ఎందరో మహానుభావులు
- murthydeviv
- Sep 21
- 1 min read
రోజూ ఈ నాడు పేపర్ లో ఎడిటోరియల్ పేజీ లో పైన ఒక చిన్న ఆర్టికల్ రాస్తున్నారు. మంచి ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి.అవి చదువుతూ ఉంటే మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది.ఈ రోజు ఇ సి ఐ ఎల్ వ వ్యస్తాపకులు. డా ఏ స్ రావు గారి నూట పదకొండో పుట్టిన రోజు సందర్భంగా ఈ ఆర్టికల్ రాసారు. అలాంటి గొప్ప వ్యక్తి మహానుభావుడు గురించి నేను చెప్పడం గొప్ప అవివేకం అని తెలుసు.కానీ అలాంటి మహానుభావుడి నీ నేను కలిశాను,అని గర్వంగా చెప్పు కోవాలని తాపత్రయం. ఈ సి ఐ ఎల్ 1970 లో ప్రారంభం అయితే మేము 1973 లో ఈ హైదరాబాద్ వచ్చాము.మావారు ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ గా ఉన్న టీ వీ కాంపోనెంట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ మొదలు పెట్టారు. మావారు ఏ ఎస్ రావు గారి సహకారంతో స్వయంగా ఆ కాంపోనెంట్ డిజైన్ చేసి ఈ సి ఐ ఎల్ కి సప్లై చేసే వారు. ఆ తర్వాత మా కంపోనెంట్ ఇండియా లో అన్ని టీవీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు కి సప్లయ్ చేసే వారు . తర్వాత ఏ స్ రావు గారు ఈ సి ఐ ఎల్ లో తయారు చేసే టీ వీ లు అసెంబ్లీ చేయటానికి మా ఫ్యాక్టరీ ను సెలెక్ట్ చేశారు. మా వారి నీ స్వంతంగా టీ వీ లు చేయడానికి ప్రోత్సహించి టీ వీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ను తన చేతుల మీదుగా ప్రారంభించి ఆయన ఆశీస్సులు అందించారు. ఎన్ని చేసినా ఆయన ఎంత నిగర్వి అంటే ఒకసారి మా వారి తో కలిసి వారి ఇంటికి వెళ్ళాను. ఆయన స్వయంగా మాకు మర్యాదలు చేశారు. వారి ఇంట్లో ఎంతో మంది పిల్లలు చదువు పూర్తి చేసి ఈ రోజు పెద్ద పొజిషన్ లో ఉన్న వారు వున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి నీ నేనూ కలిశాను అనే ఆనందం తో ఆ మహా వ్యక్తి కి చిరు కానుక గా ఈ నివాళి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.


Comments