నేను నా ఆధ్యాత్మిక పుస్తకాలు 3
- murthydeviv
- Dec 16, 2024
- 1 min read
శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేయడం వలన కలిగే ఫలితాలు ఫలశృతిలో వివరముగా వున్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా రాయటం లేదు . శ్రీమాత స్తోత్రాలలో అతి ముఖ్యమైనది విశిష్ట మై నది త్రిశతి స్తోత్రమ్ ఈ స్తోత్రమ్ శివ పార్వతుల ఇద్దరిచే స్వయంగా చెప్ప బడింది. అగస్త్యుడు దేవి భక్తులలో అగ్రగణ్యుడు. గురువైన హయగ్రీవుని శ్రీదేవీ కృప కొరకై ఫ్రా ర్ధించెను. అగస్త్యుని భక్తి కి మెచ్చిన శ్రీదేవి అగస్త్యుని కి తమ దంపతులచే రచించ బడిన రహస్యమైన త్రిశతి నామ స్తోత్రము అగ స్ట్యునకు ఉపదేశించమని హయగ్రీవుని కు అనుజ్ఞ నొసగినది. ఆ దివ్య దంపతుల అదేశము వలన ఈ స్తోత్ర రాజము మానవులకు లభించినది. త్రిశతి అనగా మూడు వందలు ఈ స్తోత్రమ్ అందు మూడు వందలు నామములు వున్నవి. ఈ నామములు మంత్ర బీజాక్షర సహితములై మహా మహిమన్వితమైన వి. పంచదశి మహా మంత్రం మున పదహైదు అక్షరములు వున్నవి . ఈ మంత్రము నందలి ఒక్కొక్క అక్షరము ఇరువది నామములు మొదట వుండునట్లుగా మూడు వందలు నామములు కూర్చబడినవి . ఈ మంత్రము లోని అక్షరముల సంఖ్య ను మానవ దేహము లోని చక్రములను శ్రీ చక్రా వయములను కలుపగా ఏర్పడు సంఖ్య ఇరువది తో గుణింపగా ఏర్పడు సంఖ్య మూడు వందలు. 15 మంత్ర సంఖ్య అవయముల సంఖ్య ఇరువది . రెండూ గునింప గా వచ్చు సంఖ్య. మూడు వందలు. ఇదియే త్రిశతి నామ వై శి ష్ట్యం ము ఈ విధముగా ఈ స్త్రో త్రం మహా మహిమన్వితమైన మంత్రరాజము.. జగద్గురు ఆది శంకాచార్యులవారు ఈ స్తోత్రము నకు భాష్యము రచించారు . సాధన గ్రంథ మండలి తెనాలి వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు . శ్రీ తా డే పల్లి రాఘవ నారాయణ శా స్ర్తీ గారు వ్యాఖ్యానం రాశారు . శ్రీమాత కృప వలన చదివాను కానీ ఎంత వరకు అర్థం ఆయిందో చెప్పలేను శ్రీ మాత్రే నమః రేపు కలుసు కుందాము
Comments