. దసరా పండగ కబుర్లు
దసరా పండగ కబుర్లు
దసరా హడావిడి అయింది . రోజూ రకరకాలుగా పూజలు నై వేద్యా లు..
దసరా సందడే సందడి. పూజలు కాకుండా ఇంకా జపాలు ఉంటే ఈ దసరా రోజుల్లో తప్పకుండా చేయాలి. అలా ఇంకా ఎక్కువగా హడావిడి.
ఏ పండగ అయినా మన చిన్నప్పటి రోజులు గుర్తు వస్తాయి. అప్పటి లాగా జయీ భవ విజయి భవ అంటూ యింటికి వచ్చి కోలాటం ఆడే స్కూల్ పిల్లలు లేరు .
అయ్య వారికీ చాలు ఐదు వరహాలు, పిల్ల వాళ్లకు చాలు పప్పు బెల్లాలు అనే పాట కూడా ఇప్పుడు వుందో లేదో తెలియదు.
ఇప్పుడు పిల్లలు కు ఫైవ్ స్టార్ లు, పిజ్జా లు ఇవ్వాలేమో.
పండగ అనగానే నాకు మా ఆమ్మ గారు ఇంటినిండా పెట్టే పిండి ముగ్గులు ముందుగా గుర్తు వస్తాయి. ప్రతీ పండగకి ముందు రోజే ఇళ్ళు కడిగి తెల్లటి నాపరాయి ఏదో దొరికేది , అందులో నీళ్లు పోసి నానపెట్టి ఒక సన్నటి గుడ్డ వేలికి చుట్టుకుని ఇల్లు అంతా చక చకా ముగ్గులు పెట్టే వారు..
తెల్లవారుజామున లేచి తలంట్లు పోసుకుని జడ కుప్పెలు తో జడ లు వేసుకుని
చేమంతి పూలు జడ లో , పట్టు లంగా లతో నాన్నగారి పూజ అయ్యి హారతి టైమ్ కీ
హాజరు గా ఉండాలి .
ఆ హారతి, మంత్ర పుష్పము అయ్యేక , దగ్గర లోనే వున్న మూడు దేవాలయం ల
వూరేగింపు వచ్చేది . దేవుడి రధం మన ఇంటి ముందుకి వచ్చే టప్పటికి
హారతి పళ్లెం తో అక్కడ తయారు గా ఉండాలి.
కాలేజీ చదువు అయ్యి ఉద్యోగం చేస్తూ కూడా ఈ కార్యక్రమం లో ఏమీ మార్పు ఉండేది కాదు.
నేను ఫైనల్ ఇయర్ లో ఉండగా అన్నయ్య పెళ్లి అయి వదిన గారు వచ్చారు.
మా వదినకు వాళ్ళ నాన్నగారు పెళ్ళికి ముందే గుంటూరు లో మంత్ర జపం ఇప్పించారు . వదిన రోజూ చాలా దీక్ష గా జ పం తో పాటుగా లలితా సహస్ర
పారాయణం చేసేది
ఇంక ఈ పండగ రోజుల్లో వదిన పక్కన కూర్చుని పారాయణం చేయటం నేర్చుకొమ్మని అమ్మగారి ఆజ్ఞ. అలా అలవాటు అయిన పారాయణం తో పాటు
అత్తగారి ప్రొదబ్లమ్ తో నోములు , జపాలు ఇప్పుడు నవరాత్రులు
ఎంతో హడావిడి .
హైదరాబాద్ లో ఇప్పుడు వున్నంత డాండియా హంగామా ఇదివరకు ఉండేది కాదు. బతకమ్మ , పూజలు బాగా ఉండేవి.
విల్లా కమ్యూనిటీ ల్లో కూడా పిల్లలు చేత డాన్స్ డ్రామా లు అవీ వేయించే వారు.
పిల్లలు చేత కోలాటం , డాన్సులు ఉండేవి. మా మనవడు రెండు మూడు సార్లు రామాయణం డ్రామా లో పార్టిసిపేట్ చేసాడు.. ఇంక అడపిల్లలు కోలాటం తో ఇంట్లో కూడా సందడి చేసేవారు.
ఇప్పుడు ఏదో పండాల్స్ వేసి దాండియా ట, కోకా పేట లో చాలా జరుగుతున్నాయి అని మా అమ్మాయి చెప్పింది. వాళ్ళు వెళ్ళారుట.
మా అమ్మాయి అత్తగారి అలవాటు ప్రకారం బొమ్మలు పెట్టింది. తొమ్మిది రోజులు లలితా పారాయణం విల్లాల్లో సందడే సందడి.
నాకు మాత్రం పారాయణం కీ వెళ్ళటానికి వీలు కాలేదు. బొమ్మలు చాలా చక్కగా పెట్టింది చూసి వచ్చాను.
మా ఫ్రెండ్ ఒకావిడ ఈ తొమ్మిది రోజులు రోజు కొక రకం పూలతో అమ్మవారికి పూజ చేస్తుంది. ప్రతీ ఏడు పిలుస్తుంది , ఈ ఏడాది వెళ్ళ లేదు..
ఇంకా గురువు గారి దగ్గర నవా వరణ అర్చన, రోజూ హోమాలు జరుగుతాయి.
ఇదివరకు రోజుల్లో ఇంట్లో పూజ చేసుకుని అక్కడికి పరిగెత్తే దాన్ని. ఇప్పుడు వయసు ప్రభావం తలుచుకుని నమస్కారం చేసుకోవ టమే.
ఇంకొక స్నేహితురాలు సప్తమి, అష్టమి, నవమి మూడు రోజులు ఎంతో వై భ వంగా చేస్తుంది. కలశం పెట్టీ చేస్తారు కాబట్టి చాలా నియమ నిష్ఠలు వుంటాయి.
దుర్గా అష్టమి రోజూ మా ఇంటి చుట్టు పక్కల మూడు ఇళ్లల్లో
అష్టమి పూజలు జరిగాయి .పెద్ద మండపాలు పూల అలంకరణ లు చాలా హంగామా గా ఉన్నది. ఎదురుగా ఉండే వాళ్ళు పిలిచారు .
మా కోడలు వెళ్ళింది.
. ఏమీ చేసినా భక్తి శ్రద్ధ ముఖ్యం..
ఆ లలితా పరమేశ్వరి ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ
శుభాకాంక్షలు
Comments