top of page
Search

నేను నా నోములు

  • murthydeviv
  • Dec 4, 2024
  • 2 min read

మా ఆడ పడుచు చాలా సార్లు సామూహికంగా లలిత సహస్ర నామం పారాయణ ఇంట్లో చేసింది నేను కూడా ఆలా చేయాలని అనుకున్నాను కానీ ఎందుకో దైర్యం చేయలేకపోయాను మా ఇంటికి దగ్గరలో వున్న మా స్నేహితురాలు వై భవ లక్ష్మి నోము చేసుకుని ఉద్యాపన కు పిలిచింది 8శుక్రవారాలు సాయంత్రం పూజ లక్ష్మీ పూజ చేసి ఉద్యాపన చేయాలి ఆ రోజు వాళ్ళ ఇంట్లో కూడా లలిత పారాయణ చేశాము ఆరోజు నుంచి నాకు కూడా చేయాలనీ సంకల్పము కలిగింది వై భవ లక్ష్మి నోము చేసి ఉద్యాపన చేశాను లలిత సహస్ర నామం పుస్తకం ఫల శృతి లో పౌర్ణమి శుక్రవారం వచ్చినపుడు చంద్రుడి లో అమ్మ వారు షో డ ష కళల తో వున్నట్లు భావించి పారాయణ చేస్తే చాలా మంచిది అని వుంది 2004 లో ఆషాఢ మాసం లో పౌర్ణమి శుక్ర వారం వచ్చింది ఆ రోజు గురు పౌర్ణమి కూడా కదా ఆ పౌర్ణమి నుంచి అమ్మ వారికి ప్రీతి కరమైన సంఖ్య షోడశ ము అంటే 16 పౌర్ణమి లు చేయాలని సంకల్పం చేసుకున్నాను అయితే మేము వున్న ఏరియా లో కి మేము కొత్తగా వచ్చాము అంత మంది పారాయణ అంటే శ్రద్ద వున్నవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు మా కజిన్స్ అందరూ ఆ ఏరియా కు దూరం లో వున్నారు కనీసం తొమ్మిది మంది వుంటే చాలని అనుకున్నాను పౌర్ణమి ఇంకో నాలుగు రోజులు వుంది అనగా గేటు దగ్గర పండ్లు తీసుకోవటానికి వెళ్ళాను a పండ్లు బండి దగ్గర ఇద్దరు ఆడవాళ్ళు కూడా పండ్లు బేరం ఆడుతున్నారు వాళ్ళు ఎదో గుడి గురించి మాట్లాడుకుంటున్నారు నేను ఏమీ గుడి అని అడిగాను అష్ట లక్ష్మి గుడి అని చెప్పారు నేను వెంటనే నా సంకల్పం గురించి చెప్పాను మీరు రాగాల్గు తారా అని అడిగాను వాళ్ళు తప్పక వస్తాము ఇంకా ఎవరైనా ఉంటే చెపుతాము అన్నారు వాళ్ళు దగ్గర లోనే అపార్టుమెంట్ లో వుంటాము అని చెప్పారు వాళ్ళు అన్నీ పౌర్ణమి లు కు వచ్చారు చాలా మంచి స్నేహితులు అయ్యారు ఒకరి పేరు సుబ్బలక్ష్మి ఇంకొకరి పేరు సారిక పదహారు పౌర్ణమి లు చేయగలనో లేదో అనుకుంటూ మొదలు పెట్టాను కానీ అన్నీ ఏ ఆటంకాలు లేకుండా చాలా బాగా జరిగాయి మా కజిన్స్ అందరూ చాలా శ్రద్ధగా వచ్చారు ప్రతి పౌర్ణమి చాలా బాగా జరిగింది ప్రత్యెకంగా మా మేనత్త కూతురు పట్టంచెరువు నుంచి ప్రతి పౌర్ణమి కి వచ్చింది ఇది అంతా కేవలం అమ్మ వారి అనుగ్రహం అనుకుంటాను ఆ పదహారు పౌర్ణమి లు ఎలా జరిగాయో ఉద్యాపన గా ఏమి చేశానో రేపు కలుద్దాము

 
 
 

Recent Posts

See All
మధుర గీతాలు తలత్ మొహమ్మద్

మొన్న సురయ్యా పాటలు సెర్చ్ చేస్తూ ఉంటే రాహి మత్ వాలే అంటూ ఒక చక్కటి పాట కనిపించింది. ట్రైన్ లో పాట సో స్పీడ్ గానే వుంది మ్యూజిక్ పాడుతున్న ది తలత్ మొహమ్మద్ అనీ కనుక్కున్నా గాని యాక్ట

 
 
 
పడక కుర్చీ

భావుక లో పోయిన వారం ఇచ్చిన పదాలు లో వున్న పడక కుర్చీ అనే పదం చూడగానే ఏభయి ఏళ్ల క్రితం జరిగిన కొన్ని సంఘటన లు గుర్తు వచ్చాయి. కానీ నాకు ఏమిటో మొన్నీ మధ్య జరిగినట్లు అనిపిస్తుంది. ఆ రోజు

 
 
 
శ్రీ రామ నవమి

శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం ఆంటే అందరూ పెద్దలే అని చెప్పేవారు మా బామ్మ గారు. మన చిన్నతనం లో ఈ వసంత నవరాత్రులు గురించి అంతగా తెలియదు. రాములువారి కళ్యాణం అని వీధి వీధికి

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page