నేను చిన్న చిన్న నోములు చాలా చేశాను ముఖ్యంగా కొంచెం ఖ ర్చు తో కూడుకున్నవి రెండు నోములు ఒకటి కైలాస గౌరీ రెండు లక్ష పసుపు కొమ్ములు ఈ రెండు నోములుకు వేరే వాళ్ళ సహకారం కూడా వుండాలి పసుపు కొమ్ములు కొన్నాక మంచివి ఏ రాలి పుచ్చు లు అవీ వుండకూడదు లెక్క పెట్టాలి అంటే కొన్ని ఎక్కువగా అయినా ఇవ్వచ్చు కానీ తక్కువ గా ఇవ్వకూడదు రెండు మూడు బస్తాలు ఒక సారే తీసుకొని అన్ని శుభ్రం చేసి లెక్క పెట్టీ ఇవ్వాలి తాంబూలం దక్షిణ తో ఇవ్వాలి అలాగే ఒకే సారి కొని మా మేనకోడలు పెళ్ళి లో ఇంకా మాఇంట్లో లలిత పారాయణ అపుడు ఇచ్చి పూర్తి చేశాను కైలాస గౌరీ నోము ఇది కూడా పెద్ద నోము అంటే ఖర్చు విషయంలో తర్వాత మనం నోము చేసేటపుడు మాట్లాడ కూడదు ఈ నోము ఇంట్లో చేసుకోవచ్చు లేకపోతే గుడి లో అయినా చేయవచ్చు మా చెల్లెలు ఇంట్లో చేసుకున్నది నాకు ఇంట్లో కన్నా గుడిలో అయితే చాలా మంది వస్తారు అని శంకర మఠం లో చేసుకున్నాను నాతోపాటు మా యింకో చెల్లెలు చేసుకున్నది ఈ నోముకు మనం మాట్లాడకుండా 25kg ల పసుపు 25కేజీ ల కుంకుమ పంచి పెట్టాలి పండు తాంబూలం దక్షణ కూడా పెట్టాలి మనం ముందు రోజు వెళ్లి రిజిస్టర్ చేసికుంటే మనకు ఒక ప్లేస్ ఇస్తారు అక్కడ మాఘ మాసం కార్తీక మాసం లో చాలామంది చేసికుంటారు పెళ్ళి హడావిడి లాగా వుంటుంది ఇపుడు అయితే కొంతమంది ఆడవాళ్ళు వచ్చి సహాయం చేస్తున్నారు మేము చేసికున్నపుడు మనవాళ్ళే వుండి మనకు అన్నీ అంది చటం చేశారు 25kg లే కాకుండా ఇంకా తెప్పించ వలసి వచ్చింది ఉదయాన్నే వెళ్ళి అమ్మ వారికి పూజ చేసి గాజుల పసుపు కుంకుమ పండ్లు అన్ని ఇవ్వాలి అమ్మ వారి దయ వల్ల చాలా బాగా జరిగింది ఇపుడు శంకరమఠం లో పండగ రోజుల్లో చాలా మంది చేస్తున్నారు ఇంకొక నోము గురించి చెప్పి నా నోములు గురించి పూర్తి చేస్తాను మాఘగౌరి ఇది చిన్న నోము కానీ 5 ఏళ్ళు మాఘమాసం లో చేయాలి తులసి చెట్టు దగ్గర 5 పద్మాలు వేసి పసుపు తో గౌరీ దేవి నీ చేసి పూజ చేయాలి ప్రతి సంవత్సరం ముగ్గులు పెంచుకుంటూ పోవాలి రెండో ఏడు పది ముగ్గులు మూడో ఏడు పదిహేను ముగ్గులు నాలుగో ఏడు ఇరువది ముగ్గులు ఐదవ ఏడు పాతిక ముగ్గులు వేసి అమ్మ వారి పూజ చేయాలి ఉద్యాపన గా చిన్న చేట ల్లో ఒక కిలో చొప్పున పసుపు కుంకుమ జీలకర్ర బెల్లం కొబ్బరి ఇవ్వాలి ఈ నోము చిన్నదే అయితే తులసి చెట్టు దగ్గర కూర్చుని పూజచేసికోవటం ముగ్గులు వేయటం చాలా ఆనందం గా అనిపిస్తుంది అలాగే ప్రతి కార్తీక మాఘ మాసం లో తులసి చెట్టు దగ్గర గౌరీ పూజ చేయటం అలవాటు అయింది ఈ నోముల వలన ఏమి వస్తుంది అనుకుంటే నా దగ్గర సమాధానం లేదు కానీ చేస్తుంటే ఒక విధ మైన ఆనందం ఆత్మ తృప్తి వస్తుందని చెప్పగలను ఈ రోజు 3నోముల గురించి చెప్పాను కదా రేపు మరలా కలుద్దాము
murthydeviv
Comentarios