ఆవకాయ కథ
- murthydeviv
- Nov 12, 2024
- 1 min read
ఆవకాయ కు కదా ఏమిటి అనుకుంటున్నారా కానీ, అవకాయకు తెలుగు వాళ్ళకి ఎంత అనుభందం ఆవకాయ చుట్టూ ఎన్ని కధలు. చెన్నపట్టణంలో, తమిళుల తో కలిసి ఉన్నపుడు వారికీ అరుచి,ఘాటు చూపాము ఇపుడు తెలంగాణ లో మనవునికి ఆవకాయ తోనే ఎందుకంటె ఎం మార్కెట్ కి పోయిన,ఆంధ్ర ఆవకాయ, ఎండాకాలం జోరు రెండు ఒకటి గానే ఉంటాయి అందుకే కధ ఏమిటి. ఒక నవల రాసేయచ్చు. భానుమతి గారి కధల్లో అత్తగారి చేత ఆవకాయ పెట్టించారు. సరే అసలు సిసలు మన శ్రీ ముళ్ళపూడి గారు ఏకంగా ఒక ప్రభుత్వ ఆఫీసర్ గారు కి రెండు ఆవకాయ జాడీలు,కొత్త ఆవకాయ తో బహుమతి గ ఇప్పించారు. మనవడు ఉద్యోగం కోసం బామ్మ అమ్మమ్మ పోటీ పడీ కంద వేపుడు ఆ కొత్త ఆవకాయ ఆఫీసర్ గారు కి రుచి చూపిస్తారు. కథ చాల బాగుంటుంది. నేను ఆవకాయ నేర్చుకోవడానికి కూడా ముళ్ళపూడి గారి బామ్మ గారి లాంటి వల్లే కారణం. మరీ నేను కథ రాసేటపుడు వాళ్ళని తలచుకోవాలి కదా. ప్రస్తుతం అత్తగారిని అయినా కోడలుగా ఉన్నపుడు నించి రక రకాల ఆవకాయ లు పెట్టి బాగా కుదిరినప్పుడు అందరు మెచ్చుకొంటాయి చాల గర్వాంగా ఫీల్ అయ్యి బాగా కుదరని అపుడు మా వారు, పిల్లలు,"అబ్బే, ఘూటు లేదు. ఇదేమి ఆవకాయ" అంటే తెగ భాధపడిపోయి ఈసారి బాగా పెట్టాల్సిందే అనుకుంటాను. ఈ మధ్యనే న మనవరాలు "స్టేట్" అంటే ఏమిటి అని అడిగింది. నేను దానికి వివరించి మనం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నాము అని చెప్పాను. వెంటనే నా మనవడు "మనం తెలంగాణ లో ఉన్నాము అమ్మమ్మ " అన్నాడు. తెలంగాణ లో ఉన్నా , అమెరికా లో ఉన్నా ఆవకాయ అంటే నోరూరని తెలుగు వాడు ఉంటాడా? మిగతా రేపు
Comments