నేను నా కథలు
కబుర్లు
రాత్రి పది గంటలకు అర్ణవ్ గోస్వామి అరుపులు ఓపిగ్గా విని బెడ్ రూంలో లోకి వచ్చిన శ్రీవారు పుస్తకాలు బీరువా ముందు కుర్చీలో కూర్చుని వున్న నన్ను ఏమిటీ ఈ రోజు నీ ఫేస్ బుక్ తెరవలేదు అని అడిగారు.
ఉండండి నేను నా కథలు కోసం వెతుకుతున్నాను అన్నాను. కథలా అవీ ఎప్పుడో పూర్వ ఆశ్రమమ్ కదా .
అయినా అప్పటి రోజుల కథలు ఇప్పుడు ఎవరు చదువుతారు
అదేం కాదు ఇప్పుడు అలాంటి కథల కే డిమాండ్ నన్ను డిస్టర్బ్ చేయకండి అన్నాను.
అయినా మీరే కదా నీకు రాసే టాలెంట్ ఉంది. కథలు రాయమని
గొడవ పెట్టారు .అంటూ నా పాత కాగితాలు , నోట్ బుక్ తీశాను ..
అన్నీ సగం రాసిన కథలే. అని వెతుకుతూ ఉంటే
సరే వెతుక్కో అంటూ తన ఫోన్ లో యూ ట్యూబ్ తెరిచి మరలా గోస్వామి చెప్పిన న్యూస్ కీ తెలుగు 9 , 5, 1 వాళ్ళు ఏమీ చెప్తున్నారో వినటం మొదలు పెట్టారు
నేను ఏదో స్వగతం లాగా అన్నీ సగం రాసిన కదలే వున్నాయి, నేను పొగడ పూలు అనే పూర్తి కథ రాశాను , కదండీ అదీ మీరు చదివి బాగుందని దీపావళి యువ పోటీలకు పంపారు అన్నాను.
ఓ ఆ కధ నా అప్పుడు నేను తిప్పి పంపటానికి స్టాంపులు పెట్ట టం మర్చి పోయా. కదా వాళ్ళు ఆ కథ వెనక్కి పంప లేదు గా అని చావు కబురు చల్లగా చెప్పారు..
ఆ రోజు నీ దుఃఖం చూడ లేక తాజమహల్ లో మసాలా దోస
తిని. జీవన తరంగాలు సినిమా చూపించా గుర్తు లేదా అన్నారు.
ఇప్పుడు మాత్రం పోయింది ఏముందీ సగం రాసిన కథ పూర్తి చేసి ఫేస్ బుక్ లో పెట్టేయి అని ఓదార్పు..
అసలు మీరే నా టాలెంట్ నీ ఇంప్రూవ్ చేసుకొనివ్వలేదు .
ఈ హైదరాబాద్ వచ్చి జాయింట్ ఫ్యామిలీ లో నా టాలెంట్ అన్నీ
వృధా గా అయిపోయాయి అనుకుంటూ సగం రాసిన కథలు బయటికి తీశాను .
ఎలాగయినా ఫేస్ బుక్ లో కథల పోటీకి ఒక కథ పంపాలి అని నిర్ణయించు కు న్నా ను
అయ్యో ఎలా భావుక లో పదిహేను లాస్ట్ డేట్ కథ పూర్తి చేయాలి , మనవరాలి సహాయం తో మెయిల్ లో పంపాలి .
పోనీ ఈ సగం కధలు అన్నీ తీసి డిసెంబర్ కధన కుతూహలం కయినా పంపుదాం అనుకుంటూ కొత్త ఉత్సహం తో బీరువా మూసాను.
కేవలం సరదాగా రాశాను కథ లాగా కామాలు , అన్నీ పెట్టీ ఈఐ పాడ్ లో కంప్యూటర్ లో రాయలేను , అదే పేపర్ మీద అయితే ఎంతయినా రాయ గలను.
అయినా ప్రయత్న లోపం ఉండకూడదు కదా ట్రై చేద్దాము.
Comments