top of page
Search

గాజుల మలారం

murthydeviv
Nov 15
3 min read

శ్రావణ మాసంలో రెండు మూడు పెళ్ళిళ్ళకు వెళ్ళా ను.

ఒకరి ఇంట్లో పెళ్ళికూతురు చేసే రోజున వెళ్ళాను.

వాళ్ళ ముందు గది మధ్య హల్లో వున్న షో కేసులు అన్ని గాజుల తో అలంకరించారు పెళ్లి కూతురు తల్లి బాగా తెలిసిన ఆవిడే .

ఊరుకోలేక అడిగాను . ఏమిటీ ఇలా అలంకరించారు అని.

ఆ అలంకరణ అంత ఈవెంట్ మేనేజర్ ఐడియా అని చెప్పింది మనకు కావాల్సిన గాజులు సెలెక్ట్ చేసుకుని అక్కడే ఉన్న అమ్మాయితో వేయించుకోవచ్చుట .. వచ్చిన వాళ్ళు అందరూ రక రకాల గాజులు తీసుకుని కొన్ని వేయించుకుని కొన్ని పాక్ చేయించుకుని తీసుకుంటున్నారు.

వాళ్ళ చీరలు కీ మ్యాచ్ అయ్యే గాజులు వేసుకుని వచ్చి వుంటారు కదా అందుకని మిగతా చీర లకు మ్యాచ్ అయ్యేవి తీసుకుంటున్నారేమో ఆనుకున్నాను., అదేదో సామెత చెప్పినట్లు.నాకూ వూరికే చూస్తూ కూర్చో బుద్ది కాదు కదా, ఆ ఈవెంట్ మేనేజర్ చాలా హడావిడి గా అటూ ఇటు తిరుగుతూ ఉంటే పలకరించాను. ఈ గాజులు షాపు మీకు తెల్సిన వాళ్ళా అని.


ఆ అమ్మాయి నేను కూడా ఏదయినా ఫంక్షన్స్ కోసం అడుగుతున్నానేమో ఆనుకుని మా ఈవెంట్స్ అన్నింటికి వస్తారు అండీ, సీమంతం, వోణిల ఫంక్షన్స్, ఇలా పెళ్లిళ్లు అన్నిటికీ నేను వీళ్ల నే ఆరేంజ్ చేస్తాను అన్నది.

మీ ప్యాకేజీ లోనే భాగంగా బాగుంది ఈ ఆరెంజ్ మెంట్ అన్నాను.


వెంటనే ఆ అమ్మాయి ఆబ్బే వీళ్లకు సెపెరేట్ గా మీరే ఇవ్వాలి, వాళ్ళు ఎన్ని గాజులు వేస్తే అన్నిటికీ ఛార్జ్ చేస్తారు అన్నది.

అంటూ ఇదేదో పనికి వచ్చే బేరం కాదులే ఆనుకుని హడావిడి గా వెళ్ళింది.


నాకూ ఏమీ పని లేదుకదా చూస్తూ వున్నాను. పసుపు దంచే రోలు రోకలి ఎలా పెట్టాలి దంచే వాళ్ళు ఎలా కూర్చోవాలి

కెమెరా వీడియో వాడు ఆ అమ్మాయి ఆందరికీ ఇంస్ట్రుక్షన్స్ ఇస్తూనే వున్నారు..

అసలు పద్దతి కన్నా ఈ హడావిడి ఎక్కువగా వున్నది.

నాకూ వెంటనే ఒక పది ఏళ్ల క్రితం వరకు జరిగిన పెళ్లిళ్లు గుర్తు కీ వచ్చాయి. మన చిన్న తనము లో అయితే ఇంటి ముందుకి గాజులు మలారం అనేవాళ్ళు. వారానికి పది రోజుల కు వచ్చే వాళ్ళు. ఇంట్లో వున్న అందరము గాజులు వేయించుకునే వాళ్లము. గాజులు తొడిగించుకుని ఆ గాజుల బొత్తులకు నమస్కారం చేసి కళ్లకు అద్దుకుని లేచే వాళ్ళము.

రక రకాలుగా గాజులు అన్నీ ఒక గుండ్రటి కర్ర కీ పేర్చే వాళ్ళు.

ఆ రోజుల్లో ఏ సినిమా వస్తే ఆసినిమా పేరు గాజుల కు పెట్టే వారు. వదిన గారి గాజులు అనే సినిమా కూడా వచ్చిందిట.

నేను చూడలేదు అనుకోండి. వెలుగు నీడలు, మంచిమ నసులు, ఇల్లరికం ఈ పేర్లతో గాజులు వచ్చేవి. ఇంక

దసరా బుల్లోడు సినిమా వచ్చాక ఆరంజ్ కలర్ గోల్డ్ స్పాట్ కలర్ అనేవాళ్ళు ఆ రంగు గాజులు, చీరెలు

మార్కెట్ అంతా ధూమ్ ధామ్ గా ఎలాయి. ఎక్కడ చూసినా అదే కలర్.

ఆ సినిమాల పేర్లు అన్నీ చెప్తూ గాజులు అన్నీ చాప వేస్తే దాని మీద పే రుస్తూ చెప్పే వాడు.

పెళ్లి కూతురుని చేసే రోజు కూడా వాళ్లే వచ్చి గాజులు అందరికీ వేసే వారు. తర్వాత వేడుక గా పెళ్లి కూతురు చేత

తాం బూలం , పండ్లు గాజులు ఇప్పించే వారు.

ఈ హైదరాబాద్ వచ్చాక మొదట్లో లాడ్ బజార్ వెళ్తే కళ్ళు చెదిరి పోయే గాజులు. రాళ్ళగాజులు ఎన్ని రకాలుగా చాలా

అందంగా ఆర్టిస్టిక్ గా ఉండేవి.

మొదట్లో అక్కడికే వెళ్ళి రక రకాల గాజులు తెచ్చే వాళ్లము.


తర్వాత ఇంకో డ్రైవర్ ఘోషా మహల్ ఏదో నాకూ అంతగా గుర్తు లేదు కా ని అలాగే అన్నీ గాజులు షాపు లు వున్న

మార్కెట్ కీ తీసుకుని వెళ్ళాడు. అక్కడ కూడా ఏన్నో రకాల గాజులు అందం గా పేర్చిన షాపులు కన్నుల పండగ గా అనిపించింది.

పెళ్లి కూతుర్ని చేసిన రోజు పెళ్లి కూతురు కీ కూడా పదకొండు , పన్నెండు అనే లెక్కతో గాజులు వేయించేవారు.

పదహారు రోజుల పండగ అయిపోయిందాకా గాజులు తీయానిచ్చే వారు కాదు


మా మనవరాళ్లకు కూడా రక రకాల గాజులు కొని వేసేదాన్ని ఇప్పుడు స్కూల్స్ లో గాజులు వేసుకోనివ్వరు కదా.

ఫంక్షన్స్, గాని పండగ గాని అయిన మర్నాడు గాజులు తీసి నా గదిలో టేబుల్ మీద వుంటాయి.


కొని ఇచ్చింది నేను కాబట్టి దాచే పని కూడా నాదే అన మాట .

ఆలా అక్కడ పెట్టిన గాజులు చూడగానే నా మనసు లో ఇన్నీ జ్ఞాపకాలు పరుగులు తీసాయి.


ఈ లోకం లోకి వచ్చేట ప్ప టికీ పెళ్లి కూతురు చీర కట్టుకుని వచ్చింది. ఇప్పుడు ఎల్లో చీర కీ మ్యాచ్ అయ్యే గాజులు వేసుకుంటే పెళ్లి అప్పుడు రెడ్ చీర కీ మ్యాచ్ అవ్వవు కదా ఎలా అనే ఆలోచన నడుస్తున్నది .

గాజులు మార్చకూడదు అని నాలాంటి చాద స్త పు అమ్మమ్మ, బామ్మో చెప్పిందేమో పాపం అనుకున్నా.

ఎల్లో కలర్ , రెడ్ కలర్ గాజులు కలిపి అందంగా వేస్తాను అని ఏదో సొల్యూషన్ చెప్తోంది ఆ గాజుల షాపు అమ్మాయి


పెళ్లి కూతురు ఫంక్షన్ కీ ముహూర్తం ఆంటే తలకి నెయ్యి పెట్టీ హారతి ఇవ్వటమే , ఆ టైమ్ కీ రాలేదే పిన్ని గారూ అని ఇందాకే నా ఫ్రెండ్ కూతురు అడిగింది కదా ఇంక వీళ్లు ఎంత అయినా ఆలస్యం చేసుకోవచ్చు ఆనుకుని, ఇంకో కాఫీ తాగి ఈ ఫోటో, వీడియో సెషన్ లు చూద్దాము అనుకున్నా.


మా కోడలు ఏవో సింపుల్ గా నాలుగు గాజులు వేయించుకున్నది, మనవరాళ్లు మా కు నీవు వేశావు కదా చాలు అన్నారు


ఈ గాజుల షాపు ఖర్చు వేరే అని పాపము నా ఫ్రెండ్ కూతురుకి తెలుసో తెలియదో అనే అనుమానం వచ్చింది కానీ

ఇప్పుడు వాళ్ళ మూడ్ పాడు చేయటం ఎందుకూ అని ఊరుకున్నాను.

ఇలాంటివే పెద్దవాళ్ళం అయ్యాక వచ్చే సమస్యలు

ఎక్కడికీ వెళ్ళినా నేత్రా ఆనందం గా చూస్తూ వుండాలిట

ఎలాంటి ప్రశ్నలు వేయకుండా మా అమ్మాయి చెప్తుంది.


ఏమిటో నేను మా అమ్మ గారు ఆ అత్తగారు డోలు. మద్దెల లాగా

చెరో పక్కన ప్రశ్నలు అడుగుతూ ఉంటే సమాధానం

చెప్తూ ఉండేదాన్ని


ఈ నేత్ర ఆనందం గురించి అప్పుడు నాకు తెలియదు

సరే ఈ గాజు ల వరుసలు నేత్రా ఆనందంగా చూద్దాము అనుకున్నా.


చెప్పటం మరచి పోయాను 1959 లో నొ ఎప్పుడో హైదరాబాద్ స్కూల్ ఎక్సర్షన్ కి వచ్చాము.

అప్పుడు మమ్మల్ని ఒక గాజులు ,లాంతరు బల్బులు చేసే ఫ్యాక్టరీ కి తీసుకుని వెళ్ళారు.

ఈ హైదరాబాద్ వచ్చాక చాలామందిని అడిగాను అలాంటి ఫ్యాక్టరీ ఉన్నదా అని కానీ ఎవరూ చెప్పలేక పోయారు

కానీ అది ఒక జ్ఞాపకం లాగా నిలిచి పోయింది..


ఇవీ ఈ రోజు క బు ర్లు శుభ రాత్రి












 
 
 

Recent Posts

See All
వన భోజనం

కార్తీక మాసం అనగానే కొంత నొస్టాలజియా వుంటుంది , ఎవరి కయినా , అందరూ వాళ్ళ చిన్నప్పటి రోజులు తల్చుకుంటూ వుంటారు. నాకు అయితే దీపావళి వెళ్ళి కార్తీక మాసం వచ్చినప్పటి నుండీ మా పుట్టింట్ల

 
 
 
నాగుల చవితి

బినాగుల చవితి ఏమిటి? నాగుల షష్ఠి అనవచ్చు కదా !చవితి ఏమిటి? భూమి లోపల నివసించే నాగదేవతలను (సర్పాలను) ఆరాధించే పండుగ నాగుల చవితి. కార్తిక మాస శుక్ల పక్ష చవితి నాడు (కొన్ని ప్రాంతాలలో శ్రావణ శుక్ల చవి

 
 
 
ప్రయాణం

దీపావళి తర్వాత వరుస పండగలు మన భక్తి ఈ మధ్య పండగ హడావిడి, భాయ్ దూజ్ అని ఇద్దరు అమ్మాయిలు కలిసి తమ్ముడి కీ మర్యాద లు వారం రోజులు నుండి హడావిడి గా గడిచి పోయింది. మధ్యలో మా అబ్బాయి పిల్లలు మేజర్లు అయి

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page