నిన్నే నే అమ్మమ్మ గారి ఊరి గురించి రాశాను కదా. ఈ రోజు ఏం రాస్తములే అనుకున్నాను ఫేస్ బుక్ లో ఇంకా మా ఫ్రెండ్స్ కుంభ మేళ గుఱించి రాస్తూ వుంటే, నాకు మా గోదావరి పుష్కరాల సందర్భంగా ఎదురయిన అనుభవాలు అలా మనసులో మెదుల్తు వుంటే మీతో పంచుకోవాలనే ఈ పోస్టు కుంభ మేళ కు మా అమ్మాయి తన ఆమెరికా నుంచి వచ్చిన ఫ్రెండ్స్ తో వెళ్ళింది. నన్ను కూడా రమ్మన్నారు కానీ ఈ శరీరము సహకరించాలి కదా అందుకని దైర్యం చేయలేక పోయాను. మేము 2003 లో కాళేశ్వరం గోదావరీ పుష్కరాలకు వెళ్ళాము. జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తాము కానీ కొన్ని అలా గుర్తు వుండి పోతాయి. మా ఆడపడుచు దంపతులు, మా అమ్మాయి అల్లుడు తోడికోడలు అందరం రెండు కార్లలో బయలు దేరాం. అదే రోజు బయలుదేరితే చేరలేము అని ముందు రోజు రాత్రి కరీంనగర్ లో హోటల్ లో వుండి ఉదయాన్నే కాళేశ్వరం బయలు దేరాము ఒక్క గంట ప్రయాణం సజావుగా సాగింది. అంతే ఇంక ట్రాఫిక్ జామ్ లో వుండి పోయాము. వుదయం కాఫీలు తాగి బయలుదేరాము. కారు వెంబడి కార్లు మధ్య లో బస్ లు ట్రక్కు లు ఆటో లు రకరకాల వాహనాలు, దిగి నడుద్దాం అన్నా వీలు లేకుండా చిక్కుకపోయాము. కుంభ మేళ లో ఎంత రష్ వున్నా వెళ్ళి వచ్చిన ప్రతివాళ్ళు ఏర్పాట్లు చాలా అద్భుతముగా వున్నాయని చెప్పుతున్నారు. మంచినీళ్ళు, ఆహారము ముఖ్యంగా బాత్ రూమ్ లు శానిటేషన్ చాలా గొప్ప గా వున్నాయని చెప్పుతున్నారు. మా అమ్మాయి అమెరికన్ ఫ్రెండ్స్ కూడా యోగి ఆదిత్య నాథ్ గారినీ చాలా పొగుడు తున్నారు. ఆ రోజు మేము మంచి నీళ్ళ కూడా లేక చాలా అవస్థ పడ్డాము. మా అల్లుడు గారికి అలా వెళ్ళటం మొదటి సారి, అల్లుడు గారు వున్నారని మావారు కూడా ఎలాగో శాంతమ్ గా కూర్చున్నారు. ఆ దారి అంతా అడవి, ఆరోజుల్లో అన్నలు కూడా ఉండేవారని చెప్పుకునేవారు. అంతా ఆడవి కదా రోడ్లు కూడా అంత గొప్ప గా లేవు. మధ్య లో చిన్న పిల్లలు జామ కాయలు తెచ్చి అమ్ముతుంటే అవి కొనుకున్నాము. అలా ఆ ట్రాఫిక్ లో చిక్కుకొని 150కిలోమీటర్ల దూరం లో ఉన్న కాళేశ్వరం కు సాయంకాలం ఆరు గంటల కు చేరాము. ఇంక కార్ పార్కింగ్ నుంచీ గోదావరి నదికి కనీసం రెండు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. మా అమ్మాయి అయితే ఆ రాళ్ళు లో నడవడం అలవాటు లేక చాలా అవస్థ పడింది. ఆ చీకట్లో నే ఎలాగో స్నానాలు చేసి గుడికి వెళ్ళాము. మా అదృష్టం కొద్దీ అక్కడ పూజార్లు అభిషేకము, పూజలు బాగా శ్రద్ధ గా చేశారు. అక్కడే ఏవో ప్రసాదాలు కొనుక్కొని తిన్నాము. ఇంక తిరుగు ప్రయాణం కు మా రెండు కార్లు కు ఒక కారుకు మాత్రమే డ్రైవరు వున్నాడు. సరే రెండో కారు మా వారు, అల్లుడు డ్రైవ్ చేస్తున్నారు. ఆ డ్రైవర్ వరంగల్ వైపు వెళితే రోడ్డు బాగుంటుందని అన్నాడు. ఆ రోజుల్లో గూగుల్ లేదు కదా, రోడ్లు కూడా అంత డెవలప్ ఆవలేదు. ఆ డ్రైవర్ చెప్పాడు కదా అని అటు తిరిగాము. ఆ రోజుల్లో మైలు రాళ్ళ మీద నే ఊరి పేర్లు చూడాల్సిందే. మేము బయలు దేరిన ఒక గంట కల్లా వర్షం మొదలు అయింది. అంతా చీకటి. పైగా అడవి. వుదయం కనిపించిన కార్లు జనం మాయం. ఏ రోడ్డులో వున్నామో కూడా అర్థం కాలేదు. మాట్లాడితే ఈ మగవాళ్ళు ఎలా తిడతారు అని హనుమాన్ చాలీసా చదువుకుంటూ కూర్చున్నాము. భగవంతుడి దయ లాగా ఏవో మిణుకు మిణుకు అని దీపాలు కనిపిస్తే కార్లు అపారు. అది ఒక పెట్రోల్ బంక్. వర్షం కురుస్తూ వున్నా ఇద్దరు వున్నారు. వాళ్ళు మమ్మల్ని చూసి చాలా ఆశ్చర్యపడి పరకాల దాకా అన్నల ఏరియా అని రాత్రీ పూట ఇటు ఎవరూ రారు అని చెప్పారు వాళ్ళు కుడా వర్షం కారణంగా వున్నాము అని లేకపోతే వెళ్ళి పోతాము అని చెప్పారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ బంక్ లో నే కార్లు ఆపుకుని కూర్చున్నాము. అలిసి పోయి వున్నమేమో అలాగే నిద్ర పోయాము.ఈ రోజుల్లో అయితే ఈ హై వే అయినా పెట్రోల్ బంక్ లకు, డా బా లకు దేదీప్యమానంగా లైట్లు పెడుతున్నారు. కరెంట్ వేస్ట్ కదా అని ఎవరన్నా అంటే నాకు ఆరోజు గుర్తు వస్తుంది. వెంటనే ఆ సంఘటన గురించి చెప్తాను. తెల్ల వారు జామున లేచి బయలు దేరాం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కార్ వెంబడి కారు లో వెళ్తూ. ఒక రెండుగంటల ల్లో వరంగల్ చేరాము. వరంగల్ చూడగానే మాకు కలిగిన ఆనందం చెప్పలేము. ఆ డ్రైవర్ చెప్పిన మాట వరంగల్ దగ్గర గానీ ఆ రోడ్డు అంత సేఫ్ కాదు అని తెలియ లేదు. మధ్యాహ్నం పన్నెండు గంటల కు హైద్రాబాద్ చేరాము. అలా ముగిసింది ఆ గోదావరి పుష్కర యాత్ర. కార్ల లో చాలా సార్లు ప్రయాణము చేశాము కానీ ఎపుడూ ఏదో ఒక అనుభవం తో ముగుస్తుంది. లేడీ కి లేచిందే పరుగు అన్నట్లు మా వారు ఎపుడు పడితే అప్పుడు కారు లో బయలు దేరే వారు. ఒక్కసారి సరదా గా వున్నా కొన్ని సార్లు టెన్షన్ వస్తుంది. ఈ రోజు కుంభ మేళా గురించి అందరూ చెప్తుంటే ఈ విషయము గుర్తు వచ్చింది. ఇంకొక సారి ఇంకో ప్రయాణము తో
కుంభ మేళ
murthydeviv
Comments