ఈ విషయము గురించి రాసేది ఏముంటుంది అని నేనే అనుకుంటాను మనం కొన్ని పూజలు చేస్తున్నపుడు అష్టోత్తర సహస్ర నామాలు చదువుతున్నపుడు ఏవో అనుమానాలు వస్తూ వుంటాయి ముఖ్యంగా అమ్మ వారి గురించి ఆమె మూలప్రకృతి అంటారు త్రిమూర్తులకు తల్లి అంటారు కదామనకు చాలాసార్లు ఎన్నో అంశాలు మీద అవగాహన ఉండదు నాకు చాలా కన్ఫ్యూషన్ వుండేది అలవాటుగా పుస్తకాల షాపు వెళితే అక్కడ శ్రీ విద్యా ప్రకాశము అనే పుస్తకం కొన్నాను ఆ పుస్తకము దివాకర్ల వెంకట అవధాని గారి అబ్బాయి దివాకర్ల శర్మ గారు రాశారు ఆ పుస్తకము చదివితే అమ్మ వారి గురించి ఆ పూజలగురించి చాలా అవగాహన వచ్చింది నేను ఏదయినా మంచి పుస్తకం చదివినా ఏదయినా సంఘటన గురించి అయినా నచ్చితే అది రాసి పెట్టుకుంటాను అలా ఈ పుస్తకం గురించి కూడా రాశాను ఇపుడు మీ అందరితో పంచుకోవాలని రాస్తున్నాను మొదలు శ్రీ శర్మ గారు లలిత సహస్రనామం గురించి చెప్పారు సహస్ర నామాలలో అమ్మవారు వసిన్యాదీ వాగ్దేవ తలతో కీర్తించ పడుచున్నది మొదటి మూడు నామాలు శ్రీ తో మొదలు అవుతాయి ఇవి ప్రధానమైనవి శ్రీ తో కూడిన పంచదశి విద్య మొదటి నామం జగన్మాత అని అర్థం రెండోనామం జగత్తు ను పాలించే తల్లి మూడో నామం సింహాసనేశ్వరి ఆమె కూర్చున్న సింహాసనానికి ఐదు కాళ్ళు వుంటాయి ఈ నామం లో హింస అనే పదం సంహారం ను సూచిస్తున్నది అంటే సృష్టి స్థితి లయలు అనే మూడు కార్యాలు ఆమె అధీనం లో వున్నాయి వీటిని ఆమె త్రి మూర్తులు చేత చేయిస్తున్నది ఇవే కాక ఇంకో రెండు కార్యాలు ఆమె చేతిలో వున్నాయి అవి తిరోధనం అంటే సంసార బంధం అనే మాయలో మనల్ని కప్పి వుంచటం అనుగ్రహం అంటే మాయ ను తొలగించి జ్ఞానమనే మోక్షంప్రాప్తి ఇవ్వటం ఇవి సదాశివుని చేత చేయిస్తుందని చెప్పారు అందువలన ఆమె పంచ కృత్య పరా యణ అని తిరోధనా అనుగ్రహాద అనే నామాలు సూచిస్తున్నాయి చాలా మందికి అమ్మ వారి ఫోటోలు చూసి రాజ రాజేశ్వరికి లలిత పరమేశ్వరి కి తేడా ఏమిటి అని అడిగారు అపుడు నాకు కూడా తెలియదు శర్మగారు చక్కగా విడమర్చి చెప్పారు లలిత త్రిపుర సుందరీ మూర్తి మఠం వేసుకుని పీఠం మీద కూర్చుని ఉంటుంది రాజరాజేశ్వరి ఎడమ కాలు కిందకి వదిలి కుడి కాలిని పైకి మడచి తన పీఠం మీద కూర్చుని వుంటుంది కామేశ్వరి తన ఎడమ కాలు కింద కి వదిలి కుడి కాలిని పైకి మడిచి తన భర్త అయిన కామేశ్వరుని ఎడమ వైపు కూర్చుని వుంటుంది కామేశ్వరి తన నాలుగు చేతులలో వి ల్లు అమ్ము లు అంకుశం పాశం ధరిస్తుంది కామేశ్వరుడు జగత్పిత తన. కుడి కాలిని కిందకి వదిలి ఎడమకాలు పైకి లేపి పీఠం మీద దర్శనమిస్తాడు ఇరువురి వర్ణం ఎరుపు ఇరువురు కి నాలుగు చేతులు ఇరువురు త్రినేత్రులు తల పై చంద్ర వంక ఇరువురి కి వుంటుంది ఇరువురి నివాస స్థానం ఒకటే లలిత పరమేశ్వరి కి రెండు నివాస స్థానాలు చెపుతారు ఒకటి మేరు పర్వతం లో వున్న బ్ర హాండం సుమేరు శృంగ మధ్య స్టా రెండోది సుధా సాగర మధ్యస్తా వున్న మణి ద్వీపము ఆమె నివాస స్థానం శ్రీనగరం చుట్టూ ఉన్న 25 ప్రా కారములు వాటి మధ్య ఉండే ప్రదేశం అవరణలు ఈ 25ప్రాకారాలు 25 తత్వాలకు ప్రతీకలు ఐదు జ్ఞనేంద్రియాలు ఐదు కర్మే ఇంద్రియాలు ఐదు పంచ భూతాలు ఐదు తన్మత్రాలు అంటే మాయ మనసు శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు 26 తత్వము శ్రీదేవి లేక శ్రీ మాత ఈ ప్రాకార లు వర్ణన మణిద్వీప వర్ణన తో దుర్వాస మహాముని రచించిన ఆర్యా ద్విసతి లో రమ్యం గా వర్ణించ బడింది ఆ పుస్తకం గురించి తర్వాత చెప్పుకుందాము మా అక్కయ్య ఆ పుస్తకము తెలుగు లో వ్రాసింది అక్కడ ఆమె తన భర్త అయిన కామేశ్వరుని కూడి తూర్పు దిక్కు గా పంచ బ్రహ్మ సనం పై ఆసీనురాలై ఉంటుంది ఈ ఆసనానికి నాలుగు ఆధారాలుగా ఆగ్నేయం గా బ్రహ్మ నైరుతి దిశ గా విష్ణువు వాయువ్య దిశగా రుద్రుడు ఈశాన్య దిశలో ఈశ్వరుడు వుంటారు ఈ నాలుగు కాళ్ళ ను కలిపే పర్యంకం సదాశివుడు ఈ పంచ దేవతలు ను పంచ బ్రహ్మ లు అంటారు ఈ పంచబ్రహ్మ లకు అంబా సహకారం లేకపోతే పంచ ప్రే త లు గా మారిపోతారు కాబట్టే ఆమె పంచ తత్వాలకు అధి స్వరీ ఆమె కామేశ్వర ప్రాణ నా డి పంచ బ్రహ్మ శనస్థితా పరా శక్తి అయిన కామేశ్వరి అత్యంత శక్తి సమన్విత అయినా తన కన్నా ఉన్నత స్థానం లో ఉన్న కామేశ్వరుని తో కుడి వుంటుంది త్రిపుర సుందరి ని ఉపాసించే విధానము శ్రీ విద్య ఆమె పేరు శ్రీదేవి ఆమె యంత్రము శ్రీ చక్రము లేదా శ్రీయంత్రం ఈ శ్రీ విద్య లో హది విద్య అని కాది విద్య అని వున్నాయి ఆమె నామ రూప వివర్జితా శ్రీ యంత్రము ఆమె స్వరూపం ఆమె నివాసం ఆమె తన భర్త తో కూడి యంత్రము మధ్య లో ఉన్న బిందువు లోఉంటుంది శ్రీ చక్రము లో తొమ్మిది కోణాలు వుంటాయి ఇందులో దిగువుగా చూస్తున్న ఐదు కోణాలు దేవి కోణాలు ఎగువగా చూస్తున్న నాలుగు కోణాలు శివకోణాలు ఈ రకమైన శ్రీ చక్రం నే పూజ చేయాలి అన్ని యంత్రము లలో శ్రీచక్రము అత్యంత శక్తి వంత మైనది పూర్వ జన్మ సుకృతం ఉన్న వారే ఈ యంత్రము నీ అర్చించ గలరు శ్రీ చక్ర పూజనే నవవరణ అర్చన అంటారు ఈ పూజ విధానాన్ని గురు ముఖః గా గ్రహించాలి అమ్మ చేతి లోని ఆయుధములు గురించి వివరణ రేపు శ్రీ మాత్రేనమః
murthydeviv
Comments