top of page
murthydeviv

నేను నా నోములు 13

ఈ పూజ మనకు మామూలుగా తెలియదు బహుశ ఆమ్మ వారికి సంభందించిన పుస్తకాల్లో వుంటుంది అనుకుంటాను మా అక్కయ్యకు దీక్ష ఇచ్చిన శ్రీ విద్యా నంద గారు చేయించారు అనుకుంటాను అయన శ్రీ విద్య రహస్యం అని కొన్ని పుస్తకాలు రాశారు ఈ పూజ మొదట చెప్పినట్లుగా 15రోజులు చేయాలి మొదటి రోజు శుద్ధ శక్తి మాల మంత్రం అంటారు ఖడ్గ మాల ఒకసారి క తో మొదలు అయ్యే త్రిశతి నామాలు 20 వుంటాయి అవి చదవాలి నైవేద్యం పరమాన్నం రెండవ రోజు శుద్ధ శక్తి నమో న్త మాల మంత్రం అంటారు ఖడ్గ మాల ప్రతి నామా నికి చివర నమో అని చెప్పాలి ఏకా రంత త్రిశతి నామాలు 20 వుంటాయి అవి చదవాలి నైవేద్యం సున్ని ఉండలు ప్రతి రోజూ సంకల్పం ధ్యాన శ్లోకం వేరుగా ఉంటుంది అవి నేను రాయటం లేదు మూడవ రోజు శుద్ద శక్తి స్వాహా నంత మాల అంటారు ఖడ్గ మాల నామాలకు స్వాహా అని చేర్చాలి త్రిపుర సుందరి స్వాహా అని చదవాలి ఈ కార తో మొదలు అయ్యే త్రిశతి నామాలు 20 చదవాలి నైవేద్యం బాసుంది నాలుగవ రోజు శుద్ధ శక్తి తర్పణనంత మాల అంటారు ఖడ్గ మాల నామాలకు తర్పయామి.అని చేర్చాలి ల కా రాంత త్రిశతి నామాలు 20 చదవాలి ఈ రోజు నైవేద్యం బొబ్బట్లు ఐదవ రోజు శుద్ధ శక్తి జయంతా మాల అంటారు ఖడ్గ మాల నామాలకు జయ జయ అని చేర్చాలి హ్రీ కారంత త్రిశతి నామాలు 20 చదవాలి నైవేద్యం కదళీ పాయసం ఆరవ రోజు శుద్ధ శక్తి శివ మాల ఖడ్గ మాల ఒక నామం చదివి శివ పరంగా కూడా చదవాలి అంటే త్రిపుర సుందరి త్రిపుర సుందర నమః అని చదవాలి హ కారంతా త్రిశతి నామాలు 20 చదవాలి నైవేద్యం అపూపాలు అంటే అప్పాలు ఏడవ రోజు శుద్ధ శివ శక్తి నమో మాల ఖడ్గ మాల నామాలకు శంకర పరంగా చదువుతూ నమో అని చేర్చాలి త్రిపుర సుందరి నమో త్రిపుర సుందరాయ నమో అని చదవాలి నైవేద్యం గుడా న్నం స కారాంతా త్రిశతి నామాలు.20చదవాలి ఎనిమిదవ రోజు శుద్ద శివ స్వాహా మాల ఖడ్గ మాల నామాలు శంకర పరంగా చదువుతూ స్వాహా అని చేర్చాలి త్రిపుర సుందరి స్వాహా త్రిపుర సుందరా య స్వాహా.అని చదవాలి నైవేద్యం కొబ్బరి కాయ క కార త్రిశతి నామాలు 20చదవాలి తొమ్మిదవ రోజు శుద్ధ శివ తర్పణ మాల ఖడ్గ మాల నామాలు శంకర పరం గా కూడా చదువుతూ తర్పయామి అని చదవాలి త్రిపుర సుందరి తర్పయామి త్రిపుర సుందర తర్పయామి అని చదవాలి నైవేద్యం పేలాలు హ కార త్రిశతి నామాలు 20. చదవాలి పదవ రోజు శుద్ద శివ జయంతా మాల త్రిపుర సుందరి జయ జయ త్రిపుర సుందరా జయ జయ అని చదవాలి నైవేద్యం నువ్వుల ఉండలు ల కా రంతా త్రి శతి నామాలు 20చదవాలి 11వ రోజు శుద్ధ శక్తి శివ మిధున మాల త్రిపుర సుందరి త్రిపుర సుందర నమః అని చదవాలి హ్రీ కరాంత త్రిశతి నామాలు 20నామాలు చదవాలి నైవేద్యం పెరుగు వడలు 12 రోజు శుద్ధ శక్తి శివ మిధున మాల నమో నంత మాల త్రిపుర సుందరి నమో నమః త్రిపుర సుందరా య నమో నమః అని చదవాలి నైవేద్యం అటుకుల పులిహోర స కార త్రిశతి నామాలు 20చదవాలి పదమూడవ రోజు శుద్ధ శివ శక్తి మిధున స్వాహా మాల త్రిపుర సుందరీ స్వాహా త్రిపుర సుందరా య స్వాహా అని చదవాలి నైవేద్యం శెనగలు వేసిన పులిహోర కా రాంతా త్రిశతి నామాలు 20చదవాలి పద్నాలుగవ రోజు శుద్ధ శివ శక్తి మిధున తర్పణ మాల త్రిపుర సుందరి తర్పయామి త్రిపుర సుందర తర్పయామి అని చదవాలి ల కా రం తో మొదలు అయ్యే త్రిశతి నామాలు 20చదవాలి నైవేద్యం తేనె అద్దిన గారెలు పదిహేనవ రోజు శుద్ధ శక్తి శివ మిధున జయా మాల ఖడ్గ మాల త్రిపుర సుందరి జయ జయ త్రిపుర సుందర జయ జయ అని చదవాలి నైవేద్యం గుడా న్న ము లో పాలు పోయకుండా బెల్లం వేసి ఏలకు పొడి జీడి పప్పు కిస్మిస్ వేసి చేస్తారు హ్రీ కారం తో మొదలు అయ్యే త్రిశతి నామాలు చదవాలి ఈ నామాలతో త్రిశతి నామాలు పూర్తీ అవుతాయి ఈ పూజలో మొదట చెప్పినట్లు మామూలు గా వుండే ధ్యాన శ్లోకం కాకుండా ప్రత్యెక మైన ధ్యాన శ్లోకం రుషి ఛందస్సు a పూజ చేయటం వల్ల వచ్చే ఫలితం ఆ శ్లోకం లో. వుంటాయి నేను అవ్వన్నీ రాయ లేదు ఈ పూజ లో కష్టము ఏమి అనిపించదు కొంచెం శ్రద్ధ భక్తి నైవేద్యం లు చేయటానికి వోపిక వుండాలి ఈ పూజ ఒక్క సారే చేశాను మరల చేద్దాం అని చాలా సార్లు అనుకున్నాను కానీ అమ్మ వారి అనుగ్రహం కలగలేదు ఇంత వరకూ చేయగలిగాను అని తృప్తి పడుతున్నాను

36 views0 comments

Recent Posts

See All

నేను నా నోములు 15

నేను చిన్న చిన్న నోములు చాలా చేశాను ముఖ్యంగా కొంచెం ఖ ర్చు తో కూడుకున్నవి రెండు నోములు ఒకటి కైలాస గౌరీ రెండు లక్ష పసుపు కొమ్ములు ఈ రెండు...

నేను నా నోములు 14

నిన్న అరుదైన శివ శక్తి మాల ఖడ్గ మాల నామాలు త్రిశతి నామాలు కలిపి చేసిన పూజ గురించి తెలుసుకున్నాము కదా నేను చేసిన పూజలు గురించి నాకు ఏమీ...

నేను నా నోములు 12

మా విజయ అక్కయ్య ఒక యోగి లాగా జీవించేది వాళ్లింటికి ఎపుడూ ఎవరో ఒకరు వస్తుండే వాళ్ళు అందరూ ఆమ్మ వారి భక్తులే మా పెద్దమ్మ కూడా ధనుర్మాసం పూజ...

Comments


bottom of page