అమ్మ వారి పూజలు దీక్ష తీసుకున్న వాళ్ళు చేసే జపం మంత్రాలు చాలా వుంటాయి అవన్నీ గురించి నాకు అంత తెలియదు కానీ ప్రతి తిథి కి ఒక దేవత ఆ దేవత కు ఒక ప్రత్యేఇన్కk మైన పేరు ఆ దేవత కు సంబందించి ఒక పూజ జపం నైవేద్యము వుంటాయి పౌర్ణమి వరకు చేస్తారు పౌర్ణమి నుండి మరల అవే తిధుల్లో వచ్చే దేవత కు మరల క్రమంగా అమావాస్య వరకూ చేస్తారు. ఈ జపం నవ రాత్రుల లో తప్పక చేస్తారు ఈ తిథి నిత్య దేవతల గురించి దేవి భాగవతం లో కూడా వున్నది అక్కయ్య అవ్వన్నీ నేను చేయలేనని ఆ తిథి కి సంబదించిన దేవత కు ఒక ధ్యాన శ్లోకం నైవేద్యం ఆ రోజు అమ్మ వారికి ఏ రంగు పూవు పెట్టాలి అని మాత్రం చెప్పింది అప్పటి నుండి నవరాత్రుల లో ఆ శ్లోక ము ఆ నైవేద్యం మాత్రం పెడతాను మనం చేసే పూజ ను బట్టి నై వేద్యం కూడా తగినట్లు చేయాలి అని కొందరు చెప్తారు కానీ రెండు పూటలా అన్నం తో ఏదో ఒక నైవేద్యం ఆమ్మ వారి కి. ఇష్టమైన పండ్లు జామ దానిమ్మ. టెంకాయ అరటి పండు తప్పక ఉండేట్లు చూసుకోవాలి అష్టమి నాడు చాలా వరకు గారెలు పెడతారు మా అత్త గారు అష్టమి నాడు రాత్రి గారెలు పెట్టే వారు ఆదే అలవాటు నేనూ చేస్తాను అని వేరే చెప్పక్కర్లేదు కదా మనం ఎన్ని పూజలు నైవేద్యాలు చేసినా ముఖ్యంగా కావలసినది శ్రద్ద భక్తి మనసు అక్కడ నిలిపి చేయటం అనేది చాలా అవసరం అనుకుంటాను ఇంకా నేను నవరాత్రుల లో రాత్రి పూజ లో లక్ష్మి. మంత్రం లక్ష్మి నారాయణ హృదయం చదవటం ఎలా మొదలు అయిందో చెప్తాను. నేను ముందే చెప్పినట్లు మనకు జీవితంలో తారస పడే వ్యక్తులు బంధువులు స్నేహితులు పరిచయస్తుల కావచ్చు ఒకొక్క సారి వాళ్ళ మాటలు మన మనసుకు హత్తుకనేలా వుంటాయి కొందరిని మనం మరల వాళ్ళని కలవలేక పోవచ్చు కాని ఆ ప్రభావం మన మీద చాలా వుంటుంది. మా వారి స్నేహితుడు మాకు తండ్రి లాగా వుండే స్వామిజీ కి చాలా మంది తెలుసు అని ముందే చెప్పాకదా ఆయన స్నేహితుడు ప్రభు అని హైదరాబాద్ SBH బ్యాంకు కి DGM గా వచ్చారు అయన ఇంటి కి స్వామీజీ తో పాటు నేను మావారు వెళ్ళాము వాళ్ళు కేరళ బ్రాహ్మలు బహుశ వైష్ణవలు అనుకుంటాను వాళ్ళింట్లో పూజామందిరం లో పెద్ద వెంకటేశ్వర స్వామి లక్ష్మి దేవి విగ్రహాలు ఉన్నాయి ఆ రోజు శుక్రవారం ఆవిడ ప్రతి శుక్రవారం రాత్రి రకరకాల పూలతో లక్ష్మీ సహస్ర నామ పూజ చేస్తారుట మేము వెళ్ళేటప్పటికి పూజ అయి ఆయన స్వాతి తిరునాళ్ వ్రాసిన కీర్తనలు ఆనం త పద్మ నాభ స్వామి మీద చక్కగా పా డుతున్నారు చూడటానికి వినటాని కి ఎంత ఆనందం కలిగింది అని మాటల్లో చెప్పలేము ప్రభు గారు అయన భార్య కూడా మమ్మల్ని ఎంత మర్యాద పూర్వకంగా అదరించారో చెప్పలేను స్వామీజీ వున్నపుడే ఆ దం పతులను మా ఇంటికి భోజనానికి పిలిచాము వాళ్ళనీ హైద్రాబాద్ లో వుండగా చాలా సార్లు కలిసాము తర్వాత ఎపుడూ వాళ్ళ ను కలవక పోయినా ఆ అనుభూతి మనసులో ఆలా మిగిలి పోయింది ఇదంతా ఎందుకు చెప్పాను అంటే వాళ్ళింట్లో పూజ చూసాక నేను కూడా ప్రతి శుక్రవారం రాత్రి సహస్రనామ పూజ చేయటం మొదలు పెట్టాను అపుడే ఒక రోజు అక్కయ్య దగ్గరకు వెళ్ళాను అక్కయ్య దగ్గర కు తరచూ వెళ్ళటం ఏవో పూజ ల గురించి ఆధ్యాత్మిక పుస్తకాలు గురించి మాట్లాడు కోవటం అలవాటై పోయింది ఆ రోజు అక్కడ మా ఇంకో కజిన్ కూతురు అక్కయ్య దగ్గరే చదువుకుంటూ వుంటుంది ఆ అమ్మాయి పేరు వరలక్ష్మీ నన్ను చూడగానే గురువు గారి దగ్గర అందరూ లక్ష్మి నారాయణ హృదయం లక్ష్మి మంత్రం చేస్తున్నారు నీవు కూడా రా పెద్దమ్మా అన్నది వెంటనే అక్కయ్య అంత దూరం నుండి రాత్రి పూట రావటం కష్టము కదా ఇంట్లో నే చదువు రాత్రి పూట 7 గంటలకు చదువు అని చెప్పింది నీకు లక్ష్మి మంత్రము కావాలంటే గురువు గారి దగ్గర కు శుక్రవారం నాడు ర మ్మని చెప్పింది వరలక్ష్మి నాకు లక్ష్మి నారాయణ హృదయం పుస్తకం ఇచ్చింది నేను సరే చూద్దాం అని వచ్చేసాను నాకు ఏదయినా కొత్త గా మొదలు పెట్టాలంటే కొంత భయం అనిపిస్తూంది చేయగలనో లేదో అని ఇంటికీ వచ్చాక ఒక గురువారం నాడు మా అత్తగారు నన్ను పిలిచి నాకు చిన్నప్పుడే మా అత్తయ్య లక్ష్మి మంత్రం ఇచ్చింది అది చాలా పెద్ద మంత్రం ఇపుడు నేనూ చేయలేక పోతున్నాను నీకు చెప్తాను రేపు శుక్రవారం తలంటి పోసికో మంత్రం చెప్తాను అన్నారు ఆలా చెప్పించుకోవచ్చో లేదో నాకు తెలియదు ఆవిడ ను నిరాశ పర్చటం ఇష్టం లేక తల ఊపాను మర్నాడు ఉదయమే మా అత్తగారు నాకు ఆ మంత్రం చెప్పి చాలా పెద్ద మంత్రం రోజుకు పాతిక సార్లు తప్పక చేయి అని చెప్పారు ఆలా నాకు. లక్ష్మి నారాయణ హృదయం పుస్తకం మంత్రం నా ప్రమేయం లేకుండానే భగవంతుడు అనుగ్రహించాడు అప్పట్లో సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇంతబిజీ గా వుండే వారు కాదు చిక్కడ పల్లి లో వారి రుషి పీఠం ఆఫీసు లోనే పైన వుండేవారు నేను వారి ఆఫీస్ కి వెళ్ళి విష్ణు విద్య పుస్తకాలు కొని నా ఫ్రెండ్ అడిగితే పంపాను వారిని కూడా కలిశాను అపుడు నాకు వారిని కూడా ఒకసారి అడుగుదాం అని ఫోన్ చేశాను. ఆయనే మాట్లా డారు ఇలా మా అత్త గారు మంత్రము ఇచ్చారు చెసికో వచ్చా అని అడిగాను మీ పెద్ద వాళ్ళు చెపితే చేసుకోవచ్చు అని చెప్పారు నేను లక్ష్మి మంత్రం లక్ష్మి నారాయణ హృదయం ఎలా చేశాను వివరాలు రేపు
murthydeviv
Comments