ఆవకాయ కథ 5
- murthydeviv
- Nov 15, 2024
- 2 min read
మరుసటి ఏడు కొంచెం ప్రమోషన్ వచ్చింది మా యింట్లో ఒక తెలంగాణ వంట ఆవిడ వచ్చింది ఆవిడ ఆవకాయ కు వరంగల్ కారం అయితే ఎంతో.రుచి రంగు అని మా చేత ఆ కారం కొనిపించిది ఆ కారం తో ఆవకాయ అయితే చూపుల గుఱ్ఱం లాగా ఎర్రగా వుంది కానీ అసలైన ఆవకాయ ఘాటు కారం.లేదు మా ఇంట్లో వాళ్లంతా ఒక చెంచా బదులు నాలుగు చెంచాలు వేసికుని అబ్బే కారం లేదు కమ్మగా వుంది అని పెదవి విరిచారు ఆవిడ మాత్రం అబ్బో మీ ఇంట్లో ఎంత ఆవకాయ తింటారమ్మ ఉదయం జాడి నిండా తీస్తే సాయంకాలం అయిపోతుంది అని సర్టిఫికెట్ ఇచ్చింది ఆ మరుసటి ఏడు మా అన్నయ్య భార్య గోదావరి జిల్లా ఏలూరు నుండి వచ్చింది వదిన కు ఇన్ని. కాయలు కు ఇంత ఉప్పు కారం ఆవపిండి అని బాగా తెలుసు వదిన పులిహోర ఆవకాయ నువ్వుల ఆవకాయ బెల్లం ఆవకాయ ఆలా ఎన్నో రకాలు ఆవకాయ లు ట్రై చేసే వాళ్ళం ఒక ఏడాది ఇద్దరం ఒకే సారి నూనె ఆవపిండి కారం కొని ఆవకాయ పెట్టాము మొత్తం ఆవకాయ మట్టి కంపు ఆ కంపు కారం వల్లనా నూనే వల్లనా అని ఇప్పటికీ నిర్ణయించ లేక పోతున్నాము ఇంక ఆ ఏడాది మా వారు అన్నయ్య మమ్మల్ని మాటల్తో ఎంత సత్కరించారో చెప్పక్కర్లేదు కదా ఆ తర్వాత ఏడాది ఇద్దరు కలిసి పెట్టకండి కనీసం ఒకరి ఇంట్లో అయిన రుచిగా వుంటుంది అని మా ఐక్యత ను విడదీయాల నీ చూశారు మా వదిన కు వాళ్ళ మీద మరీ కోపం వచ్చినప్పుడు నీ వే వాళ్లు ఇంటి పని పట్టించుకోకుండా చేసావు నీవే అన్నీ పన్లు చేస్తావు వాళ్ళ కు వంకలు పెట్టటం తప్పితే ఏమి రాదు అనేది వదిన వాళ్ళ బావగారు ఇంటి గురించి అన్నీ పట్టించుకుని చేసే వారు ఒక ఏడాది మా అత్తగారి ఆద్వర్యం లో ఇంట్లో నే ఆవపిండి కారం అవి తయారు చేసి ఆవకాయ పెట్టాము చాలా పని అయినా అన్నీ రెడీ మేడ్ గా దొరుకుతుంటే ఇంత శ్రమ ఎందుకు అని మా నుకున్నాం ము మా చిన్నతనం లో ఆవకాయ పెట్టటం అంటే ఎంత కష్టం కారాలు ఆవపిండి ఇంట్లో నే కొట్టించి జల్లించి కాయలు తెచ్చాక ముక్కలు కూడా ఇంట్లో నే కొట్టించి అదొక యజ్ఞం లాగా వుండేది ఇప్పటికీ నాకు బాగా గుర్తు కారం ఆవపిండి ద్దంచుతున్నారు ఘాటు గా వుంటుంది లోపలే వుండడి అని అమ్మ ఆర్డర్ మా బామ్మ గారి మడికి ఏమాత్రం లోపం జరిగినా మా పిల్లలందరికీ ఒక గంట సేపైనా లెక్చర్ వుండేది ఆరోజుల్లో ఊరగాయలు పెట్టటానికి అంత హడావిడి అంత మడి ఆచారం వుండేది
Komentar