ఆకాశ దీపం
ఆకాశ దీపం
కార్తీక మాసం అనగానే ఇల్లు మనసు ఏదో తెలియని శోభ తో వెలిగి పోతూ వుంటాయి ..
వెలుగుల శోభ ఇంటి నిండా పెట్టే దీపాలతో అయితే మనసులో మన జ్ఞాపకాలు వెలుగుల శోభ తో ఆనందం కలిగిస్తూ వుంటాయి.
ఏకాదశి ,క్షిరా బ్ది ద్వాదశి పూజలు చేస్తుంటే మా ఆత్త గారు , బామ్మ గారు చేసిన పూజలు గుర్తు వస్తాయి.
ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే కాఫీ కూడా తాగే వాళ్ళు కాదు బామ్మ గారు వాళ్ళు. ఆరోజు బియ్యపు రవ్వతో ఉప్పు పిండి అని చేసే వారు. అందులో ఒక్క జీలకర్ర తప్పితే ఏమీ వేసే వారు కాదు . అయినా ఏమీ టో చాలా రుచిగా ఉండేది. బహుశా కుంపటి మీద చేయటం వలన అనుకుంటాను. ఆరోజు అంతా బామ్మ గారు వత్తులు చేస్తూనో, ఏదో జపం చేస్తూనో వుండే వారు.
ద్వాదశి నాడు తప్పకుండా ఒక బ్రాహ్మణు డిని భోజనానికి పీల్చే వారు.
ద్వాదశి ఘడియలు వెళ్లకుండా భోజనం చేయటం అనేది చాలా ముఖ్యంగా పాటించే వారు.
మరలా సాయంత్రం తులసి కోట చుట్టూ కడిగి ముగ్గులు వేసి ధాత్రి సమేత లక్ష్మీ నారాయణ అంటూ విగ్రహాలు పెట్టీ పూజలు చేసే వారు.
చిన్నప్పుడు మా బామ్మగారు మా చేత దీపాలు పెట్టిస్తే , మా ఆత్త గారు మా పిల్లలు చేత అలాగే పెట్టించే వారు.
నిన్న మా మనవరాలి చేత దీపాలు పెట్టిస్తూ ఆ కధలు అన్నీ చెప్పాను.
మా చిన్న బామ్మగారు లక్ష వత్తులు నోము కోసం ఎప్పుడూ వత్తులు చేస్తూ ఉండేవారు..
అవ్వన్నీ లెక్క పెట్ట మని మాకు ఇచ్చే వారు , ఒక వంద వత్తులు అవగానే దారం టో కట్టి ఒక పెట్టె లో దాచే వారు
ఈ రోజుల్లో లాగా అన్నీ రెడీ మేడ్ గా నోములు చేయటం లేదు. ఇప్పుడు ఒక లక్ష రూపాయలు కడితే అన్నీ సామాన్లు తెచ్చి నోము పూర్తి చేయిస్తారుట. బామ్మ గారు ఆ వత్తుల నోము చేసారో లేదో నాకు గుర్తు లేదు కానీ ఎప్పుడు వత్తులు లెక్క పెట్టీ ఇవ్వటం మాత్రమే గుర్తు ఉండి పోయింది.
మా ఆత్త గారు కూడా నిష్ఠ గా ఉపవాసం ఉండేవారు. ఆవిడ ఏకాదశి గురువారం అనే నోము పట్టా రుట. ఇంకా సూర్య చంద్రులు నోము , ఈ రెండు నోములు కీ ఉద్యా పన ఇక్కడే చేసుకున్నారు.. దంపతులు కూర్చుని హోమం చేసుకోవాలి.
మా మామ గారు పెద్ద వయసు అయినా ఓపికగా కూర్చుని చేసుకున్నారు. అరోజుల్లో వాళ్లకి అంత శ్రద్ద భక్తి ఉండేవి.
మా అత్తగారు నా చేత కూడా ఆ నోములు చేయిద్దాం అనుకున్నారు కానీ , ఆ ఉద్యా పన లకు కూర్చునే ఓర్పు మా వారికీ ఉండాలి కదా , అందుకే నేను అలాంటి నోముల జోలికి లేదు.
ఆరోజుల్లో వాళ్లకు వున్నంత భక్తి శ్రద్ద లేక పోయినా ఏదో వుడతా భక్తి గా నేను తులసి పూజలు చేశాను. మా కోడలు
మనవరాలు దీపాలు పెట్టారు.
కార్తీకమాసం లో వన భోజనాలు కీ వెళ్లక పోయినా ఏదో గుడి కీ వెళ్దాం అని నిన్న బయలు దేరాము కొత్తగా మేడ్చెల్ దోవ లో బదరి నారాయణ గుడి ఆనుకున్నాను.
బయలు దేరటం ఆలస్యం అయిపోవటం తో జియా గూడ రంగనాధ స్వామి గుడికి వెళ్ళాము. ఆ గుడి చాలా పురాతన మైన గుడి , ఒక పది ఏళ్ల క్రితం ఒక్కదాన్నే వెళ్ళాను.
పిల్లలు చూడ లేదు కదా అని వెళ్ళాము .షరా మాములుగా గూగుల్ గారు ఏన్నో చిన్న చిన్న రోడ్స్ అన్నీ తిప్పి తీసుకుని వెళ్ళింది.
గుడి మూసేస్తారేమో అని నాకు టెన్షన్ , మేము వెళ్ళేటప టికీ ఆకాశ దీపం పెడుతున్నారు.
ఏన్నో రోజుల తర్వాత ఆకాశ దీపం చూసాను. సాధారణంగా ఆకాశ దీపం గుడిలో నే పెడతారు. కానీ మా తాతగారు కార్తీక మాసం లో ఇంటి ముందు ఒక స్తంభం పాతిపెట్టి ఆకాశ దీపం పెట్టించే వారు
కార్తీక మాసం రాగానే రంద్రాలు తో వుండే ఒక ఇత్తడి సిలిండర్ షేప్ లో వుండే
ఒక డబ్బా లాంటిది ఉండేది. అందులో ఇత్తడి ప్రమిదలు పెట్టే వారు .
రోజూ సాయంత్రం అందులో దీపం పెట్టీ మెల్లగా తాడు తో పైకి లాగి ఆ తాడు
స్తంభం కీ కట్టే వారు.
చిన్నప్పుడు బామ్మ గారు తర్వాత మా ఆమ్మ గారు పెట్టే వారు
అనుకోకుండా అక్కడ ఆ ఆకా శ దీపం చూడగానే ఎంతో ఆనందం కలిగింది.
వారం రోజుల నుండీ తలుచుకుంటూ వున్న పెద్దలు ఆశీర్వదిస్తూ వున్నట్లు అనిపించింది.
నా పక్కనే నిలబడిన మా పెద్ద అమ్మాయి నా చిన్నప్పుడు అమ్మమ్మ ఇలా చేయటం నాకు లీల గా గుర్తు వున్నది అమ్మా అని చెప్పింది.
కొన్ని సంఘ టనలు ప్రతీ వాళ్లకి ఆలా జ్ఞాపకాల్లో నిలిచి పోతాయేమో .
గుడిలో అర్చన హారతి అయ్యాక , దగ్గర లో నే వున్న కేసరి హనుమాన్ గుడికి వెళ్ళాము .
విశాలామైన ప్రాంగణంలో వుంటుంది . గుడి లోకి మెట్లు దిగి వెళ్ళాలి , మగవాళ్ళు మాత్రమే వెళ్ళాలి.
మనం బయట కిటికీ లో నుండీ చూడాలి. సమర్థ రామదాసు గారు ప్రతిష్ట చేసిన గుడి అని చెప్పారు. అక్కడ పూజా రులు కూడా వంశ పారాంపర్యంగా వున్నవారుట.
ఆ గుడి లో ప్రశాంతం గా ఉండి అక్కడే ఇంకా కాసేపు ఉందాము అనిపించింది.
జియా గూడా గుడి ఈ మధ్యలో రెనవేట్ చేశారేమో అనిపించింది.
గుడిలో దీపాలు పెట్టీ కార్తీక దామోదరా అని నమస్కరించు కున్నాము.
మా పెద్ద అమ్మాయి నక్త వ్రతం చేస్తుంది. నేను చాలా ఏళ్లు చేశాను , ఇప్పుడు ఆరోగ్య
కారణం వలన ఏ వ్రతం లేదు .
ఉదయం ఒక రెండు గ్లాస్ లు మంచి కాఫీ అవగానే ఒక పెద్ద గ్లాస్ రాగి జావ
మాత్రలు టేబుల్ మీద
రెడీ గా పెడ్తుంది మా చెలికత్తె
శుభరాత్రి పౌర్ణమి కబుర్లు తో మరలా వెలుగు జిలుగులు
Comments