దేవీ సప్త శతి లేక దుర్గా సప్త శతి 1
- murthydeviv
- Dec 25, 2024
- 2 min read
దేవీ సప్త శ తి లేక దుర్గా సప్తసతి దేవీ మహత్యము 700శ్లోకములు గలది.శ్రీ వేదవ్యాస విరచిత మార్కండేయ పురాణము లోనిది.ఈ సప్త సతి లో పదమూడు అధ్యాయాలు కూడినది. ఈ దేవి మహత్యం భారత దేశం మంతా ప్రసిద్ది చెందింది.
ఈ 700 శ్లోకములే పారాయణ చేయునపుడు గానీ, చండీ హోమము చేయునపుడు గానీ ఉపయోగించుట సాంప్రదాయము గా వున్నది. వేదములలోనీ రుద్రము నకు ఎంత ప్రాధాన్యం మున్నదో ఈ దేవి మహత్యము నకు అంత
ప్ర ధాన్య మున్నది. దేవీ మహత్యము గ్రంథమునకు సుమారు12 వ్యాఖ్యానాల వున్నవి.అవి స్వాత్వికం గా, తంత్ర పరంగా
జ్ఞాన పరంగా కూడా వున్నాయి. ఈ గ్రంథములో వున్న శ్లోకములు సుమారు 530 కానీ దేవీ ఉవాచ, రుషి ఉవాచ,
రాజ ఉవాచ అనే వాటిని కూడా మంత్రములుగా పరిగణించి మొత్తం 700 శ్లోకములు గా చెప్పారు.చండీ హోమము చేయునపుడు ఈ శ్లోకములు కు స్వాహా అని చెప్తూ చేస్తారు. ఈ గ్రంథము ప్రస్తుత రూపము సుమారు 4శతాబ్ది నుండి
ప్రచారములో వున్నది. గుప్త రాజుల మన్ననలు పొందినది అని తెలుస్తున్నది. ఈ గ్రంథము శా క్తే యులకు, తంత్ర శాస్త్ర వేత్తలకు ప్రామాణిక గ్రంథం. ఏడు సంఖ్య కు అంత్యత ప్రాధాన్య యున్నది. భగవద్గీత లో కూడా 700 శ్లోకములు ఉన్నాయి
లోకములు, ఏడు, మానవ దేహము లో ధాతువులు ఏడు, కుల పర్వతాలు, మహా సముద్రాలు, మహా ద్వీపములు,
మహా వ్యాహుతులు, అన్నియు ఏడు సంఖ్య తో కూడినవే.. సప్త శతీ లోనీ ఏడు వందల శ్లోక ముల ఏడు వంద ల మంత్రములు.ఈ మంత్రములకు స్వాహా చేర్చి చండీ హోమము చేయుదురు. ఈ సప్తశ తీ కు ముందు దేవీ కవచము అర్గలం
కీలకమ్ అని స్తోత్రము లు వున్నాయి. పారాయణ కైనా, హోమము కైనా ఈ స్తోత్రము లు కూడా చదువు తారు. ఈ చండీ
సప్త సతి గ్రంథములో పదమూడు అధ్యాయాలు ఈ విధముగా వున్నవి
ఒకటో అధ్యాయము ప్రథమ చరితము
రెండు, మూడు, నాలుగవ, అధ్యాయాలు మధ్యమ చరితము
ఐదు నుండి పదమూడు వరకు తొమ్మిది అధ్యాయాలు ఉత్తమ చరితము
శ్రీదేవి,చండీ, విష్ణు మాయ, మహా మాయ, మహేశ్వరి అను నామములు, మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతుల
సమిష్టి రూపములే. శ్రీదేవీ మూడు అవతారము లైన మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతుల రూపము ల కును
పురాణము నందు పార్వతి, లక్ష్మీ, సరస్వతి రూపములకు సంబంధము లేదు. ఇందు శ్రీదేవి సత్వ, రజో, స్తమో
గుణములకు, ప్రతీక. శ్రీదేవీ. మూడు అవతారములు దాల్చి మొత్తము మీద తొమ్మిది మంది రాక్షసులను వధించిన వైనమే
ఈ గ్రంధం లో నీ విషయము. ఈ దేవీ మహత్యము గురించి ఎంత చెప్పుకున్నా యింకా ఎంతో ఉన్నది అనిపిన్తుంది..
రేపు యింకా కొంత తెలుసుకుందాము.శ్రీ మాత్రేనమః.
Comments