ప్రధమ చరితము నందు మధు కైటభులు సృష్టి కి విఘ్న రూపులు. వీరు ఇరువురు రజ స్థమో గుణ మాలిన్య రూపు లు
మహాకాళి వీరిని వధించుట. వలన బ్రహ్మ దేవుని సృష్టి కార్యక్రమమునకు విఘ్నము తొలగి పోయినది.
మధ్యమ చరిత మందలి మహిషాసురుడు రజోగుణ పూరితుడు, మనలోని అహంభావం ము నకు ప్రతీక
ఉత్తమ చరితము నందు శంభు నిశుంభులు రజోగుణ ప్రవుత్తి య గు రాగమునకు చిహ్నము .
రక్త బీజునీ నుండి ఉత్పన్న మగు రక్త బిందువులు బీజముల వంటివి. బీజము మనస్సు అనే క్షేత్రము పై
పడినపుడు, అవి ఫలించి అనేక బీజములను ఉత్పత్తి చేయును. ఆ బీజముల ను మరి యొక సారి
నాటు టకు వీలగును. అటులనే ప్రతి ఒక్క కోరిక అనేకమైన ఇతర కోరికలకు దారి తీసి, వాటి వలన మానవునికి
సంతృప్తి అనునది మృగ్యమగును.. చాముండా రూపములో మహాకాళి రక్త బీజుని నుండి బయల్పడిన ప్రతి రక్త
బిందువును క్రింద పడకుండా వెనువెంటనే త్రాగి వేయుట , అనగా కోర్కెలను ఉదయించిన తోడనే ఎప్పటికి అపుడు
నిర్మూలించినచో, కోరికలు, వ్యామోహము నుండి విముక్తి సాధించ వచ్చునని ఇందలి అంతరార్థము.
వివిధ అస్త్రముల తో దేవి అసురులను సహంరించుట లో అంతరార్థము
నాలుగవ అధ్యాయము లో 19వ శ్లోకములో, అసురల నెల్లరును నీవు చూపు మాత్రముననే భస్మము చేయుదువు కదా
కానీ నీవు వారిపై శస్త్రముల ను ప్రయోగించుట ఎల అనగా, శతృవులు గా వుండు వారు కూడ ఆ శ స్త్ర ముల చేత పవిత్రత
చెంది ఉత్తమ లోకములు పొందుదురు గాక! అని నీకు వారి ఎడల కూడా అత్యంత సాధు చిత్తము ఇట్టి ది అని దేవతలు అమ్మ వారి కరుణ గురించి మనకు ఈ శ్లోకములో తెలియ పరిచారు.
ఈ విధముగా అనేక ము లైయిన రహస్య అర్థములు కలవు.
留言