నేను నా ఆధ్యాత్మిక పుస్తకాలు 2
- murthydeviv
- Dec 15, 2024
- 2 min read
శ్రీదేవి ఆయుధములు గురించి ఈ రోజు తెలుసుకుందాము పాశము అంకుశం రాగద్వేషాలకు ప్రతీకలు మనోరుపేక్షుకోదండా పంచ తన్మాత్ర సా య కా పంచ పుష్ప బాణాలే పంచ తన్మాత్రలు వీటి నుండి పంచ భూతముల పుట్టినవి క ల్హారం కలువ పువ్వు భూమికి చిహ్నం కమలము జలము కు చిహ్నం రత్న కైర వం ఎర్ర కలువ అగ్నికి చిహ్నం ఇందివరం నల్ల కలువ వాయువు కు చిహ్నం సహకారం తియ్య మామిడి పువ్వు ఆకాశ ము కి చిహ్నం. జనుల అందరి సమిష్టి మనసు ఆమె చేతిలో వున్న చెరుకు విల్లు మన చెవి ముక్కు నోరు కన్ను నాలుక తో అనుభవించే విషయాలు తన్మాత్రాలు వాటిని పుష్ప బాణాలు గా తన చేతిలో పెట్టుకొని మన కోరికలు నిరోధనానికి ఆమె కారణం అవుతుంది అరిష డ్వ ర్గములు అంతరించి చిత్త శుద్ధి కలగాలంటే అంబ ను ధ్యానించాలి. ఈ ప్రపంచంలో దేవీ స్తోత్రమ్ లలో ముఖ్యమైనది లలితా సహస్రనామ స్తోత్రము ; బ్రహ్మాండ పురాణం లో లలిత ఉపఖ్యానం లో ఈ సహస్ర నామం వున్నది ఈ స్త్రోత్రము వసిన్యాది వాగ్దేవలతో శ్రీదేవి అజ్ఞ తో కూర్చ పడింది లలితా సహస్రనామ స్తోత్రము హయగ్రీవుడు అగస్త్య మహర్షి కి ఉపదేశించారు ఈ నామములు శ్రీవిద్యా విజ్ఞాన సర్వస్వము అన వచ్చును ఈ సహస్ర నామాలలో ఏ నామం కూడా రెండోసారి రాదు ఈ సహస్ర నామాలలో శ్రీదేవి మూర్తి స్వరూపం అతి సుందరం గా వర్ణించబడింది ........ లలిత దేవి చరిత్ర పరమ శివుడు క్రోధాగ్ని లో మన్మథునీ బూడిద గా చేసేను అపుడు శివుని సేవకులలో చిత్రకర్ముడనే వాడు ఆ బూడిద తో ఒక మానవ ఆకారం చిత్రించెను శివుడా చిత్రం వైపు చూసినంతనే మానవ ఆకారం వచ్చెను ఆ మానవుడు శత రుద్రీయం తో శివుని అర్చించి శివానుగ్రహం పొందెను శివుడు ఆ మానవునికి అరువది ఏండ్లు ప్రపంచం పాలించ a అనుగ్రహించెను ఆ మానవుడు పరాక్రమం చూసి బ్రహ్మ భండ భండ అనెను ఆలా ఆ మానవునికి భండసురుడు అనే పేరు వచ్చింది అతను దేవతలును అనేక రకాలుగా భాధించెను అపుడు నారదుని ప్రేరణ తో దేవేంద్రుడు గొప్ప దేవి యాగం చేయగా హోమ కుండం నుండి ఒక మహా యంత్రం న త్రి మూర్త్య త్మక స్వరూప రాలై న దేవీ ఉద్భవించింది
దేవతలు దేవిని ఫ్రార్డించగా భండా సురిని వధించ పూ నుకొనెను అపుడు బ్రహ్మ దేవి తో వొంటరీ గా వున్న వ్యక్తి కి సార్వ బౌ మౌ త్వ ము లేదు అని శాస్త్రం ముల చెప్పినందున భర్త ను ఎన్నుకొనమని చెప్పెను దేవీ అపుడొక దివ్య పుష్ప మాలిక ను ఆకాశ ము న ఎగుర వేయగా అది శివుని మెడ పై పడెను శివుడపుడు కామేశ్వరుడా యెను అపుడా దేవీ కామేశ్వరీ రూపము ధరించి భర్త యిన కామేశ్వరుని తో పట్టాభి షిక్టు రాలయెను పిమ్మట లలితా దేవి భయంకర యుద్దం లో భండాసురుని వధించింది దేవీ ఉపాసకులు శ్రీచక్రము ను పూజించి లలిత సహస్ర నామ పారాయణ చేసి కామేశ్వరీ సూక్ష్మ రూపమైన పంచ దశాక్ష రీ మంత్రం జపం చేయుదురు
Comentários