ఈ రోజు సాయంకాలం మా మనవరాళ్లు ఇద్దరినీ తో షాపింగు బయలు దేరాను. బంధువుల ఇంట్లో మే లో పెళ్ళి వుంటే ఎదో సరదాగా వాళ్ళకి లంగా ఓణి లు వేసి పాత రోజులు గుర్తు చేసుకుందామని ఆశ తో. మా ఇంటి చుట్టూ ఉన్న వివిధ రకాలైన పట్టు చీరల షాపుల్లో పట్టు లంగాలు వున్నాయా అని ఫోన్ చేస్తే లేవండి అని ఒకటే మాట. సరే ఒక రెండు రోజుల క్రితం ఆదివారం అయినా ట్రాఫిక్ లో ఈదుకుంటూ వెళ్ళి లంగాలు కొన్నాం. ఈ రోజు నా ప్రయాణము వోణి ల కోసం దగ్గర షాపు లో ఏదో సేల్ అని వుంటే వెళ్ళాము. అక్కడ సేల్స్ మాన్ కు హిందీ తప్ప ఇంకే భాష రాదు. మా పిల్లల కు అమెరికన్ ఇంగ్లీష్ తప్ప ఇంకేం రాదు. మూడు భాషలు మాట్లాడే ముసలమ్మ ను నేనే నా గ్రాండ్ చిల్డ్రన్ అతి జాగ్రత్తగా నన్ను పట్టుకొని నడిపిస్తూ వుంటారు. ఇంక ఎవరయినా నాకు ఏమీ రాదనే ఐడియా లోనే వుంటారు. ఇంక అక్కడ నా ప్రతిభ కనబరచి వాళ్ళకు ఇంగ్లీషులో షాపు వాడికి హిందీలో ఏదో తిప్పలు చెప్పాను ఏవో కొన్ని సెలక్ట్ చేశాము. ఇంక వాళ్ళ అమ్మ లకు వీడియో కాల్ చేసీ షాపు లో అమ్మాయి తో లంగా వోణి లాగా అలంకరించి ఇన్ని తిప్పలు పడినా ఒక వోణి మాత్రమే సెలక్ట్ అయింది. షాపు వాడు మా కొండాపూర్ షాపులో ఇంకా ఎక్కువగా వైరిటీస్ దొరుకుతాయి వెళ్ళండి అన్నాడు ఇంక ఆ ట్రాఫిక్ మహా ప్రవాహము లో మరలా ఈదుకుంటూ వెళ్ళాము. కారు లో మా మనవరాలిని అమ్మ ఏమన్నదీ అన్నాను. అమ్మ బాగుంది అని సమాధానం, ఇంతలో డ్రైవర్ సార్ ఆఫీసు లోనే వున్నారు చిన్న మేడమ్ కి ఏమయింది అన్నాడు. ఆపుడు హతవిధీ అనుకుంటూ పాప వోణి బాగుందని అమ్మ చెప్పిందని చెప్తున్నదిరా అన్నాను. పాప కు తెలుగు సరిగా రాదమ్మా అన్నాడు. నేను వాళ్ళకు ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ ఎలా యూస్ చేయాలో కొంచెం ఎక్సప్లెయిన్ చేశాను. ఓకే ఓకే ఆంటూ ఇద్దరూ అమెరికన్ స్లాంగ్ లో అనటం తప్పితే ఏమీ అర్ధం అయిందో తెలియదు. ఈ రోజుల్లో ఈ వాట్స్ ఆప్ భాష వచ్చాకా ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడరు. బ్రదర్ కు బ్రో అంటూ అన్నిటికీ యా, యా అంటూ అన్నీ భాష లు ఇలా అయిపోయినవి అనే బాధ వస్తుంది. టెన్త్ క్లాస్ పరీక్షలు అయిపోగానే ఇంక తెలుగు చదవక్కర్లేదు అని అనందం గా చెప్తోంది మా ముద్దుల మనవరాలు త్వరగా చచ్చి పోయే భాషల్లో తెలుగు ఒకటి అని ఎక్కడైనా చదివితే బాధ వస్తుంది మాతృ భాష నేర్చు కోవాలని, నేర్పాలనే ఉత్సాహము లేకపోతే భాష అంతరించి పోవటం ఖాయం. ఇకనైనా మన సోదర రాష్ట్రాల ప్రజలు దగ్గర నుండీ నేర్చుకుంటే బాగుండు. మనం బాధ పడితే ఏమవుతుంది అని ఒక వేదాంతము ముసుగు వేసుకుంటే మంచిది అనుకుంటూ షాపులో కి వెళ్ళాను. మరలా విడియో కాల్ తో రెండు వోణీలు తీసుకున్నాము. మా మూడో మనవరాలికి వీడియో చేసీ అడిగితే అమ్మమ్మ కొంటున్నది కాబట్టి తననే సెలక్ట్ చేసి నన్ను సర్ప్రైజ్ చేయమను అన్నది. తనకు వంటలు చేయడం సరదా, పాస్తా చేస్తున్నాను మీరు డిన్నర్ కి రండి అంటూ ఇన్వైట్ చేసింది.ఈ వీడియో కాల్స్ చూస్తుంటే మా ఆమెరికా చెల్లెలు కూతురి పెళ్లి గుర్తు వచ్చింది ఆపుడు వీడియో కాల్స్ లేవు ఫోటో లు పంపటం మరలా వాళ్ళ అప్రూవల్ ఆరోజు రాక పోతే మర్నాడు మరలా షాపు నీ పావనం చేయటం. అలా వోణి ల ప్రహసనం ముగిసింది. ట్రాఫిక్ వల్ల నో వయసు వల్లనో షాపింగు అంటే ఇంట్రెస్ట్ పోయింది. కొస మెరుపు ఏమిటంటే షాపు వాడు మా పిల్లలు యుఎస్ నుండి ఎపుడు వచ్చారు అని అడిగాడు. నేను కూడా శ్రీదేవి కంటే కొంచెం బెటర్ గా ఇంగ్లీష్ లో మేము ప్రాపర్ తెలుగు వాళ్ళము, ఇప్పట్లో యుఎస్ వెళ్లే పని లేదు అని చెప్పాను. ఏదో కాసేపు సరదాగా ఉంటుంది అని కబుర్లు. కానీ భాష గుఱించి ఆలోచిస్తే మా నాన్న గారు, మామ గారు తప్పక గుర్తు వస్తారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ వుంటే మా నాన్న గారు వేళ్ళ మీద పెన్సిల్ తో ఒకటి వేసే వారు అందుకే ఇప్పటికీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అంతగా పడవు మనకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిన వాళ్ళకు ఏ లోకంలో ఉన్నా నమస్కారం ల తో
ఇంగ్లీష్ వింగ్లీష్
murthydeviv
Comments