గూగుల్ లాంటి వరల్డ్ వైడ్ కంపనీ తో మనకు ఏమీ తమాషాలు వుంటాయి ,అని మీరు అనుకుంటారు. కానీ నాకు మాత్రం చాలాసార్లు అమ్మో గూగుల్, ఆన్ లైన్ లో కొనటం కొంచెం వింతగా విసుగ్గా వుంటుంది. సరదా గా కొన్ని విశేషాలు తో నవ్వుకుందాం. మా ఇంట్లో పని మనిషి మానేస్తే కొత్తగా మనిషి కోసం డ్రైవర్ నో తోటమాలి నో అడిగితే, మనింటి దగ్గర లో కొత్త ఆఫీసులు చాలా వచ్చాయి అక్కడ ఎక్కువ పని ఉండదు అని చెప్తూ దగ్గర లో గూగుల్ ఆఫీసు వచ్చింది అందులో చాలా మంది చేరుతున్నారు అన్నాడు తోటమాలి.. సరే ఎవరయినా దొరికితే చెప్పు అన్నాను ఆ మర్నాడు కార్లో ఎక్కడికో వెళ్తూ డ్రైవర్ పెట్టిన రేడియో మిర్చి లో వచ్చే కర్ణ కఠోరంగా వినిపించే మాటలు, పాటలు వినలేక ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టించాను ఆ పాట అయితే వాడికి మనకూ అర్ధం కాదు కాబట్టి, మ్యూజిక్ లేకుండా వాళ్ళు డ్రైవ్ చేయలేము అంటారు. మీ అమ్మ ను అడుగు ఎవరన్నా పని మనిషి దొరుకుతుందా అని డ్రైవర్ నీ అడిగాను. మా అమ్మ గూగుల్ లో హౌస్ కీపింగ్ లో చేస్తుంది అన్నాడు. ఆహా గూగుల్ గారు ఎంత చక్కగా ఇంగ్లీష్ పేరు పెట్టాడు అనుకున్నాను. ఏదో కొత్త ఏరియా లో తెల్సిన వాళ్ళను చూద్దామని బయలు దేరాను ఆవిడ ఏవో గుర్తులు చెప్పింది. డ్రైవర్ మాత్రమ్ గూగుల్ మ్యాప్ పెట్టమనండి అని గొడవ. ఆవిడ కు ఫోన్ చేసీ అడిగితే అయ్యో నాకు రాదండి మా అబ్బాయిని పెట్టమంటాను అన్నది. వాళ్ళ అబ్బాయికి నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఎట్లాగో మ్యాప్ వచ్చింది. ఆ మ్యాప్ ప్రకారం ఎన్నో రైట్లు లెఫ్టులు తిరిగాము కానీ ఆ అపార్టమెంట్ కనిపించలేదు. పాపము అమెరికా లో వున్న ఆ గూగుల్ వాడికి మన భాగ్యనగరం మజా. ఇంక ఇలా కాదని కారు ఆపి అక్కడ వాళ్లని అడిగాను. అతను నవ్వుతూ చాలా ముందుకు వచ్చారు ఆ వీదిలో ఆ అపర్టుమెంట్ కొంచెం మూలకు వుంటుంది రెండు రోడ్లకు కాకుండా అన్నాడు. పాపము గూగుల్ గారికి ఆ అపార్టుమెంట్ ను ఏ రోడ్డు లో వెయ్యాలో అర్థం కాలేదు. ఒక రెండు మూడు రోజుల తర్వాత మా అబ్బాయి పుట్టిన రోజు అని మైసూర్ పాక్ చేయమన్నాను. వంటావిడ నెయ్యి లేదు అండి అన్నది. అయ్యో అప్పటికే డ్రైవర్ ఆఫీసు కు వెళ్ళాడు ఎలా అనుకున్నాను. ఇంతలో గుర్తు వచ్చింది ఆ షాపు వాడు రాపిడో లో పంపుతాడు అని. సరే ఫోన్ చేసి నెయ్యి ఎంత కావాలో చెప్పాను. డబ్బు ఫోన్ పేలో పంపమన్నాడు.అది అయ్యాక గూగుల్ మ్యాప్ పంపాను.పని లో పని అమీర్ పేట్ లో కాఫీ పొడి కూడా తెప్పిస్తే అని ఆ షాపు కు ఫోన్ చేస్తే వాడు గూగుల్ పే కావాలి నాకు ఫోన్ పే లేదు అన్నాడు. మరల గూగుల్ రాజా గారి నీ గౌరవించి ఇంక పూజ చేసుకుందాము అని పూజ కి వెళ్లిన ఒక పదిహేను నిమిషాల కు తెలియని నెంబర్ ఫోన్ రెండు సార్లు మోగింది తెలియని ఫోన్ ఎత్తద్దు అని మోడీ గారు కూడా చెప్తున్నారు కదా అని నేను ఎత్తలేదు మరల నెయ్యి షాపు వాడు ఫోన్ మీకు రాపి డో వాడు ఫోన్ చేస్తున్నాడు ఆన్సర్ చేయండి అని. సరే ఈ సారి నేనే ఫోన్ చేశాను వాడు నేను టాటా మోటార్స్ దగ్గర వున్నాను మీ యింటికి ఎలా రావాలి. ఆ టాటా మోటార్స్ ఎక్కడ వుందో నాకు తెలియదు అంటే మీరు పంపిన గూగుల్ మ్యాప్ ఇక్కడే చూపిన్తుంది అంటాడు నేను మా ఇంటికి ఎలా రావాలో ఎన్ని గుర్తులు చెప్పినా అతను టైమ్ అయిపోయిందని నెయ్యి షాపులోనే కాఫీ పొడి కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఈ లోపల కాఫీ వాడు ఫోన్ గూగుల్ లో వాడి డబ్బులు రాలేదని. సరే ఇంక మూడ్ ఖరాబు పూజ కూడా నెయ్యి, కాఫీ పొడి తలచుకుంటూ పూర్తి చేసాను. నెయ్యి లేకపోయినా పర్వాలేదు కానీ డికాషన్ లేకపోతే కాఫీ ఎలా. కోడలుకు చెప్తే వీధి చివర రత్నదీప్ నుండి డికాషన్ పాకెట్ స్విగ్గిలో వే చేస్తుంది కానీ నాకు ఫిల్టర్ కాఫీ లేకపోతే కాఫీ తాగినట్టే వుండదు.ఈ లోపల వాళ్ళ ఫోన్లు భరించలేక, మా డ్రైవరు వస్తె పంపుతాను. బాబూ అని చెప్పి ఆ రోజు కు మనశ్శాంతి తెచ్చుకున్నాను. ఇంతలో మనవరాలు స్కూల్ నుంచి వచ్చింది. మా పిల్లలు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే మనం చేసిన టిఫిన్ తినే వాళ్ళు. వీళ్లు అలా కాదు అడిగి చేస్తే బెటర్ కదా,ఏం కావాలి అన్నాను. నిన్న దోశ తిన్నా కదా ఇవాళ అమ్మ ను పిజ్జా ఆర్డర్ చేస్తుంది అని ముందు కా ళ్ళకి బంధం వేసింది. ఆ పిజ్జా వాడికి మా ఇల్లు అడ్రస్ బాగానే తెలుసు. పాపం ఒక పావు గంటలో తెచ్చాడు. ఇంకో అరగంటలో నా మనవరాలు వచ్చి నిన్న వచ్చిన పాకెట్ కవర్ వుందా అమ్మమ్మా అని అడిగింది. ఏది కనిపించక పోయినా పాపము నా మీద నమ్మకం తో అడుగుతుంది. ఎందుకూ అన్నాను, ఆ వచ్చిన వస్తువు నచ్చక పోతే ఆ కవర్ లోనే పెడితే వాడు తీసుకుంటాడుట మర్నాటి నుంచి పని వాళ్లకు ఆ కవర్లు అన్నీ ఒకే చోట పెట్టమని చెప్పాను. ఒక రోజు ఉదయాన్నే పెద్ద అమ్మాయి గారు పంపారు ఆంటూ పెద్ద పాకెట్ బంగళా దుంపలు తెచ్చి ఇచ్చాడు వాచ్ మన్,నేను అడగలేదే అని కన్ ఫ్యూజ్ అయ్యాను. ఒక అరగంట తర్వాత ఆమ్మాయి ఫోన్ ఆపుడు ఆపుడు అరిటాకు లు ఆర్డర్ చేస్తా కదా మీ ఇంటికి అలా వాడు కన్ ఫ్యూజ్ అయ్యాడు అంది. అవునులే ఆ గూగుల్ వాడు మాత్రం ఎన్ని గుర్తు పెట్టుకుంటాడు అనుకున్నాను. ఈ గూగుల్ గుఱించి నాకు అసలు ప్రాబ్లెమ్ ప్రయాణాలు చేసేటప్పుడు వస్తుంది. కార్ ఎక్కితే చాలు ఎన్ని అనుభవాలు. మా ఇంటి నుంచి కర్మన్ ఘాట్ గుడి రోడ్డు రైట్ రాయల్ గా మెయిన్ రోడ్డు మీదుగా వెళ్ళవచ్చు. కానీ ఆ గూగుల్ మ్యాప్ సరూర్ నగర్ చిన్న చిన్న రోడ్లు చూపిస్తుంది. మేము ఎపుడూ కొల్హా పూర్ లో కార్ లో వెళ్తాము ఆ వూరికి ఇదివరకు ఫ్లయిట్ లేదు. షోలాపూర్ వరకూ బాగానే తీసుకుని వెళ్తుంది. అక్కడి నుండి ఎన్నో పల్లెటూరులు చూపించి తిప్పుతూ ఉంటుంది. నాకు విసుగు వచ్చీ కార్ ఆపి. ఎవర్ని నన్నా అడగండి అన్నా పాపము మా వాళ్ళ కీ నచ్చదు అలాగే ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ వుంటారు. ఒకసారి ఆ వూరు నుండి వచ్చే టపుడు బీజా పూర్ వైపు వెళితే దగ్గర అని అటు తిరిగాము. ఎన్నో చెరుకు తోటలు మధ్యలో వెళుతున్నాము కానీ ఏ వూరు కనిపించదు. మహా రాష్ట్ర పల్లెటూరు అన్నీ చూసుకొంటూ ఒక మూడు గంటల తర్వాత మెయిన్ రోడ్డు కి వచ్చాము. నాకు పాపం ఆ గూగుల్ వాడికి కూడా ఇన్నీ రకాల రోడ్స్ చూసీ కన్ఫ్యూజన్ వస్తుందే మో అని అనుమానం ఇవీ గూగుల్ తమాషాలు ఇంకా వున్నాయి కానీ చదివితే మీకూ కన్ఫ్యూషన్ వస్తుందేమో అని డౌట్ 😀😀😃😄
గూగుల్ తమాషాలు
murthydeviv
Comments