ఆవపిండి లో కొద్దిగా మరిగే. నీళ్ళు పోసి తరువాత తగినంత ఉప్పు కారం.వేసి నూనే లో ముక్కలన్నీ తడిపి నీళ్ల ఆవకాయ. ఆవపిండి బదులు పెసరపిండి వేసి పెసర ఆవకాయ ఆవపిండి బదులు మెంతి పిండి వేసి మెంతి ఆవకాయ ఎక్కువ గా అసలైన ఆవకాయ పెట్టీ బామ్మగారు మాకు ఎలా చేయాలో పాఠాలు చెపుతూనే వున్నారు అన్నీ చేశాక ఊరగాయలు పిండి వంటలు ఎంత శ్రద్ధగా చేయాలో నేర్చుకోండి అని మాకు సలహా ఇచ్చి బామ్మ గారు నిష్క్రమించారు మిగతా కాయల్తో మాగాయ ముక్కలు తరిగి ఊరేసి నేను అక్కయ్య ఊపిరి పీల్చుకున్నాం మూడో రోజున అన్ని తిరగ కలిపి జాడిల్లో పెద్దమ్మ సర్ది ఇలా చేయాలి నేర్చుకోండి మేమూ పెద్ద వాళ్ళం అవుతున్నా ము అని ఇంకో పాఠం చెప్పింది ఆవకాయ మగాయి జాడీ లు తీసుకుని మా పుట్టింటి కి వెళ్ళ గానే మా అమ్మ బోలెడు ఆశ్చర్య పోయి ఏమిటి ఇవ్వన్నీ నీ వే చేశావా అని అడిగింది కాలేజీ లో చదువు కొనే టపుడు తినటం తప్ప ఎలా చేశారో కూడా తెలుసు కొనే దాన్ని కాదు. ఎప్పుడయినా మా వదిన సరదాగా కాఫీ కలుపు అంటే నేను కాఫీ తాగనుగా నీవే కలుపు కో అని చెప్పేదాన్ని ఆవకాయ బాగుంది అని అమ్మ మెచ్చుకుంటే నిజంగానే నే నే పెట్టీ వుంటే బాగుండేది కదా అని ఫీల్ అయ్యాను మా అత్త గారి కి కూడా ఒక జాడి ఆవకాయ ఇస్తే ఆవిడ కూడా ఓహో మా డిగ్రీ చదివిన కోడలు కు ఆవకాయ పెట్టటం వచ్చు అని సంతోషించారు ఆలా మొదటి ఏడాది ఆవకాయ కథ అద్భుతంగా ముగిసింది
murthydeviv
ఆవకాయ 4
Updated: Nov 15
Comments