top of page
Search

జనరల్ మ్యాథ్స్

  • murthydeviv
  • 3 days ago
  • 3 min read

మొన్న ఎపుడో 10th అయ్యాక ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అని మా మనవరాళ్లు డిస్కస్ చే స్తూ నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ ఇష్టమే కానీ కెమిస్ట్రీ మాత్రం ఇష్టం లేదు అన్నది. ఫిజిక్స్ కన్నా కెమిస్ట్రీ ఈజీ నే అన్నాను నేను. నీకు తెలుసా అని ఒక ప్రశ్న వస్తుంది. పాపం నేను ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా వాళ్ళు నేను గ్రాడ్యుయేట్ నీ అని మర్చిపోతారు. ఎపుడూ తెలుగు చదవండి అని చెప్తూ వుంటాను, అందుకు తెలుగు పరీక్ష రోజు మాత్రమే నాకు కనిపిస్తారు. నీవు ఎందుకు మ్యాథ్స్ ఫిజిక్స్ చదవలేదు అని యింకో ప్రశ్న అడిగారు. నేను జనరల్ మ్యాథ్స్ తీసుకున్నాను అందుకని అంటే జనరల్ మ్యాథ్స్ అంటే ఏమిటి అన్నారు.మరి ఈ రోజుల్లో ఆ సబ్జెక్ట్ ను ఏమంటారో తెలియదు. ఆర్థమేటిక్స్ అని చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆరోజుల్లో కంపోజిట్ మా స్కూల్లో వుందో లేదో గుర్తు లేదు గానీ మేమూ అందరము ఆ లెక్కలు తో కుస్తీ పడుతూ వుండేవాళ్ళం. మా అన్నయ్య లు ఇద్దరూ కంపోజిట్ మ్యాథ్స్, నేను ఒక్కదాన్నే జనరల్. ఆ రోజుల్లో ఖాంధాని ట్యూషన్ మాస్టర్లు ఉండే వారు అంటే ఇంట్లో వున్న పిల్లలందరికీ ట్యూషన్ చెప్పటం.. మా అన్నయ్య లు అయితే స్కూల్ టీచర్స్ దగ్గరే ట్యూషన్ కు వెళ్లే వారు. మేము మాత్రం ఇంట్లో నే ఆ మాస్టర్ గారి నీ అవస్త పెట్టే వాళ్ళం. ఎందుకంటే, ఇంట్లో ఆఖరి చిట్టితల్లి లేక చిట్టితండ్రి అల్లరి చేస్తుంటే తల్లులు ఆ ట్యూషన్ దగ్గర కూర్చో పెట్టే వాళ్లు. వాడు ఏ పప్పు ఉండ తింటూ మిగతా వాళ్ళని డిస్టబ్ చేస్తూ ఉండే వాళ్లు మేము కాక మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు కూడా ఉండేవారు.ఒక చిన్న వీధి బడి లాగానే వుండేది. ఆ రోజుల్లో ఎక్కడా వుద్యోగం దొరక్క పోతే ఇలా ట్యూషన్ లు చెప్తూ వుండేవారు.ఒక మాస్టర్ మాత్రము నాకు గుర్తు వున్నంత వరకూ ఒకే ఒక నెల పనిచేసి పారిపోయాడు. ఈ మాస్టారు గారు మాత్రం స్కూల్లో టీచరు గా వర్క్ చేస్తున్నా ఆయనకి మెయిన్ ఇంట్రెస్ట్ మంచి డ్రామాల్లో యాక్ట్ చేయటం మంచి కావ్యాలు వచనము లో రాయడం చేసే వారు. నాకు స్కూల్ ఫైనల్లో ఆ కాలం పని లెక్కలు చూస్తే మహా విసుగ్గా వుండేది. తొట్టి లో నీళ్లు ఎంతసేపు లో నిండుతాయి, ఒక రైలు, కారు ఎంత సేపులో దాటుతాయి వీటి వల్ల ఏమిటి ఉపయోగము అనుకునే దాన్ని. ఒక్కొక్క రోజు సగం లెక్క చేసి చాలు అనుకునే దాన్ని. ఇంక ఆదివారం వస్తె మా నాన్న గారు అందర్నీ కూర్చోపెట్టి నోటి లెక్కలు ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడం మొదలు పెట్టే వారు. ఆ రోజు మా అన్నయ్యలు ఉదయాన్నే బుద్ధి గా ట్యూషన్ కి వెళ్ళినా వెనక్కి పిలిపించే వారు ఇంక మా అత్తయ్య గారి పిల్లలు అయితే ఆదివారం మా ఇంటికి రావాలంటే హడల్. మామయ్య చదువు చెప్తారు అని. మా మాస్టారు గారి తో నేను కూడా కంపోజిట్ తీసుకుంటే బాగుండు ఎదో ఎక్స్ వై అంటూ గాలీ లో లెక్కలు చేయవచ్చు అనే దాన్ని. మొత్తానికి స్కూల్ ఫైనల్ ఫస్ట్ మార్కులు తో పాస్ అయి కాలేజ్ లో చే రాను మా అమ్మాయిలు చిన్నతనంలో జాయింట్ ఫ్యామిలీ లో నాకు తీరదు అని ట్యూషన్ పెట్టాను. పెద్దాయన చక్కగా రాగానే వాళ్ళ చేత ఒక సరస్వతి దేవి మీద, దక్షిణా మూర్తి మీద ఒక పద్యంచెప్పించే వారు. నాకు గుర్తు వున్నంత వరకూ ఒక నెల లేక రెండు నెలలు చేసి మీ అమ్మాయిలు తెలివి గల వాళ్ళు వాళ్లకు ట్యూషన్ అక్కర్లేదు అని చెప్పి మానుకున్నారు. మీరేమీ చేశారు అని ఇపుడు అడిగినా మా అమ్మాయి లు చిరునవ్వే సమాధానం. మా అబ్బాయి ప్రైమరీ స్కూల్ లో ఉండగా ఎవరన్నా కుర్రవాళ్ళు ఫ్యాక్టరీ కి ఉద్యోగం కోసం వచ్చారు అంటే ఉద్యోగం లేదు అని చెప్పలేక మా అబ్బాయి కి ట్యూషన్ చెప్పండి అనేవారు. పాపం వాళ్ళు ఒక నెల చెప్పి పారిపోయే వాళ్ళు. మా మనవరాలి కి కూడా కోడలు పెట్టిన టీచర్ అలాగే పారిపోయింది. జనరల్ మ్యాథ్స్ లో చెప్పినట్లు ఒక ప్రయాణం అయితే చేశాము మేము ఏదో పని మీద బళ్ళారి, హంపి చూసీ, నైట్ ట్రైన్ అందుకోవాలని మర్నాడు గుంటూరులో ఏదో పెళ్ళి కి వెళ్ళాలని ప్లాన్. మేము స్టేషన్ లోకి వస్తూ వుండగానే ట్రెయిన్ మా కళ్ళ ముందే వెళ్లి పోయింది. ఆ taxi డ్రైవర్ ట్రైన్ తో పాటు పరుగెత్తించి మమ్మల్ని యింకో రెండు స్టేషన్ ల తర్వాత ఎక్కించాడు. మా సీట్లు అయితే ఉన్నాయి కానీ డిన్నర్ వాడు మాత్రం ఇవ్వకుండా వెళ్ళి పోయాడు. పిల్లలు బిస్కెట్ లు తిని ఊరుకున్నారు. వాళ్ళ నాన్నగారి తో ఇలాంటి అడ్వెంచర్ అలవాటు so ఎంజాయ్ చేశారు. తరుచుగా పనివాళ్ళు మోటార్ వేసినప్పుడు నీళ్లు ఓవర్ ఫ్లో అవటం మామూలే. ఒక్కొక్క రోజు ఉదయాన్నే ఆ నీళ్ల శబ్దము కు మెళుకువ వచ్చి చికాకు తో రీసన్ అడిగితే, పైన రెండు ట్యాంక్ లు ఉన్నాయి. ఒకటి పెద్దది రెండోది చిన్నది పెద్ద ట్యాంక్ నిండితే చిన్న ట్యాంకులో పడతాయి చిన్న ట్యాంకు కాలి కాకపోతే నీళ్ళు ఓవర్ ఫ్లో అవుతాయి. ఎండా కాలం నీళ్ళు వేస్ట్ అయినాయనే బాధ కన్నా ఆహా ఇన్నాళ్టికి జనరల్ మ్యాథ్స్ తో ఉపయోగము తెలిసింది కదా అని ఆనందించాను. వెన్నెల రాత్రుల్లో అయినా పైకి వెళ్ళి ఆ ట్యాంకు లు చూద్దాం అంటే ఈ వయసు సహకరించదు కదా.సో కాలేజ్ లెక్కలు తో ఇంకొకసారి.

 
 
 

Recent Posts

See All
గీతా జ్ఞానం

ఈ టైటిల్ చూసి నేను భగవద్గీత గురించి చెప్తాను అనుకోవద్దు. ఆ గ్రంథం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అనుకుంటాను.మా అత్తగారు మార్గశిర మాసము...

 
 
 
గ్రాం ఫోన్ తో కొన్ని విశేషాలు

నిన్న యు ట్యూబ్ లో ఏవో సెర్చ్ చేస్తుంటే బాలి వుడ్ కా గోల్డెన్ ఎరా అంటూ రాజేశ్ ఠాకూర్ ప్రోగ్రామ్ ఎదో కనిపించింది. ఓల్డ్ ఈ జ్ గోల్డ్...

 
 
 
ఇంగ్లీష్ వింగ్లీష్

ఈ రోజు సాయంకాలం మా మనవరాళ్లు ఇద్దరినీ తో షాపింగు బయలు దేరాను. బంధువుల ఇంట్లో మే లో పెళ్ళి వుంటే ఎదో సరదాగా వాళ్ళకి లంగా ఓణి లు వేసి పాత...

 
 
 

3 Comments


Ramakrishnarao Lakkaraju
Ramakrishnarao Lakkaraju
3 days ago

"జనరల్ మాథ్స్ " ఆ లేక "కాంపోజిట్ " . ఆ ప్రశ్నకి మా నాన్న నా ఫిఫ్త్ ఫారం లో  "కాంపోజిట్ " తీసుకోమన్నారు . "ఆల్జీబ్రా " "గుండెగాబరా " అనే రోజుల్లో నేను "కాంపోజిట్ " తీసుకున్నాను . అది జీవితం మార్చేస్తుందని నాకు అప్పుడు తెలియదు . అనుకోకుండా జీవితం మార్చే రెండోది "పెళ్లి " . ఈ రెండిట్లో మన ప్రమేయం తక్కువున్నా జీవితాంతం అనుభవించాలి .

బై ది బై ఆ తొట్టి ఎప్పుడు నిండుతుంది అనే ప్రశ్నకి , ఒక నిమిషంలో ఏమవుతుందో తెలుసుకుంటే తొట్టె ఎన్ని నిమిషాల్లో నిండుతుందో తెలిసిపోతుంది . అదీ మా నాన్న చెప్పిందే . అది కూడా జీవితంలో తగిలే చాలా ప్రశ్నలకి సమాధానం . థాంక్స్ ఫర్ ది పోస్ట్ .

Like
murthydeviv
2 days ago
Replying to

ఏ నిమిషం నికి ఏమి జరుగునో ఎవరు ఊహించ ద రు

Like

Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page