top of page
Search

ఉద్యోగ పర్వము

  • murthydeviv
  • Dec 24, 2024
  • 2 min read

ఇంట్లో ఏమి తోచటం లేదు అని ఉద్యోగ గురించి సీరియస్ గానే మావారి నీ అడగటం మొ దలు పెట్టాను. నా ఫ్రెండ్ తన పేరు సూర్య కళ. అందరూ సూరి అని పిలిచే వారు .తను వాళ్ళ నాన్న గారికి పబ్లిక్ స్కూల్ లో ప్రైమరీ స్కూలు ప్రిన్సిపాల్ తెలుసు అని చెప్పింది. సూరి మాత్రమే నన్ను పేరు పెట్టి పిలిచేది . లేకపోతే అక్క అనేది . లేకపోతే అక్కడ అందరూ మిస్సెస్ రావు అనో మిస్సెస్ శర్మ, శాస్త్రి ఇలాగే పిలిచే వారు . మిస్సెస్ రావు ఏమిటీ ఏమీ రావూ అన్నట్లు అని నాకూ బాధ గా వుండేది. కానీ వాళ్లు అలా అలవాటు పడ్డారు. కనీసం మనమైనా పేర్లతో పిలుచుకుందామన్నా వాళ్ళు ఆ పేరులో ఏముందీ అనే వారు .సో అలాగా మిస్సెస్ రావు గా స్థిరపడిపోయాను. యూనివర్సిటీ లో అయితే కెమిస్ట్రీ లో రావు గారు ఉన్నారు కదా, అందుకని నేను ఫిజిక్స్ రావు ను అన మాట. నీకేలాగు ఫిజిక్స్ రాదు కదా అని మా వారు జోక్ మద్య లో అసలే ఈ రావు ఏమిటీ రా అని నా బాధ. సూరి చెప్పటం తో మేము వాళ్ళ నాన్న గారిని అడిగాము. ఆయన రెండు సార్లు స్కూల్ కి తీసికెళ్ళి ఆ ప్రిన్స్ పాల్ నన్ను ఇంటర్వూ చేసి ఫస్ట్ క్లాస్ కి టీచర్ గా వుద్యోగం యిచ్చాడు.a స్కూల్ అక్కడ మహారాజా స్టార్ట్ చేసిన స్కూల్. అక్కడే ఉదయం టీ , లంచ్ ఇచ్చేవారు . చాలా పెద్ద బిల్డింగ్స్ ప్యాలెస్ లాగా వుండేది. అక్కడ పిల్లలు టీచర్స్ ప్రిన్సిపాల్ నీ పేరు తో పిలిచే వారు. బహుశా మహారాజుల కాలం నటి అలవాటు అలా కంటిన్యూ అవుతుందేమో అనుకున్నాము. సో అక్కడ కూడా నేను మిస్సెస్ రావు నే . ఫీజులు బాగా ఎక్కువ గా వుండటం వలన బాగా డబ్బులు వున్న వాళ్ళ పిల్లలు చేరేవారు వాళ్ళు మహ అల్లరి చేస్తుండేవారు. ఆ స్కూల్ లో నా ఐడెంటిటీ నీ బాగానే ప్రూవ్ చేసుకున్నాను . అక్కడ చలి కాలం అయినా వుదయం 7.30 కల్లా స్కూల్ మధ్యాహ్నం రెండు గంటల కల్లా అయిపోయేది . ఉదయాన్నే ఏడు గంటలకు బస్ వచ్చేది . పొద్దున్నే పరిగెత్తటం కొంచెం కష్టం గావున్నా ఇంట్లో వూరికే వుండటం కన్నా ఈ వుద్యోగం బాగానే వుండేది మావారికి మాత్రం పాపము కొంచెం కష్టం గా వుండేది . ఆయన బస్ తీరిగ్గా తొమ్మిది గంటల కు వచ్చేది. ఇల్లు తాళం వేయటం వగైరా భాధ్యతలు ఉంటాయి కదా. ఈ క్రమంలోనే మా మూడో అన్నయ్య ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇండస్ట్రియల్ టూరు ఢిల్లీ వచ్చి మా వూరు కూడా వచ్చాడు. మా ఇంటికి వచ్చిన మొదటి ఆత్మీయుడు. అన్నయ్య నీ చూడగానే ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పలేను రెండు రోజులు వున్నాడు యూనివర్సిటీ కి వెళ్ళాము. అక్కడ ఎవరింటికి బంధు వులు వచ్చినా అందరూ ఇళ్ళకు పిల్చి చాలా మర్యాదలు చేసే వారు. అన్నయ్య కు నేను కొత్తగా నేర్చుకున్న అలుపరోటా లు చేసి పెట్టాను . తనకు చాలా నచ్చింది. మావూరు వెళ్ళాక మా అమ్మతో నాన్నతో కూడా చెప్పాడుట . అలా నా వంట ప్రావీణ్యం చూపించా నన మాట. మన పుట్టింటి వాళ్ళు మెచ్చుకుంటే ఆస్కార్ అవార్డు వచ్చినట్టే కదా. ఉద్యోగ పర్వము గురించి రేపు ఇంకా కబుర్లతో

 
 
 

Recent Posts

See All
అమ్మ తో ప్రయాణాలు

ఈ మధ్య అనుకోకుండా వంటరిగా చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. మా వారితో సాహస యాత్రలు చేయడం అలవాటు అయిన మా పిల్లలు కు, నాకూ అలా వంటరిగా...

 
 
 
మసాలా దోశ

ఈ రోజే మా కజిన్ ఫోన్ చేసి మీ ఊరులో మీ స్కూల్ ఎదురుగా ఉన్న హోటల్ పెట్టి 100ఇయర్స్ అయిందట మేము అందరం అక్కడ వాళ్ళు పెట్టిన స్పెషల్ మసాలా దోశ...

 
 
 
ఫ్యామిలీ డాక్టర్

తరుచుగా ఫేస్ బుక్ లో ఒక డాక్టర్ గారు చాలా బాగా పోస్ట్ లు రాస్తూ వుంటారు. ఈ రోజు పోస్ట్ చదువు తుంటే మా చిన్న తనం లో మా ఫ్యామిలీ డాక్టర్...

 
 
 

Comments


Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page