నేను చేసిన నోములు పూజలు
- murthydeviv
- Oct 25, 2024
- 1 min read
ఓం గణేశాయానమః
భక్తి అనేది ఎలా వస్తుందో తెలియదు బహుశా చిన్నప్పుడు పెరిగిన వాతావరణం కారణం కావచ్చు లేక మన చుట్టూ ఉండే కంపెనీ నుంచి రావచ్చు. దేవుడు అంటే భయమా? భక్తీ? ఏదో కోరిక అనుకోని దేవుడికి ఇలా చేస్తాను అని మొక్కుకోవటమా లేక అలవాటుగ చేయటమా అలా చేస్టే ఆనందం వస్తుందా ?తృప్తి వస్తుందా? ఇన్నాళ్ళు చేసినా ఏది అనేది అర్ధము కావట్లేదూ ఇది ఆజ్ఞ్యానం కావచ్చు. ఆనందం కోసం వెతకటమే జీవిత లక్ష్యం అయితె అది ఒకొక్కరికి ఒకలాగా ఉండచ్చు. మన ఊహ తెలిసాక అమ్మ మొదటి గురువు ఎవేరికయినా, కానీ జాయింట్ ఫామిలీస్ అయితె బామ్మా కావచ్చు తాత కావచ్చు. ఎవెరి ప్రభావం అయినా ఉండచ్చు. ఇప్పటికీ కార్తీకమాసం రాగానే మా నాన్న మా,చిన్ననాయనమ్మ గుర్త్తు వస్తారు కార్తీకసోమవారంలో గుడికి తీసుకొని వెళ్ళటం బిచ్చ గాళ్ళకు బియ్యము వేయించటం గుడిలో ముగ్గులు వేసి, కొబ్బరి చిప్ప లో ఆవునేయితో దీపాలు వేలిగించటం. అది అంతా కళ్ళ ముందు కదుల్తూఉంటుది
Note: Thank you to my grand daughter, Siri for helping me to write this.
Comments