నిన్న లక్ష్మీ మంత్రం లక్ష్మి నారాయణ హృదయం పుస్తకం వచ్చిన సంఘటనలు చెప్పా కదా . ఆ పుస్తకంలో నే ఫల శృతి లో ఆశ్వయుజం మాసం రమ ఉత్సవం లో చేస్తే చాలా మంచిది అని వుంటుంది అందువలన నేను నవరాత్రులలో రాత్రి లక్ష్మి నారాయణ మంత్రం తో సంపుటికరణం చేసి లక్ష్మీ నారాయణ హృదయం పారాయణ చేస్తాను తర్వాత లక్ష్మీ సహస్రనామ పారాయణ చేస్తాను ఇలా రాస్తుంటే గొప్పగా చెపుతున్నాను అనుకుంటారేమో అని డౌట్ వస్తున్నది కానీ ఇలాంటి పూజలు గురించి ఎవరికీ అంత తెలియదు కదా అందుఅందరికీ తెలియాలని రాస్తున్నాను ఆ తర్వాత ఎందుకో కొన్ని శుక్రవారాలు చేయాలని సంకల్పం కలిగింది నేను మా పిన్ని ప్రో ద్బ లంతో 108 రకాల పూలతో పూజ చేశాను ఆ 108 సంఖ్య అంటే నాకు ఇష్టం అందుకని 108 శుక్రవారాలు చేయాలని సంకల్పం చేసుకున్నాను తెలుగు తిథులు గుర్తు లేదు కానీ అక్టోబర్ 15 తారీఖు 1999లో మొదలు పెట్టాను మొదట లక్ష్మీ మంత్రం 108సార్లు చేసి నారాయణ హృదయం ఒక సారి మరల లక్ష్మీ హృదయం నారాయణ హృదయం లక్ష్మి హృదయం మరల నారాయణ హృదయం మొత్తం ఐదు సార్లు అవుతుంది ఆ పారాయణ అయ్యాక మరల లక్ష్మీ మంత్రం 108 సార్లు చేయాలి ఇలా చేయటాన్ని సంపుటి కరణం అంటారు తర్వాత లక్ష్మీ సహస్రనామాలు చేశాను పూల తో అమ్మ వారి కి చేశాను నేను108శుక్రవారాలు పూర్తి చేయటానికి ఐదు ఆరు ఏళ్ళు పట్టింది అనుకుంటాను అన్నీ రాసి పెట్టాను 2005పూర్తి చేయగలిగాను ఏం చేసినా చేయాలనీ సంకల్పించిన కేవలం అమ్మ వారి కృప వలన పూర్తి చెయ్య గలిగానని భావిస్తున్నాను కానీ ఇపుడు ఏదయినా సంకల్పం చేయాలన్నా దైర్యం చేయలేక పోతున్నాను ఆ బ్యాంక్ మేనేజర్ గారీ నీ మరల ఎపుడూ కలవలేదు అయన రిటైర్ అయ్యాక తిరువనంత పురం లో సెటిల్ అయ్యారు అని స్వామీజీ చెప్పారు కానీ ఆ దంపతుల ఇద్దరూ విష్ణు సహస్రం లక్ష్మి సహస్రనామ స్తోత్రం పారాయణ చేయటం నేను ఎప్పటికీ మరచిపోలేను మన పూర్వ జన్మ పుణ్యం వలన మాత్రమే అలాంటి వాళ్ళ ను కలవగలుగుతాము అనిపిస్తుంది ఇపుడు కూడా శ్రావణ మాసం మాఘ మాసం ఆలా కొన్ని శుక్రవారాలు చేస్తాను ఈ పూజ శుక్రవారం రాత్రి 7గంటల కు మొదలు పెట్టీ చేయాలి రేపు ఇంకో అరుదైన పూజ గురించి తెలుసుకుందాము
murthydeviv
Comments