దసరా నవరాత్రులు
- murthydeviv
- 6 days ago
- 3 min read
Updated: 5 days ago
మామూలుగా చెప్పుకునే కబుర్లు కాకుండా పండుగ సందర్భంగా అమ్మ వారి గురించి రాద్దామని ఆలోచన. అందులో ఇప్పుడు యూట్యూబ్ లో , ఫేస్ బుక్ లో ఎన్నో పోస్టులు ఈ దసరా నవరాత్రులు గురించి, ఏం నైవేద్యము పెట్టాలి, ఏ విధంగా పూజ చేయాలి.అని చాలా మంది చెపుతున్నారు. నేను అదే చెప్తానని భయపడకండి. అమ్మ వారిని తలచుకుంటూ అమ్మ వారి గురించి మహానుభావులు రాసిన కొన్ని పుస్తకాలు గురించి చెప్దామని ఈ ప్రయత్నం. మా చిన్న తనం లో దసరా నవరాత్రులు గుడి లోనే రోజు కి ఒక అలంకరణ చేసే వారు. భక్తి అనేది ఎలా ఏర్పడుతుందో తెలియదు . బాల్యం లో పెరిగిన వాతావరణం కావచ్చు. లేకపోతే సాంగత్యం వల్ల కావచ్చు. కానీ మన చిన్నతనం లో చాలా కొద్దిమంది మాత్రమే ఈ దసరా పూజలు ప్రత్యేకంగా చేసేవారు . లలితా సహస్రము కూడా అందరూ చదివే వారు కాదు. నేను హైదరాబాద్ వచ్చాక దగ్గర లోనే మా కజిన్ సిస్టర్ వుండేది. ఎక్కువగా తన ప్రోద్బలంతో ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం అలవాటయింది.నవలలు, వార పత్రికలు చదవడం బాగా అలవాటు. కానీ ఈ పుస్తకాలు చదవాలి అంటే కొంచెము ఎక్కువ ఓర్పు ఉండాలి. ముందు చదువుతూ ఉంటే నిద్ర రాకుండా ఉండాలి. ఈ ఉపోద్ఘాతం ఎందుకు అని ఆలోచిస్తున్నారు ఏమో , కొంత పరిచయం చేస్తే ఒక వేళ నేను తప్పులు రాసినా క్షమిస్తారు అని నా భావన. మా అక్కయ్య బావ గారు శ్రీ విద్యా సేవా సమితి అనే సంస్థ లో మెంబెర్స్ గా వుండేవారు అపుడు దివాకర్ల అవధాని గారి ఉపన్యాసం లు కొన్ని విన్నాను .ఆ సంస్థ వాళ్ళు సాధన గ్రంథ మండలి వాళ్ళ జగద్గురు బోధలు అనే బుక్స్ అమ్ముతూ వుంటే మా అక్కయ్య ప్రోద్బలంతో కొన్నాను.అవి కంచి పరమాచార్య గారి ఉపన్యాసం లకు తెలుగు లో అనువాదం చేసిన పుస్తకాలు. ఆ పుస్తకాలు చదవటం వలన నా దృక్పథం లో చాలా మార్పు వచ్చి అక్కయ్య ప్రోత్సాహం తో ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం అలవాటయింది. అలాగే అక్కయ్య తో గురువు గారి దసరా పూజలు కి వెళ్ళటం అలవాటయింది. అక్కడ అందరూ ఉదయం పది గంటల నుంచి వ్యాస పీఠము మీద పుస్తకం పెట్టీ మౌనంగా పారాయణ చేస్తూ మద్యలో జపం చేస్తూ వుండేవారు. అక్కయ్య కూడా అలాగే చేస్తూ వుండేది. వాళ్లు చదివే ఆ పుస్తకం దేవీ, లేక దుర్గా సప్తశతి .ఈ స్తోత్రము మార్కండేయ పురాణము లో దేవీ మహత్యం లో భాగం ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి కాబట్టే సప్త సతీ అన్నారు.ఈ ఏడు వందల శ్లోకాలు చాలా మహిమ గల మంత్రాలు గా పరిగణించి పారాయణ చేయడం, ఇవే మంత్రాలు తో చండీ హోమం చేస్తారు.ఈ రోజుల్లో అందరూ చదువుతూ ఉన్నారు కానీ అపుడు గురువు గారి దగ్గర అందరూ చదివే వారు కాదు. ప్రత్యేకంగా చండీ మంత్రం ఉన్న వారే ఆ పారాయణ కు కూడా అర్హులు.ఆ పుస్తకము చదవటానికి కూడా చాలా నియమాలు పాటించే వారు. ముఖ్యంగా పుస్తకం చేతిలో పట్టుకుని చదవ కూడదు. తల ఊపుతూ దీర్ఘం తీస్తూ చదవ కూడదు అనే వారు.ఆ నియమాలు అన్నీ ఆ పుస్తకము లోనే ఉంటాయి. ఇంకొక నియమం ఏమిటంటే మంత్ర జపము అక్షర లక్ష చేస్తే కానీ ఆ పారాయణ చేయడానికి కి అర్హులు కారు అని చెప్పే వారు . వాళ్ళ ను చూసి నేను కూడా ఆ అర్హత లన్నీ సంపాదించి దేవీ మహత్యం పారాయణ చేయగలుతున్నాను. దేవీ మహత్యం లో నాలుగు అధ్యాయాలు లో అద్భుతమైన స్తోత్రం లు ఉన్నాయి.ఈ గ్రంథము లో పదమూడు అధ్యాయాలు ఉన్నాయి..ఈ పదమూడు అధ్యాయాలు నీ మూడు చరిత్ర లు గా ఉంటాయి. ఒకటో అధ్యాయం ప్రధమ చరిత్ర మధు ఖై ట భ వధ . రెండు, మూడు, నాలుగు అధ్యాయాలు మధ్యమ చరిత్ర, మహిషాసుర వధ. ఐదు నుండి పదమూడు అధ్యాయాలు ఉత్తమ చరిత్ర లో శంభు నిశుంబు లను వధించుట. ఇందులో చెప్ప బడిన దేవీ, చండీ, మహామాయ , కాళి, మహేశ్వరి, ఈ నామములు అన్నీ మహా కాళీ, మహా లక్ష్మీ, మహా సరస్వతి ల సమష్టి రూపము లు.ఈ రూపము ల కు పురాణం లోని లక్ష్మీ పార్వతి, సరస్వతి రూపము లకు సంబంధం లేదు. ఈ మహేశ్వరి సత్వ, రజో, తమో గుణాలు లకు ప్రతీక. ఈ గ్రంథం లో శ్రీదేవి మూడు మహా అవతారం లను దాల్చి తొమ్మిది మంది రాక్షసులు ను వధించిన వైనమే ఈ గ్రంథంలో నీ విషయం. లలితా సహస్రము లోని కొన్ని నామములు ఈ గ్రంథంలో నీ అసుర సంహారం విషయాలను తెలియ చేస్తుంది. ఈ గ్రంథం లో నీ చిత్రించ బడిన అసురుల మనలోనే వున్నారు.ఈ అసుర లక్షణములు మన లోని అహంకారం, మమకారం కలిగించే అరిషడ్వర్గాలు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యా లు వీటిని నిర్మూలించి గలిగిన వారికే విజయం. మథు మధు ఖై తభులు మన లోని అహంకారం నికి ప్రతీక . మహిషుడు మన లోని పశు లక్షణాలు కు, మన యొక్క అత్యాశ, స్వార్థం, మమత, మొదలగు పాశం లో చిక్కుకుని వారి యొక్క మోహం తొలగించడం అనే ప్రక్రియ ఈ రాక్షస వధ లు . దుర్గా దేవి కార్యదీక్ష కు , దీన జన రక్షణ భక్తుల కోరికలు తీర్చే ఆశ్రిత కల్పవల్లి ఇంకా కొన్ని విషయాలు రేపు తెలుసుకుందాము. అమ్మ వారి భక్తుల కు ఈ విశేషాలు అన్నీ తెలిసే అవకాశం ఉంది. అయినా నాకు అర్థం అయినంతవరకూ మీతో పంచుకోవాలని కోరిక ఏమయినా తప్పులు ఉంటే ఆ జగజ్జనని క్షమిస్తుంది అనే ఆశ తో
దుర్గే మా పాహి అనా జాగేలనే వో బాలా హిమ వంతుని ప్రియ పుత్రిక వంచు కొలిచేదన్
ఘోర తపము చేత మారి వైరి నీ మెప్పించి సగము తనువు తాల్చినావు తల్లీ కాత్యాయని
Comments