కార్తీక వన భోజనం
- murthydeviv
- Nov 10, 2024
- 1 min read
చిదంబరం క్షేత్రము గురించి జగద్గురు బోధలు అని కంచి స్వామి వారి పుస్తకాలలో చాల బాగా రాసారు అరుణాచలం చిదంబరం రెండు చూడాలని చూడాలని చాల ఆర్తి తో అనుకోని చూసాను అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయినా అక్కడ చాల మంచి అనుభవం అయింది. చిన్న తనంలో భక్తి అనేది తెలియదు అవి నాన్న గారు పూజలు చేసినపుడు వాటి విలువ తెలియాదు. మా తాత గారు కార్తీక మాసం లో వాన భోజనాలు నిర్వహించే వారుట. ఐదు, ఆరు ఊర్ల వాళ్ళు వచ్చి భోజనం చేశా వార్లు ట. మా చెల్లెలు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఆ పెళ్లి వారి తరపున వచ్చిన ఒక బంధువు ఆ వన భోజనాలు గురించి అపుడు మా అత్తయ్యలు పాడిన పాటలు గురించి, బండ్లు కట్టుకొని వచ్చిన జనం గురించి ఎంతగా చెప్పిందంటే ఆ సంభందం మా చెల్లెలుకి సంభందం వెంటనే కుదిరిపొయింది. నాకు మాత్రం ఆ సంఘటన గుర్తు వచ్చినపుడు చాలా ఆనందంగా,గర్వంగా అనిపిస్తుంది. తాతయ్య తన వంశం లో ని వారంతా సుఖ సంతోషాలతో బ్రతకాలని ఎన్ని పుణ్య కార్యాలను చేసారో అని ఆలోచిస్తే అయన ఎంత మేధావి అనిపిస్తుంది. మా మామగారు కూడా తన ముత్తాత గారు ధాత నామసంవత్సరము లో కరువు వచ్చినపుడు ఊర్లో వాళ్ళ కి వడ్లు పంచేవారుట మా అత్త గారు చాల నిష్ఠగా పూజలు చేసేవారు ఆవిడా నా చేత చాల నోములు పట్టించారు, మా కోడలు వాటిగురించి రాయండి అని అడిగింది. అందుకే ఈ ప్రయత్నం. పెళ్లి అవగానే అందరి లాగానే శ్రావణ మంగళ వారం నోములు అమ్మ మొదలు పెట్టించింది. తరువాత అట్లతద్ది ఉండ్రాళ్ళతద్ది నోము నోయించింది తరువాత నేను ఆ నోములు చేయగలిగాను, మా తాతా గారు గురించి, న నోములు గురించి ఇంకో సరి.
"మా చెల్లెలు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఆ పెళ్లి వారి తరపున వచ్చిన ఒక బంధువు ఆ వన భోజనాలు గురించి అపుడు మా అత్తయ్యలు పాడిన పాటలు గురించి, బండ్లు కట్టుకొని వచ్చిన జనం గురించి ఎంతగా చెప్పిందంటే ఆ సంభందం మా చెల్లెలుకి సంభందం వెంటనే కుదిరిపొయింది."
మంచి చేస్తే ఎప్పుడో అప్పుడు ఫలితం వస్తుంది . అందులో ఆకలి తీర్చటం మహా పుణ్యం .--- భార్గవి