కుండలినీయోగసాధన
- murthydeviv
- Dec 19, 2024
- 1 min read
ఈ పుస్తకం లో ఈ చాప్టర్ వున్నది . అయితే ఈ యోగ సాధన గురించి మాట్లాడటానికి కూడా నాకు అర్హత లేదు అనుకుంటాను . బ్రహ్మానందా నుభూతి పొందటానికి చేసే సాధనే కుండలినీ యోగం అంటారు ఆధునిక కాలంలో ఈ కుండలినీ యోగం సాధన ఫలించిన వారిలో ముఖ్యులు శ్రీ రామకృష్ణ పరమహంస, శుద్దానంద భారతి,పండిట్ గోపీకృష్ణ ,
స్వామి ముక్తానంద ,స్వామి సమర్ధ రామదాసు . ఈ రామదాసుగారే శివాజీ మహారాజ్ గారికి గురువు . కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన చైతన్యం కలుగదు . భగవంతున పై ఆర్తి వుండాలి అయన కొరకు వ్యాకులత చెందినపుడే ఆయన దృష్టి నీ మీద వుంటుంది అని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు . మనము అలాంటి వ్యా కులత పొందగలమా .సో మన యోగ సాధన మన ఇంటి వరకే పరిమితం. క్రియయోగం గురించి విని పరమహంసయోగానంద ఒక యోగి ఆత్మ కథ చదివాను ఆయన గురువులు లాహిరి మహాశయులు , యుక్త నంద భారతి గురించి చదివాను . అర్థమైంది చాలా తక్కువ అయితే చదవటం వలన ప్రయోజనం ఏమిటి అంటే మన దేశంలో ఎంతో మహాత్ములు జన్మించారు. వాళ్ళ గురించి తెలుసుకున్నాము అనే తృప్తి. లాహిరి మహాశయులు ఆశ్రమం కాశీలో వున్నది యుక్తనంద గారి ఆశ్రమం రాంచీలో వున్నది. రామకృష్ణ మఠం గురించి అందరికి తెలుసు. ఆ ఆశ్రమం చాలా యాక్టివిటీస్ చేస్తారు . ఎందరో మహానుభావులు అందరికి వందనములు.
Opmerkingen