేకపోతే రోజుకు రెండు మూడు పేజీలు చదువు అని సలహా ఇచ్చేది చదవటం అలవాటు కాబట్టి ఏ పుస్తకం అయినా చదవచ్చు కానీ ఆధ్యాత్మిక పుస్తకాలు మనసు నిలిపి చదవటం కొంచెం కష్టము అయితే నా అదృష్టం కొద్దీ నేను మొదట జగద్గురు బోధలు కంచి పరమాచార్య గారి ఉపన్యాసాల పుస్తకాలు చదవటం వలన మనకు చాలా విషయాలు తెలుసు కోవాలని ఆసక్తి కలుగుతుంది ఎక్కడ అయినా కొత్త పుస్తకం కనిపిస్తే కొనటం చదవడం అలవాటు అయింది అలా కైలాస పర్వతం పరిక్రమ మానస సరోవర యాత్ర నర్మద నది పరిక్రమ గురించి చదివాను ఈ పరిక్రమ గురించి వాసుదేవ నంద చరిత్రలో చదివాను షిర్డి సాయిబాబా చరిత్రలో టెంబే స్వామి అని వస్తుంది అయన ఏన్నో సార్లు కాలి నడకన ఈ పరిక్రమ చేసారుట అసలు ఒక నది కి పరిక్రమ చేస్తారని కూడా ఈ చరిత్ర చదివే వరకు తెలియదు ఈ మధ్య ఫేస్ బుక్ లో ఒక భక్తురాలు పేరు గుర్తు లేదు అమెరికా నుంచి వచ్చి నర్మదా నది కి కారులో పరిక్రమ చేసినట్లు రాసారు చాలా బాగుంది ఈ మహానుభవులందరికి ఒక నమస్కారం ఈ నర్మద పరిక్రమ పుస్తకం మల్లాది కృష్ణ మూర్తి గారు రాశారు వాళ్ళు బస్ లో చేశారట ఆ పుస్తకంలో ఆయన స్నేహితుడు 108 వెంకటేశ్వర స్వామి గుడులు చూసినట్లు రాశారు అ విషయం చదవగానే నాకు కూడా నేను కూడా ఆలా 108గుడులు చూద్దామని అనిపించింది మా అమ్మ గారు అన్నట్లు నేను చాలా దైర్యం గా ఇలాంటి మొక్కులు అనుకుంటనేమో అనిపిస్తుంది ఒక్కొక్క సారి సరే మా వారి కి చెప్పాలి కదా అని ఆయన కు చెప్పాను ఆయన వెంటనే ఒకే గుడి కి 108 సార్లు వెళతానని మొక్కుకో అసలు అన్ని గుడులు ఈ వూరిలో వున్నా యో లేదో అన్నారు అ మాట తో నేను ఇంకా గట్టిగా 108గుడులు ఎలాగయినా చూడాలని నిర్నయించుకున్నాను కానీ నేను ఏ నోములు నోచినా ఏ పూజలు చేసినా మావారు పిల్లలు ఏమీ అభ్యంతరం చెప్పే వాళ్ళు కాదు ఏదయినా సహాయం చేసేవారు ఆలా ఒక ఏడాదిన్నర లో 108 గుడులు పూరీ చేశాను చాలా వరకు హైద్రాబాద్ లో నే చూసాను కొన్ని గుంటూరు విశాఖ పట్నం లో ఏలూరు లో చూసాను హైద్రాబాద్ చాలా కొత్త గుడులు వచ్చాయి కానీ కొన్ని చాలా పాతగుడులు వున్నాయి చాలా బాగుంటాయి వాటిని గురించి రేపు కలుద్దాము
Comments