దేవీ మహత్యం
- murthydeviv
- 5 days ago
- 1 min read
ఈ దేవీ మహత్యం లో ఉన్న నాలుగు దివ్యమైన స్తోత్రాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం లో బ్రహ్మ దేవుడు చేసిన స్తోత్రము ఉంది. ఈ స్తోత్రము రాత్రి సూక్తము అంటారు.ఈ స్తోత్రము లో అమ్మ వారి తత్వం తెలుస్తుంది. ఇందులో అమ్మ వారి నీ యజ్ఞ స్వరూపం గా చెపుతున్నారు. యజ్ఞ స్వరూపం లో ప్రపంచాన్ని రక్షిస్తుంది. ఓంకార రూపిణీ, గాయత్రీ స్వరూపిణి అయి నీచే ఈ ప్రపంచం అంతా సృష్టించి, లయం చేసే తల్లి వి నీవే అని చెప్పారు ఇందులో చెప్పిన ఈ స్తోత్రము లో వచ్చిన కాల రాత్రీ అంటే ఆశ్వయుజ బహుళ చతుర్దశి అంటే దీపావళి పండుగ ముందు వచ్చే రాత్రి, ఆశ్వయుజ అమావాస్య మహా రాత్రి, మోహ రాత్రీ శ్రావణ బహుళ అష్టమి,, దారుణ రాత్రి అంటే అక్షయ తృతీయ నాడు వచ్చే రాత్రి.ఈ రాత్రులు అమ్మ వారి ఉపాసన కి ముఖ్యమైన రాత్రులు. ఈ రాత్రులు లో ఉపాసన చేయడం వలన మనకు కాలాన్ని, మోహాన్ని, భయాన్ని జయించే శక్తి కలుగుతుంది. ఇంకా అమ్మ వారిని ఇందులో రకరకాల ఆయుధాలు ధరించి సౌమ్య రూపము తో భక్తులు నీ రక్షించేందుకు అనే ప్రార్థన ఉంది. యోగ మాయ నిద్రా రూపంలో విష్ణువు లో ఉన్న అమ్మ వారి ప్రార్థన. ఈ స్తోత్రము మొదట అధ్యాయం లో ఉన్నది ఇందులో నీ రహస్య అంతరార్థం . సత్వ గుణము వలన రజో, తమో గుణాలు నశిస్తాయి మధు మధు ఖైఠభూలు అంటే మనలోని అహంకారం, నేను అంటే ఉన్న ప్రీతి అంటే మధువు లాంటింది ఆ అహంకారం నీ నశింప చేసే జ్ఞానం కలగటమే ఈ కథ లోని అర్థం. నేను అర్థం చేసుకున్న వరకూ మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన అమ్మ వారికి నమస్కృతులు
శాంకరీ అని సన్ను తించు s సరుగున రమ్మ శరణు ఆంటీని ఓ అమ్మా సత్వరం మిమ్మ
నీ దరిశన మిమ్మా
Comments