top of page
Search

దశ మహా విద్యలు

  • murthydeviv
  • Dec 30, 2024
  • 2 min read

దేవీ ఉపాసన లో పది మార్గములు వున్నవి. ఈ పది, శ్రీదేవి యొక్క పది శక్తి రూపాలు. ఈ పది దేవతలకు పది శక్తి రూపాలు.. ఈ పది దేవతలకు పది యంత్రాలు వున్నాయి.. మళ్ళీ ప్రతి యంత్రమునకు ఒక మంత్రము కూడా వుంటుంది.

గురు ముఖముగా ఉపదేశాన్ని పొందిన వారు ఈ పది దేవతలలో ఈ దేవత నై నా ఉపాసించి, వాళ్ళ, వాళ్ళ ఐహిక వాంఛల ను పొంద వచ్చును.

ఈ పది శక్తి దేవత ల పేర్లు 1 , కాళి 2.. తారా 3.. షో ఢ శి 4, భువనేశ్వరి 5, భై రవి, 6, చిన్న మస్తా 7, ధుమా వతి,

8, బగ ళ,9, మాతంగీ,10, కమలా

ఇవీ దశ మహా విద్యలు, ఈ శక్తి దేవతల గురించి క్లుప్తముగా తెలుసుకుందాము.

కాళి... ఈ దేవత నల్లని వర్ణాన్ని కలిగి, అత్యంత ఉగ్ర రూపము తో దర్శనము ఇస్తుంది. ఈమె పాదాలు ఎల్లపుడూ శివుని వక్ష స్థలం పై నాట్యము చేస్తూ వుంటాయి. ఈ మె కాల హంత్రి. కలకత్తా కాళి మందిరము లో ఈమె రూపమును మనం దర్శించవచ్చు.

తారా... ఈ దేవత తేజస్సుతో కూ డిన నీల వర్ణము కలిగి అంత్యంత ఉగ్ర రూపాన్ని కలిగి వుంటుంది. ఖండిప బడిన తలలతో కూర్చ బడిన మాల ను హరము గా ధరించి, పులి చర్మాన్ని వస్త్రము గా దాల్చి స్మ శాన వాటిక లో శివుని వక్ష స్థలం పై. పాదాల నుంచి నాట్యము చేస్తూ వుంటుంది. ఈమె ఆధ్యాత్మిక విద్య కు ప్రతీక..

షోడశీ.,.. ఈమె పదునారేండ్ల వయసు లో గల యువ్వనవతియు, సౌందర్య రాశి యు అయిన దేవత. ఈమె త్రినేత్రి. ఈమె నాలుగు హస్తాల్లో పాశం, అంకుశం, ధనుస్సు, బాణాలు, ధరిస్తుంది. ఈమెకూ త్రిపుర సుందరి కి ఏ విధమైన భేదము లేదు.

భువనేశ్వరి... ఈమె మూడు లోకాలను ఏలుతుంది. ఈమె చేతిలో ఒక ఫలము వుంచుకొని భక్తుల కోర్కెలు తీర్చును.

భైరవీ.... ఈమె అపుడే ఉదయిస్తున్న సూర్యుని అరుణ వర్ణము కలిగి వుంటుంది. ఈమె వక్ష స్థలం పసుపు తో కూడి ఉంటుంది. ఈమె చేతులలో అక్షమాల, పుస్తకం ధరిస్తుంది. ఈమె మందహాస వదనాన్ని కలిగి వరా, అభయ ముద్రలు ప్రకటిస్తుంది.

చిన్న మస్థా..... ఈమె కూడా ఖండిత శిరస్సుల తో కూర్చబడిన మాల ను హారం గా ధరిస్తుంది. తన ఖండిత శిరస్సు ను చేతులతో పట్టుకొని మొండెం నుంచి ఉద్భవించిన రక్త ధార లను తన నోటితో త్రాగుతూ వుంటుంది .ఈమె వివస్త్ర అయి చూచుటకు భయంకర రూపాన్ని దాల్చి వుంటుంది. ఈమె ఎముకల హరమును మెడ లోను, పామును జ్యందం గానూ

ధరిస్తుంది. ఢాకిని, వర్ణిని,అను వారు ఈమె కు పరిచారికలు. వీరు కూడా ఆమె మొండెం నుండి చిమ్ము రక్త ధార లను

పానము చేయుదురు.

ధూమవతి... ఈమె కళా విహీనము, కఠోరమైన రూపాన్ని దాల్చి,దంతములు, ఊడిపోయి, మలిన వస్త్రాలను ధరించి ఉంటుంది. ఈమె కుచములు విగ ళి తములై, వక్ష స్థలం నుండి వేలాడుతూ వుంటాయి. ఈమె దృష్టి మృదుత్వాన్ని కోల్పోయి,

విధవ రాలి కళ తో వుండును. ఈమె దారిద్ర్యము నకు, దురదృష్టంమునకు, విచారమునకు, నిరాశకు దేవత.

బగ ళా.... ఈమె రత్నములతో కూర్చబడిన సింహాసమును అధిష్టించి, పీ త వర్ణముతో వుండును.. ఈమె తన శత్రువు యొక్క నాలుకను వామ హస్తము తో పట్టుకొని , అతనిని గదా ప్రహారాము చేయుచుండును.

మాతంగి... ఈమె నల్లని వర్ణము కలిగి వుండును. ఈమె కూడా మణులతో కూడిన సింహాసనము పై ఆసీనురాలై

ఖడ్గము, పాశం , అంకుశం తన చేతులతో ధరించును.

కమలా,.... ఈమె చుట్టూ నాలుగు మత్తేభములు కలశ ములతో అమృత ధార లు ఆమె పై కురిపించు చుండును. ఈమె బంగారు వర్ణము తో వుండును. ఈమె వర ముద్రను థరించును. ఈమె పట్టు వస్త్రములు ధరించి పద్మముపై

అశీనురాలైయి వుండును.

పైన పేర్కొనబడిన దేవతలలో షో డ శి లేక త్రిపుర సుందరి, భువనేశ్వరి, కమలా, ప్రసిద్దములు.

నేను చదివిన పుస్తకము లోని కొన్ని విశేషాలు అందరితో పంచుకోవాలని రాస్తున్నాను ఆ త్రిపుర సుందరి గురించి నాకు తెలిసింది ఒక అణు మాత్రము వుండదు.అయితే తెలుసు కోవాలి అని ఒక ఆకాంక్ష మాత్రం వున్నది. ఏ పుస్తకం చదివినా ఏదయినా నచ్చిన అంశం వుంటే ఒక చోట వ్రాసి పెట్టుకోవటం అలవాటు . అలా వ్రాసి పెట్టుకున్న కొన్ని విశేషాలు మీ అందరితో పంచుకోవాలని రాస్తున్నాను. శ్రీ విద్య, త్రిపుర సుందరి విషయక గ్రంథాల గురించి సంగ్రహముగా రేపు తెలుసుకుందాము

శ్రీ మాత్రే నమః

 
 
 

Recent Posts

See All
అమృత హస్తం

ఈ మధ్య మా కోడలు పుట్టిన రోజున మా పిల్లలు హోటల్ కు డిన్నర్ కు తీసుకుని వెళ్ళారు. హోటల్ పేరు ఎర్ర కారం. గుంటూరు కారం సినిమా లాగానే ఆ పేరుకు...

 
 
 
పెళ్ళి పెట్టె

మా చిన్న తనం లో పెళ్ళి జరుగుతున్న పుడు పెళ్ళి మండపం లో ఎవరో ఒక పెద్ద వాళ్ళు ఒక పెట్టె పెట్టుకుని కూర్చుని వుండే వారు. ఏ బాబాయి గారో...

 
 
 
రూట్స్

ప్రస్తుతం ఉదయాన్నే పేపర్ చూడగానే ట్రంప్ గారు ఏమి సెలవు ఇచ్చారో, ఈ గొడవల్లో మనవాళ్ళు అంతా ఎలా వున్నారో అని ఒక అనుమానం వస్తుంది....

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page