top of page
Search

నేను నా నోములు 17

  • murthydeviv
  • Dec 5, 2024
  • 2 min read

పదహారు పౌర్ణమి లు చాలా బాగా జరిగాయి అని చెప్పాను కదా అన్నీ రాత్రి గల పౌర్ణమి నాడు చేసేదాన్ని నేను అనుకున్న తొమ్మిది మంది కాక ఇంకా చాలా మంది అయ్యేవారు ప్రసాదం గా పులిహోర ఏదో ఒక స్వీట్ చేసే దాన్ని కార్తీక మాసంలో అందరూ ఉపవాసం వుంటారు అని పండ్లు అవీ పెట్టే దాన్ని ప్రతి నెల. ఒక చీర జాకెట్ అమ్మవారి దగ్గర పెట్టీ వచ్చిన వాళ్ళకు పెట్టే దాన్ని ఇవి అన్ని కూడా ఏమి ఆటంకము లేకుండా చేసాను అంటే కేవలం అమ్మ వారి అనుగ్రహం నుగ్రహం వలన అనుకుంటాను పదహారో పౌర్ణమి పార్థివ నామ సంవత్సరం సెప్టెంబర్ 9 వ తేదీన అనంత చతర్దశి రాత్రి గల పౌర్ణమి వచ్చింది ఇక్కడ నాకు మా ఆడపడుచు వలన పరిచయమైన ఇంకొక అమ్మ వారి భక్తు రాలిని గురించి చెప్పాలి ఆవిడ పేరు నిర్మలమ్మ గారు ఆవిడ కు శృంగేరి శంకరాచార్యుల అనుగ్రహం తో లలిత అమ్మవారి విగ్రహం ఉంది ఆవిడ నవరాత్రుల లలో ఎవరు పిల్చినా వాళ్ళ ఇంటికి వచ్చి ఆమ్మ వారి పూజ చేసి పారాయణ చేస్తారు మాఘ మాసం లో వా రీ స్ గూడలో ఒక గుడి లో ఐదు రోజులు అమ్మ వారికి పూజ పారాయణ చేయిస్తారు ప్రతి ఏడు ఏదో ఒక వస్తువు గానీ అమ్మ వారి విగ్రహం గానీ అందరికీ చేత పూజ చేయించి యిచ్చే వాళ్ళు అలా ఆవిడ లక్ష్మీ సరస్వతి లలిత దేవి విగ్రహాలు వెండి తులసికోట వెండి తమల పాకులు గణపతి విగ్రహం అమ్మ వారి పా దు కలు నైవేద్యము కు ఒక చిన్న వెండి గిన్నె ఇలా ప్రతి మాఘ మాసం లో పూజ చేసి అందరి సహకారం.తో. బ్రహ్మాండం గా చేసే వారు నేను పదహారో పౌర్ణమి నాడు ఆవిడ ను పిలిచాను ఆవిడ తన పారాయణ గ్రూప్ తో వచ్చారు అమ్మ వారి కి అభిషేకం చేసి లక్ష సహస్ర నామ పారాయణ చేశాము ఖడ్గ మాల త్రిశతి నామాలు కూడా పారాయణ చేశాము మా చెల్లలు మా వదినలు.మా ఆడ పడుచు లు ఇంకా మా కజిన్స్ ఇంకా కొత్తగా పరిచయమైన స్నేహితులు అందరూ వచ్చి నా పారాయణ కార్యక్రమాన్ని జయప్రదం గా నిర్వహించారు ఆరోజు అందరికీ భోజనాలు పెట్టాను ఆమ్మ వారి అనుగ్రహం వలన తమషా గా నల్లిస్ షాపు లో ఒక 50r6 0చీరలు ఒకే రకమైన చీరలు దొరికాయి మా అమ్మ గారు అయితే చాలా దైర్యం గా అన్నీ మొదలు పెడతావు నాకు భయంగా అనిపిస్తుంది అనేది మా అమ్మ గారు మా అత్తగారు దీవెనలు వున్నాయి అనుకునే దాన్ని ఆలా అమ్మ వారి అనుగ్రహం వలన 16పౌర్ణమి ఏ ఆటంకం లేకుండా జయప్రదంగా ముగిసింది ప్రతి పౌర్ణమి కు వచ్చిన మా కజిన్స్ కు స్నేహితులు కు అమ్మ వారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటాను ఇపుడు తలచు కుంటే అవ్వన్నీ నేనే చే సనా అనిపిస్తుంది a. తర్వాత నిర్మలమ్మ గారి పిలిచి లలితా పారాయణ చేసిన సందర్భాలు అన్నీ ఎపుడూ మరువలేనట్లు వుంటాయి తర్వాత మా అమ్మాయి కు పాప పుట్టినపుడు కూడా నిర్మలమ్మ గారి నీ పిలిచి పారాయణ చేశాము ఆ సందర్భంలో చిన్న వెండి గిన్నె లో తేనే వేసి అమ్మ వారి రూపాలు గా భావించి తొమ్మిది మంది కి ఇచ్చాను సౌందర్య లహరి చదివితే అమ్మ వారికి త్రి మధురం అని తేనె కలకండ కిస్మిస్ నైవేద్యం పెడతారు అందువలన నేను కూడా తొమ్మిది వెండి గిన్నె ల్లో త్రి మధురం వేసి ఇచ్చాను ఇవ్వన్నీ అమ్మవారి సేవ లాగా చేశాను కానీ అహంకారం తో చెప్పటం లేదు ఇలా చేయగలిగిన శక్తి ఇచ్చినందుకు లలిత అమ్మ వారికీ జీవితం అంతా నాకు చేతనైన సేవ చేస్తూ వుండాలని అమ్మ వారికి రోజూ పూజ చేసుకునే శక్తి ఇవ్వమని ఫ్రా ర్డి స్తూ వుంటాను ఇవీ నేను చేసిన అమ్మ వారి సేవలు ఇవి అన్నీ కూడా బాగా జరగటానికి సహకరించిన మా పిల్లల కు అమ్మ వారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటాను

 
 
 

Recent Posts

See All
అమృత హస్తం

ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు...

 
 
 
పెళ్ళి పెట్టె

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page