top of page
Search

ఇంగ్లీష్ కూరలు

  • murthydeviv
  • Sep 19
  • 3 min read

ఉదయాన్నే కాఫీ తాగుతూ పేపర్ చూడటం ఇప్పుడు పాత అలవాటు అయిపోయింది ఉదయాన్నే కళ్ళు తెరుస్తూనే సెల్ ఫోన్ చూసుకుంటున్నారు పిల్లల తో సహా, స్కూలు కి వెళ్ళే హడావిడి లో కూడా ఒకసారి ఫోన్ చూసి తర్వాత వెళ్తుంది. మా మనవ రాలు.స్కూలు లో సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళనివ్వరు అందుకే వదిలి వెళ్తుంది. నేను కూడా పూజ కి వెళ్ళే హడావిడి ఉన్నా మా కుక్ వచ్చే లోపల ఒకసారి వాట్సాప్ మెసేజ్ లు చూస్తాను. మనకు వచ్చే అర్జెంట్ మెసేజ్ లు ఏమి ఉండకపోయినా ఒక సారి చూస్తే అదొక తృప్తి ఈ రోజుమెసేజ్ లో ఎవరో మన కూర గాయాలు కు, పండ్లు కి సంస్కృత పదాలు వున్న మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనం నైవేద్యము పెడుతూ ఉన్నప్పుడు కొన్ని పేర్లు మనకు తెలియవు. మా ఇంట్లో పూజారి మాత్రం యాపిల్ పండు నైవేద్యము కి ఇస్తే కాశ్మీర ఫలం అని చెప్తూ వుండేవారు.నేను దుర్గా అష్టమి రోజున ఎర్రగా ఉంటుంది అని క్యారెట్ తో హల్వా లాగా చేసి నైవేద్యము పెడుతూ ఉన్నప్పుడు ఏం చెప్పాలో తెలియక శాఖా పాయసం అనేదాన్ని. నాకు ఉదయం ఈ మేసేజ్ చూడగానే పొత్తూరి విజయ లక్ష్మీ గారు రాసిన ఒక కథ గుర్తు వచ్చింది.ఆ కధ పేరు ఇంగ్లీష్ కూరలు.ఆ కథ చదివి చాలా రోజులు అయినా ఎపుడూ నా రూమ్ లో ఆ బుక్ వుంటుంది. మన చిన్న తనం లో మధ్య తరగతి జీవితాల్లో నీ సంఘటనలు సరదాగా వ్రాశారు. ఎపుడైనా లైట్ గా చదువుకోవాలి అనిపిస్తే చదువుతూ ఉంటాను.ఆ కథ లో రాసినట్లు గానే, మా ఇంట్లో కూడా మా పెద్ద నాన్న గారు అప్పటి చెన్న పట్నం నుంచి కూరలు, పండ్లు తెస్తూ వుండే వారు . అప్పట్లో మావూరి లో అంతగా పండ్లు అవీ దొరికేవి కాదేమో. మా తాత గారికి కోసం డ్రై ఫ్రూట్స్ ఇంకా బత్తాయి పండ్లు, ఇంకా చాలా చిన్న సైజ్ లో ఉండే అరటి పండ్లు తెప్పిస్తూ ఉండే వారు. అలాంటి అరటి పండ్లు నేను. మరలా ఎక్కడా చూడ లేదు . A రోజుల్లో తినటం తప్పితే ఇంక వేరే పరిజ్ఞానం ఉండేది కాదుకదా. ఆరోజుల్లో క్యాబేజ్, క్యారెట్, కాలిఫ్లవర్ క్యాప్సికమ్, టమాటా కూడా ఆ ఊర్లో దొరికేవి కాదు . మా పెద్దనాన్న గారు ఆ కూరలన్నీ తెచ్చినా నైవేద్యము కి వాడే వాళ్ళు కాదు . మా నాయనమ్మ గారు అయితే ఆ కూరలు తినేవారు కాదు a కూరలు అన్నీ సాయంకాలం పూట వండాల్సిందే. ఇంక బీట్రూట్ అయితే ఆ కలర్ చూసి ఎలా తింటారో అంటూ వుండేది. ఇంక క్యాప్సికమ్ అయితే మద్రాస్ నుంచి తెచ్చినా దాని పేరు బెంగుళూరు మిరపకాయలు అనే వారు . ఆరోజుల్లో అవి కూర చేస్తారు అని తెలియక సాయంత్రాలు అన్నం లోకి మిర్చి బజ్జీలు లాగా చే సే వారు. కారం కోసం ఏం చేసే వారో తెలుసు కోలేదు..నేను పంజాబ్ వెళ్ళాక నే ఆ క్యాప్సికమ్ ను కూర చేస్తారు అని తెలిసింది. అక్కడ ఆ కూర ను సిమ్లా మిర్చి అనే వారు. పంజాబ్ లో ఏ కూర అయినా ఒకటే పద్ధతి ఉల్లిపాయ, టమోటో, ముక్కలు వేసి ఏ కూర అయినా అందులో వేసి ఇంత మసాలా వేయడం. వాళ్ళ కు మన లాగా ఇన్ని రకాలుగా , కొత్తిమీర కారం. ఉల్లి కారం, అవ పెట్టటం, అల్లం మిర్చీ ఇన్ని రకాలు ఉండవు. బీట్రూట్ తో అయితే పులుసు లాగా పెట్టే వాళ్ళు మా అమ్మ గారు. మా పెద్ద అమ్మాయి తినదు కానీ మిగతావాళ్ళు బాగానే తింటారు. ఇంక నేను హైద్రాబాద్ వచ్చాక కూడా చాలా రోజులు కూరలు షాపు కి వెళ్లినప్పుడు సిమ్లా మిర్చి ఇవ్వు అని అడిగే దాన్ని. వాడు కన్ఫ్యూజన్ గా చూస్తే నాలిక కరుచుకుని కాప్సికం అనే దాన్ని. ఇన్ని ఇంగ్లీష్ కూరలు కథ చెప్పాను కదా. అసలు ఇంగ్లీష్ దేశంలో ఎలా ఫీల్ అయ్యానో రాయాలి కదా. అదే నేను యూ ఏస్ వెళ్లినప్పుడు, నాకు ఏమిటి ఎవరికయినా అక్కడ కూరలు సైజులు చూస్తే మా నాయనమ్మ లాగా ఎలా తింటారో అనిపిస్తుంది. ఏ కూర అయినా నీటితో నిండి ఉంటుంది. ఆ నీరు అంతా ఇంకి కూర పొడి గా రావాలంటే కనీసం గా ఒక గంట పడుతుంది. ఏ కూర అయినా ఒకటి వండితే చాలు. వంకాయలు కాకరకాయలు అమెరికన్ల సైజ్ లో ఉంటాయి. ఇపుడు అన్నీ రకాలు దొరుకుతున్నాయి కానీ ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం అన్నీ దొరికేవి కాదు. మన కాలిఫ్లవర్ లాగా ఆకుపచ్చని బ్రోకలీ అని దొరికేది. మా చెల్లెలు మామూలు గా కొంచెము పెసరపప్పు వేసి చేసేది. బాగుండేది. అపుడు అక్కడ రెడ్, ఎల్లో కలర్ క్యాప్సికమ్ లు చూసి ఆశ్చర్యం పోయాను. ఇపుడు ఇక్కడ కూడా రకరకాల క్యాప్సికమ్ , బ్రోకలీ దొరుకుతున్నాయి. యూ ఏస్ లో కాప్సికం ను బెల్ పెప్పర్ అంటారు. ఏదో వంట చేయాలి తినాలి అని చేయటం తప్పితే కొత్త గా ఎక్స్పెరిమెంటల్ గా చేయడం అలవాటు లేదు . పిల్లలు, మా వారు కూడా బయట ఏవో చెత్త తినటం తప్పదు కాబట్టి ఇంట్లో మన వంట లు లైక్ చేస్తారు. సో నాకూ కొత్త వంట ల బాధ లేదు. కానీ మా రెండో అమ్మాయి కూతురు కి కొత్త రకం వంటలు చేయడం చాలా ఇంటరెస్ట్. ఎవో చీస్ లు పన్నీర్ లు వేసి కొత్త వంటలు చేసుకుని తింటూ వుంటుంది. యూ ట్యూబ్ లో చూసి చేస్తూ వుంటుంది ఆ పాప వయసు పన్నెండు ఏళ్ళు మాత్రమే. కొసమెరుపు ఏమిటంటే ఈ మధ్య మా పొలాలు చూడటానికి మా పల్లెటూరు వెళితే ఇక్కడ బ్రోకలీ, అలాంటి కూరలు దొరకవు కదా, అవి మనం పండిద్దాం అమ్మమ్మా అని అడిగిందిఆరోజు అక్కడ పొలం లో చిక్కుడు కాయ , మిర్చి తోట వేశాడు. అవీ ఇంగ్లీష్ కూరలు కథ మరి గుడ్ నైట్

 
 
 

Recent Posts

See All
దీపావళి కొన్ని జ్ఞాపకాలు

అన్ని పండుగల్లో కి విశిష్టత గల పండుగ దీపావళి. దేశము మొత్తం జరుపుకునే పండగ , అంతే కాక ఈ మధ్య ఇతర దేశాలు సైతం , ఈ పండుగ సందర్భంగా కొంత ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు వ్యాపారాల్లో

 
 
 
ఆ పాత మధురాలు

కొన్ని పాటలు వింటూ ఉంటే ఎన్ని సార్లు విన్నా విసుగు రాదు అనిపిస్తుంది . అందులో హేమంత్ కుమార్ గారి స్వరం ఒక విధమైన మాధుర్యం తో వుంటుంది. లోకో భిన్న రుచి అనుకోండి. కొంత మందికి నచ్చక పోవచ్చు. పాత కాలంలో

 
 
 
డ్రెస్ కోడ్

.ఏదో స్కూల్ డ్రెస్ లాగా ఈ హెడ్డింగ్ ఏమిటో అనుకోకుండా కొంచెం ఓపికగా చదివితే మీకే తెలుస్తుంది కదా , దసరా హడావిడి పూజలు కోలాటాలు బతకమ్మ డాన్సులు అయినాయి పిల్లలు కు హాలిడేస్ అనిఅమ్మాయి ఉదయాన్నే బ్రేక్ఫాస

 
 
 

2 Comments


GS Sarma
GS Sarma
Sep 19

బీట్రూట్ కూర చూస్తే నాకూ మీ నాయనమ్మ గారి లాగే అనిపిస్తుంది!.మన తెలుగు కూరల ముందు ఈ ఇంగ్లీష్ కూరలు ఏం అనతాయి రుచిలో, ఏదో ఫాషన్ కో గొప్పకో వండుకోడం తప్పితే!

Like
murthydeviv
Sep 20
Replying to

Corrct కానీ for a change. అపుడు అపుడు వండాలి కదా మరి ప్రవాసం లో ఉన్నప్పుడు ఎలాంటి కూరలు వండే వాళ్ళు క్యారెట్ బీన్స్ క్యాబేజీ బాగానే ఉంటాయి క్యాబేజీ కి అవ పెట్టీ వండే వాళ్ళు ఉన్నారు ఆ ఇంగ్లీష్ కూరలు మా వారికి కూడా నిషిద్ధమే

Like

Subscribe here to get my latest posts

© 2035 by The Book Lover. Powered and secured by Wix

  • Facebook
  • Twitter
bottom of page