దుర్గా సప్తశతి నుండి గ్రహింపబడిన ఏడు శ్లోకములకు దుర్గా సప్త శ్లో కి అను నామము వున్నది.
సప్తశతి లోని ఏడు వందల శ్లోకములు పారాయణ చేయు అవకాశ, సామర్థ్యము లేని వారు ఈ ఏడు శ్లోకములు
ఐనను పారాయణ చేసి దేవి కృపకు పాత్రులు కాగలరు.
దేవీ యొక్క స్థూల, సూక్ష్మ, పరా, రూపములు
దేవిని స్థూల సూక్ష్మ పరా రూపముల లో ఉ పాశించ వచ్చును.
1 .. స్థూల రూపము.. మానవులు వలనే వివిధ అవయములు వుండి వస్త్ర భూషణ, ఆయుధములు దాల్చిన మూర్తి గా దేవిని భావించి ఆరాధించుట.
2సూక్ష్మ రూపము .. ఇది దేవి మంత్ర రూపము, దేవి మంత్రమును జపిస్తూ అరాధించుట.
3... పరా రూపము.. ఇది తాత్విక మైన ది ఇదియే స్వయం జ్యోతీ రాత్మకమగు చిత్ రూపము.. ఈ అఖిల జగత్తు నందు
వ్యాపించి జా జ్ఞాన స్వరూపిణి గా నిలిచి వుండు దేవి నీ ఆరాధించుట.
దేవి నారాధించు సంప్రదాయమున దుర్గా సప్తశతి అత్యుత్తమ గ్రంథము. శ్రీ చండీ , దుర్గా నామములతో శ్రీదేవి
నారాధించుటలో సప్తశతి మంత్రం సుధీర్ఘ మైనది. ఇట్టి మంత్రము ను మాలా మంత్రము అందురు.
4 చండీ నవా వర్ణ మహా మంత్రము.
ఇది సూక్ష్మ రూపములో ఉన్న శ్రీ దుర్గా మహా మంత్రము. అర్ణ మనగా అక్షరము. నవా వర్ణ మంత్రము అనగా తొమ్మిది అక్షరముల తో కూడినది అని అర్ధము.
ఏ మంత్రమైనను గురు ముఖః ముగానే గ్రహించి ఉపాసన చేయ వలెను.
5.. దుర్గా ద్వా త్రి అంశ నామ మాల.
ఈ స్తోత్రము లో 32 దుర్గా దేవి నామములు మహిమా న్విత ములు
సప్తశతి పారాయణ, మంత్ర జపము గురించి ఎంత చెప్పినా ఆ మహిమ గురించి ఇంకా ఎంతో తెలుసు కోవలసినది యింకా ఎంతో ఉన్నది అనిపిస్తుంది . అమ్మ వారి సౌందర్యం, కరుణ అలాంటిది.
రేపు దశ మహా విద్యలు గురించి క్లుప్తంగా తెలుసుకుందాము
శ్రీ మాత్రేనమః
Komentar